Advertisementt

సినీజోష్ రివ్యూ: రావణాసుర

Fri 07th Apr 2023 01:47 PM
ravanasura review  సినీజోష్ రివ్యూ: రావణాసుర
Cinejosh Review: Ravanasura సినీజోష్ రివ్యూ: రావణాసుర
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: రావణాసుర 

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్ , RT వర్క్స్

నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, జయరామ్, దక్ష నాగర్కర్, రావు రమేష్, మురళి శర్మ , సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు

మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్, GK.విష్ణు 

ఎడిటింగ్ : నవీన్ నూలి 

ప్రొడ్యూసర్: అభిషేక్ నామ, రవి తేజ 

డైరెక్టర్: సుధీర్ వర్మ 

రిలీజ్ డేట్: 07-04-2023 

ఎనేర్జికి మారు పేరు రవితేజ.. ప్రస్తుతం వరస సక్సెస్ తో ఉన్నారు. ఆయన చేసిన ధమాకా, వాల్తేర్ వీరయ్య మాస్ ఆడియన్స్ ని ఒప్పేసాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అదే హుషారుతో సుధీర్ వర్మ దర్శకత్వంలో చేసిన రావణాసురని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసారు. ధమాకా హిట్, వాల్తేర్ వీరయ్య హిట్స్ తో రావణాసురపై అంచనాలు మొదలయ్యాయి. అక్కినేని యువ హీరో సుశాంత్ ఈ చిత్రంలో భాగమవడం, కలర్ ఫుల్ గా నలుగురు హీరోయిన్స్ కనిపించడం, ట్రైలర్, సాంగ్స్ అన్ని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో హెల్ప్ అయ్యాయి. అభిషేక్ నామతో కలిసి రవితేజ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా మారడం, ప్రమోషన్స్ పరంగా రవితేజ సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. మరి ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మధ్యన నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన రావణాసుర ప్రేక్షకులకు ఏ మేర కనెక్ట్ అయ్యిందో సమీక్షలో చూసేద్దాం. 

రావణాసుర స్టోరీ రివ్యూ:

రవీంద్ర అలియాస్ రవి (రవితేజ) లాయర్. కనకమహాలక్ష్మీ (ఫరియా అబ్దుల్లా) వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఫార్మా కంపెనీ ఎండీ హారిక (మేఘా ఆకాశ్) , గవర్నమెంట్ ఆఫీసర్ (జయ ప్రకాశ్), పోలీస్ ఆఫీసర్ (మురళీ శర్మ) వరసగా దారుణ హత్యలకు గురవుతారు. సంచలనం రేపిన ఈ హత్యల వెనుక లాయర్ రవి హస్తం ఉందని ఏసీపీ హన్మంతు (జయరామ్) అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హోం మినిస్టర్ (రావు రమేష్) హత్యకు కూడా ప్లాన్ చేస్తారు. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులను ఈ హత్యల్లో నేరస్తులుగా ఎలా మారారు? ఇంత దారుణంగా ఎందుకు హత్యలు చేయాల్సి వచ్చింది? తర్వాత ఏం జరిగింది అన్నది సింపుల్ గా రావణాసుర కథ.

రావణాసుర ఎఫర్ట్స్: 

రవితేజ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే రవితేజ. రవీంద్ర కేరెక్టర్ లో రవితేజ రావణాసుర సినిమాకు కర్త, కర్మ, క్రియ గా నిలిచిపోయారు. కొన్ని సీన్లలో రవితేజ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొంటే మాత్రం ఆయన ఫాన్స్ కి నిరాశే మిగులుతుంది. కొద్దికాలంగా లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న రవితేజని ఈ చిత్రంలో కొత్తగా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రం ఆయన ఫెర్ఫార్మెన్స్ పండుగని చెప్పవచ్చు. అక్కినేని హీరో విషయానికి వస్తే సుశాంత్ క్యారెక్టర్ డిజైన్ కొత్తగా ఉంది. సుశాంత్ టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో మంచి ఈజ్‌ను ప్రదర్శించాడు.

ఇతర పాత్రలకు బలమైన బ్యాకప్ లేదనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్స్ కి అస్సలు స్కోప్ లేదు. ఒకరికి నలుగురు ఉన్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్ ల్లా అలా వచ్చి ఇలా వెళుతుంటారు. మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ క్యారెక్టర్లు కాస్త బెటర్‌గా అనిపిస్తాయి. దక్ష, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా పాత్రలు ఎందుకు పెట్టారో ఎవరికీ అర్ధం కాదు. టాలెంటెడ్ యాక్టర్స్ మురళీ శర్మ, సంపత్, రావు రమేష్ పాత్రలు అతిధి పాత్రలకే పరిమితమయ్యారు. జయరామ్ క్యారెక్టర్ స్టోరీకి రిలేటెడ్ గా ఉంటుంది. 

సాంకేతిక విభాగాల పనితీరుకి వస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ పెద్దగా ప్రభావం చూపించలేదు, ఆఖరికి రీమిక్స్ చేసిన పాట కూడా సినిమాలో ఇంప్రెసివ్ గా లేదు. BGM మాత్రం అదిరిపోయింది అని చెప్పలేం కానీ.. బావుంది. యాక్షన్ సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు. మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విజయ్ కార్తీక్ కన్నన్, GK.విష్ణు  సినిమాటోగ్రఫి రావణాసురకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.. కోర్టు సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ ని చక్కగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవడానికి ఏమి లేదు. అభిషేక్ పిక్చర్స్ , RT వర్క్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

రావణాసుర స్క్రీన్ ప్లే:

మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఇలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. స్వామి రారా, కేశవ లాంటి సినిమాలని గ్రిప్పింగ్ స్క్రీన్ ఫ్లే తో ఆకట్టుకునేలా మలచిన దర్శకుడు సుధీర్ వర్మ రావణాసుర కథను ది బెస్ట్ గా చూపించే ప్రయత్నం చేసాడు.  శ్రీకాంత్ విస్సా అందించిన కథలోని థ్రిల్లర్ జోనర్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి నెగెటివ్ టైటిల్ తో, నెగెటివ్ కేరెక్టర్ చెయ్యడానికి రవితేజని ఒప్పించాడు. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోనే కథని ప్రారంభించాడు. ఫస్ట్ హాఫ్ వరకూ కథని ఆసక్తికరంగా ఉండేలా డిజైన్ చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ఫ్యాక్టర్ పూర్తిగా నీరుగారిపోయింది. స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ లేకపోగా.. అస్తవ్యస్తంగా తయారైంది. కొన్ని సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. కొన్ని మర్డర్ సీన్స్ ను మరింత భయంకరంగా, జుగుప్సాకరంగా చూపించారు. ఇలాంటి కథలకి అవసరమైన గూస్‌బంప్స్ తెప్పించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు కానీ పెద్దగా ఏమీ లేవు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సెకండాఫ్ మొత్తం రవితేజ చేసే వయోలెన్స్ కనిపిస్తుంది. రామాయణంలో రావణాసురిడికి పది తలలు ఉంటే.. ఈ రావణాసురకు పది లక్ష్యాలు ఉన్నాయి. ఒక క్రిమినల్ లాయర్ తన క్రిమినల్ బుర్రతో అలోచించి చట్టాన్ని వాడుకొని హత్యలు ఎలా చేశాడు అనే కాన్సెప్ట్‌తో క్లైమాక్స్ ఉంటుంది. కానీ ప్రేక్షకుడికి అది అంత కిక్ ఇవ్వదు. ఒక హోం మినిస్టర్‌ లాంటి పాత్రని చంపడానికి ఈ లాజిక్ సరిపోదు. మొత్తంగా చూసుకుంటే లాజిక్ మిస్ అయిన ఒక కమర్షియల్ థ్రిల్లర్ గా రావణాసుర మిగిలిపోతుంది.

రావణాసుర ఎనాలసిస్:

డాన్స్ లైనా, నటనలోనయినా ఎనర్జీ చూపించే రవితేజ కి.. థ్రిల్లర్ సబ్జక్ట్స్ స్పెషలిస్ట్ సుధీర్ వర్మ కలిస్తే.. దానిపై ప్రేక్షకుల్లో కచ్చితంగా అటెన్షన్ వస్తుంది. కానీ ఒక మంచి కథాంశాన్ని ఎంపిక చేసుకున్న సుధీర్ వర్మ.. దాన్ని తెరపై ఎఫెక్టివ్‌గా చూపిండంలో పూర్తిగా విఫలమయ్యాడు. రవితేజ లాంటి హీరోని వాడుకోవడంలో సుధీర్ వర్మ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. అద్భుతమైన సైకో థ్రిల్లర్ అయ్యే లక్షణాలు ఉన్న రావణాసుర ఒక రొటీన్, యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ముగిసిపోయింది.

పంచ్ లైన్: ఫలించని రవితేజ ప్రయోగం!

రేటింగ్: 2/5

Cinejosh Review: Ravanasura:

Ravanasura Telugu Movie Review

Tags:   RAVANASURA REVIEW
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ