Advertisementt

సినీ జోష్ రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్

Fri 01st Apr 2022 02:20 PM
mishan impossible review,mission impossible review,mishan impossible movie review,mishan impossible telugu review,tapsee mishan impossible review  సినీ జోష్ రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్
Cinejosh Review: Mishan Impossible Review సినీ జోష్ రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్
Advertisement
Ads by CJ

సినీ జోష్ రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్ 

బ్యానర్: మాట్నీ ఎంటర్టైన్మెంట్, PA ఎంటర్టైన్మెంట్స్   

నటీనటులు: తాప్సి పన్ను, హర్ష రోషన్, భాను ప్రకాశం, జయాతీర్థ మూలుగు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ K రాబిన్ 

సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరగరా 

ఎడిటింగ్: రవితేజ గిరజాల 

నిర్మాతలు: నిరంజన్ రెడ్డి & అన్వేష్ రెడ్డి 

దర్శకత్వం: స్వరూప్ RSJ 

సౌత్ లో గ్లామర్ రోల్స్ చేసినా సక్సెస్ అందుకోలేక బాలీవుడ్ కి జంప్ అయ్యి అక్కడ విమెన్ సెంట్రిక్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పరుచుకున్న తాప్సి.. మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అంటే.. ఆమె ఒప్పుకున్న కథ ఎంత అద్భుతంగా లేకపోతె ఆమె ఓకె చేస్తుంది. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన స్వరూప్ నుండి రెండో సినిమా మిషన్ ఇంపాజిబుల్ వస్తుంది అంటే ఎన్ని అంచనాలు ఉంటాయి.. మరి ఏజెంట్ తో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్ టాలెంటెడ్ బ్యూటీ తాప్సి తో సినిమా చెయ్యడం కంటే ఆసక్తి, అంచనాలు ఇంకేముంటాయి. తాప్సి కి ఓ ముగ్గురు పిల్లలు తోడైతే.. మిషన్ ఇంపాజిబుల్ రెడీ అవుతుంది. మంచి ప్రమోషన్స్ తో స్వరూప్ - తాప్సి కాంబోలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి మిషన్ ఇంపాజిబుల్ ఆడియన్స్ ని ఎంత ఎంటర్టైన్ చేసిందో అనేది సమీక్షలో చూసేద్దాం. 

కథ:

శైలజ (తాప్సి) ఓ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తుంటుంది. మరోపక్క తిరుపతికి సమీపంలో ఉన్న వడమాలపేటకు చెందిన రఘుపతి(హర్ష రోషన్), రాఘవ(భాను ప్రకాష్), రాజారామ్(జయతీర్థ) లకు చదువు మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు అవ్వాలని రఘుపతి కలలు కంటూ ఉంటే, రాఘవ మాత్రం కౌన్ బనేగా కరోడ్పతి లో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకోవాలని కలకంటూ ఉంటాడు. రాజా రామ్ కి ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కల. ఓసారి టీవీ చూస్తున్న ర‌ఘుప‌తికి ఇంట‌ర్నేష‌న‌ల్ మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం గురించి తెలుస్తుంది. అత‌న్ని ప‌ట్టుకుంటే యాభై ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీ వ‌స్తుంద‌నే తెలియ‌డంతో రాఘ‌వ‌, రాజారాంల‌తో క‌లిసి ముంబై వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. వీళ్లకు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న జర్నలిస్ట్ శైలజ తారసపడుతుంది. శైలజ రామ్ శెట్టి (హ‌రీష్ పేర‌డి) అనే వ్య‌క్తిని టార్గెట్ చేస్తుంది. రామ్ శెట్టి.. ముంబైలో ఏదో పెద్ద ప్లాన్ వేశాడ‌ని, అందుకోసం అత‌న్ని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. అస‌లు రామ్ శెట్టి ఎవ‌రు? శైలజకి.. ర‌ఘ‌ప‌తి, రాఘ‌వ‌, రాజారాం ఎలాంటి సాయం చేస్తారు? ఆ ముగ్గురి పిల్లల సహాయంతో శైలజ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ఆట ఎలా కట్టించింది? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

నార్త్ లో సత్తా చాటుతున్న తాప్సీ  చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేయడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. కానీ ఈ సినిమాలో తాప్సీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. కనిపించిన సీన్స్ లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా తాప్సీ పెరఫార్మెన్సు తో ఆకట్టుకోగలిగింది. పిల్లల పాత్రలో నటించిన హర్ష రోషన్, భాను ప్రకాశం, జయాతీర్థ ముగ్గురు మాత్రం తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. చాలా ఈజ్ తో ఎప్పటినుంచో నటనలో మునిగి తేలినట్టు నటించారు. మలయాళ నటుడు హరీష్ పిరాడీ కూడా విలన్ పాత్రలో పర్వాలేదనిపించారు. మిగతా నటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ:

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో ఇండస్ట్రీ చూపు తనపైన పడేలా చేసుకున్న స్వరూప్ తన రెండో సినిమాని ఎలా తీస్తాడు, ఎలాంటి కథతో వస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో కలిగించాడు. దానికి తగ్గట్టే చాలా రోజులుగా తెలుగుకి దూరంగా ఉండి.. బాలీవుడ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న తాప్సి మెయిన్ లీడ్ లో మిషన్ ఇంపాజిబుల్ అంటూ ముగ్గురు పిల్లలతో ఓ మిషన్ ని తయారు చేసాడు. శైలజ మిష‌న్‌తో క‌థ మొద‌ల‌వుతుంది. ఓ డాన్‌ని ప‌దిహేడేళ్ల పిల్లాడితో చంపించే సీన్ తో కథని ఇంట్రెస్టింగ్ గానే మొదలు పెట్టాడు దర్శకుడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా సాగిపోతుంది. ముగ్గురు పిల్లల పరిచయాలు. ఒక్కో పిల్లవాడు జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నాడు, కలలు కన్నా జీవితాన్ని అందుకోవడానికి వారు ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని కామెడీతో కలగలిపే ప్రయత్నం చేసారు. చదువు మీద ఆసక్తి లేని పిల్లల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనేదాని మీదే దర్శకుడు ఫోకస్ పెట్టారు. న్యూస్ లో దావూద్ ఇబ్రహీం ఫోటో చూసి తండ్రిని అతని వివరాలు అడిగిన క్రమంలో అతని పట్టిస్తే యాభై లక్షల ప్రైజ్మనీ వస్తుందని తెలుసుకుని చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరు వెళ్ళేదాకా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. సెకండ్ హాఫ్ లో ముగ్గురు పిల్ల‌ల క‌ష్టాలు, డాన్ వ్య‌వ‌హారాలు, ఛైల్డ్ ట్రాఫికింగ్ ఇవ‌న్నీ బోర్ కొట్టిస్తాయి. తాప్సి ది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రా లేదంటే పోలీస్ ఆఫీసర్ పాత్రా అనే విషయంలో ప్రేక్షకులని దర్శకుడు కన్ఫ్యూజ్ చేసాడు. అంతలా తాప్సి పోలీస్ ఆఫీసర్స్ తో కథ నడిపిస్తుంది. చైల్డ్ ట్రాఫికింగ్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు చైల్డ్ ట్రాఫికింగ్ వల్ల జరుగుతున్న అనర్ధాలు, దేశవ్యాప్తంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతోంది అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. అలా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న మాఫియాని ఈ ముగ్గురు పిల్లలతో కలిసి తాప్సీ ఎలా పట్టుకుంది అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు. కొత్త కథలతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న తాప్సి కి స్వరూప్ చెప్పిన కథలో జర్నలిస్ట్ గా తన హీరోయిజం కనిపించే ఆమె ఈ కథకి ఓకె చెప్పి ఉండవచ్చు. కానీ దర్శకుడు స్వరూప్ మిషన్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చెయ్యలేకపోయాడు. సినిమా మొత్తంలో కామెడీ హైలెట్ అయినా.. ఎమోషన్స్ బలంగా తాకవు. అందుకే మిషన్ ని సంపూర్ణంగా ముగించలేకపోయారు.

సాంకేతికంగా:

సినిమాకు సంగీతం అందించిన మార్క్ రాబిన్ పర్వాలేదనిపించినా.. ఆయన అందించిన నేపధ్య సంగీతం ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునెలా ఉంది. ఎడిటర్ షార్ప్ గా ఉంది. ఇక చిన్న సినిమా అని అంటున్నారు కానీ భారీగానే ఖర్చు పెట్టారని సినిమా చూసిన అందరికీ అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 2.0/5

Cinejosh Review: Mishan Impossible Review:

Mishan Impossible Movie Telugu review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ