Advertisementt

సినీజోష్ రివ్యూ: మంచి రోజులు వచ్చాయి

Thu 04th Nov 2021 01:50 PM
manchi rojulochaie movie review,manchi rojulochaie telugu review,manchi rojulochaie review,maruthi manchi rojulochaie movie review  సినీజోష్ రివ్యూ: మంచి రోజులు వచ్చాయి
Manchi Rojulochaie Telugu Review సినీజోష్ రివ్యూ: మంచి రోజులు వచ్చాయి
Advertisement
Ads by CJ

బ్యానర్‌: యూవీ కాన్సెప్ట్స్‌

నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, వైవా హర్ష, అజయ్‌ ఘోష్‌ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్‌ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌

ఎడిటింగ్‌: ఎస్‌బీ ఉద్ధవ్‌

నిర్మాత: SKN

డైరెక్టర్: మారుతి 

దర్శకుడు మరుతి ఫన్ రైడ్ మూవీస్.. కామెడీ ఎంటెర్టైనెర్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే డైరెక్టర్. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్తో మారుతి మార్క్ డైలాగ్స్, కామెడీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా మారుతీ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి మూవీ ని యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ లో తెరకెక్కించారు. యువి కాన్సెప్ట్ బ్యానర్, మారుతి మార్క్ కామెడీ అనగానే సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ తో హిట్ కొట్టడం, అలాగే మంచి రోజులు వచ్చాయి సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్ని ఈ సినిమాకి ప్లస్ అనేలా ఉండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగాయి.. ఇక నేడు దివాళి స్పెషల్ గా ప్రేక్షకుల్ ముందు వచ్చిన మంచి రోజులు వచ్చాయి మూవీ ఎలా ఉందో.. సమీక్షలో చూసేద్దాం. 

కథ:

ప‌ద్దు (మెహరీన్‌ కౌర్) అంటే ఆమె తండ్రి గుండు గోపాల్ (అజ‌య్ ఘోష్‌)కి ప్రాణం. చిన్న విషయానికే భయపడే గుండు గోపాల్ కి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే కూతురు పద్దుపై ఎంతో న‌మ్మ‌కం. పద్దు మాత్రం సంతోష్(సంతోష్ శోభ‌న్‌) ని ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా క‌నిపించే గోపాల్‌ తన కూతురు పద్దు విషయంలో ఆందోళ‌న చెంద‌డం పడుతుంటాడు. ఎవరి ప్రేమలో అయినా పడి కూతురు మోసపోతుందేమో అనే భయంతో.. సంతోష్ ని చూడకుండానే రిజెక్ట్ చేస్తాడు గోపాల్. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా భ‌యం కూడా గుండు గోపాల్ కి తోడ‌వుతుంది. ఇన్ని చిక్కుల మ‌ధ్య సంతోష్‌, ప‌ద్దుల ప్రేమాయ‌ణం ఎలా సాగింది?  గోపాల్ భ‌యాల్ని సంతోష్ ఎలా దూరం చేసాడు? పద్దు - సంతోష్ పెళ్ళికి గోపాల్ ఒప్పుకున్నాడా? అనేది మంచి రోజులు వచ్చాయి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

పెరఫార్మెన్స్:

ఈ సినిమాకి మెయిన్ హీరో అజ‌య్ ఘోష్ పాత్రే. కథ మొత్తం అజయ్ ఘోష్ చుట్టూనే తిరిగింది. అజయ్ ఘోష్ బోర్ కొట్టించకుండా త‌న‌వైన హావ‌భావాలు, మాట‌ల్లో విరుపుతో నవ్వించారాయ‌న‌. ఇక హీరో అన్న సంతోష్ శోభ‌న్ ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపిస్తాడు తప్ప హీరోలా కనిపించలేదు. ఇక హీరో గా సాంగ్స్ లో డాన్స్ చెయ్యాలి.. అన్నదాని కోసమే రెండు పాట‌లు ఉన్నాయి అంతే తప్ప సంతోష్ శోభన్ కేరెక్టర్ అంతకుమించి ఏం లేదు. హీరోయిన్ గా మెహ‌రీన్ బాగా చిక్కిపోయింది. బబ్లీ గా ఉన్నప్పుడే అందంగా ఉన్న మెహ్రీన్ సన్నబడ్డాక గ్లామర్ పరంగాను తేలిపోయింది. అందాలు ఆరబోసినా మెహ్రీన్ ని చూడలేకపోయారనే చెప్పాలి. వెన్నెల కిషోర్ ఓకే అనిపించాడు.. అప్ప‌డాల విజ‌య‌ల‌క్ష్మి ఎపిసోడ్ లో ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ న‌వ్విస్తారు. మిగతా వారు తన పాత్ర పరిధి మేర నటించి మెప్పించారు. 

విశ్లేషణ:

దర్శకుడు మారుతి సినిమాల్లో కేవలం కామెడీ నే కాదు.. సినిమాలో కీలకమైన పాత్రలకి ఏదో ఒక డిసీజ్ యాడ్ చేసి.. దానిలోనుండే కామెడీ పుట్టిస్తాడు. భలే భలే మగాడివోయ్ లో నాని కి మతిమరుపు పెట్టిన మారుతి.. మహానుభావుడు లో శర్వాకి ఓసిడి డిసార్డర్ పెట్టాడు. ఇక ఇప్పుడు మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమాలో హీరోయిన్ తండ్రి కి అతి భయం అనే కాన్సెప్ట్ తగిలించాడు. మంచి రోజులు వచ్చాయి సినిమా కాన్సెప్ట్ అంతా భయం తో ముడిపెట్టాడు. కథ కి ఇంపార్టెన్స్ లేదు.. కథ మొత్తం భయం చుట్టూనే తిరిగింది. కాకపోతే కాస్త లాజిక్ కి దూరం గా అనిపిస్తుంది. ఈసారి హీరో - హీరోయిన్స్ ని పక్కనబెట్టి హీరోయిన్ తండ్రి కేరెక్టర్ ని హైలెట్ చేసాడు మారుతి. అజయ్ ఘోష్ మ‌న‌సులో త‌న కూతురు ప్రేమ‌లో ప‌డింద‌నే ఆందోళ‌న మొద‌ల‌య్యాకే ఈ క‌థ కరెక్ట్ గా లైన్ లోకి వచ్చింది అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ కేరెక్టర్ ని ఎక్కడా హైలెట్ చెయ్యలేదు. సెకండ్ హాఫ్ లో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి ప్రేక్షకుడు ఎక్క‌డా ఫీలవడు. కొన్ని సీన్స్ లో న‌వ్వించ‌డంలో మాత్రం మారుతి సక్సెస్ అయ్యాడు. మారుతి మార్క్ అడ‌ల్ట్ కామెడీ ఇందులోనూ ఉంది, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సన్నివేశాలను అల్లారు. కరోనా ఎపిసోడ్ లో కామెడీ పండకపోగా.. సాగదీతలా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమాలో మరుతి మార్క్ మిస్ అయ్యింది అనే చెప్పాలి. 

సాంకేతికంగా..

అనూప్ సంగీతంలో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. విజువల్ గాను బాగా చూపించారు. సాయిశ్రీరామ్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ఎడిటింగ్ లో మాత్రం ఇంకాస్త మనసు పెడితే బావుండేది.. నిర్మాణ విలువలు బావున్నాయి. 

ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్ .. కామెడీ, అజయ్ ఘోష్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: స్టోరీ, సెకండ్ హాఫ్, ఎడిటింగ్, మిస్సింగ్ ఎమోషన్స్

రేటింగ్: 2.5/5

Manchi Rojulochaie Telugu Review:

Manchi Rojulochaie Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ