బ్యానర్: GA2 పిక్చర్స్
నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే, ఈషా రెబ్బ, ఫారియా అబ్దుల్లా, ఆమని, వెన్నెల కిశోరె, మురళి శర్మ, జయ ప్రకాష్, ప్రగతి, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, పోసాని, చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: ప్రదేశ్ వర్మ
ఎడిటర్: మార్తాండ్ కే. వెంకటేష్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
డైరెక్టర్:బొమ్మరిల్లు భాస్కర్
బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో హిట్ కొట్టి.. ఆరెంజ్, ఒంగోలు గిత్త దెబ్బకి చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్.. అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ని అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ లో తెరకెక్కించారు. ఈ సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే నటించడం, అల్లు అరవింద్ బ్యానర్ నుండి తెరకెక్కడంతో.. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే.. సాంగ్స్, పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఇక టీం ప్రమోషన్స్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. దసరా స్పెషల్ గా నేడు అక్కినేని కుర్రాడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో లక్కు ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. మరి అఖిల్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ అందించిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
హర్ష(అఖిల్) అమెరికాలో జాబ్ చేస్తాడు.. అతనికి ఇండియాలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలన్నది హర్ష ఫ్యామిలీ కోరిక. తనకి కాబోయే భార్య ఎలా ఉండాలో.. పక్కా క్లారిటీతో ఉన్న హర్ష.. ముందు ఉద్యోగం, ఆ తర్వాత సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం తగిన ఏర్పాట్లని పూర్తి చేసుకుని పెళ్లి చూపులకి బయలుదేరుతాడు. అయితే హర్ష ఎన్ని పెళ్లి చూపులకి వెళ్ళినా.. అవి సెట్ అవ్వవు. విభా(పూజ హెగ్డే) తో పరిచయం అయ్యాక హర్ష కి అమ్మయిల్లో ఉండాల్సిన క్వాలిటీస్ పై అవగాహనా వస్తుంది. ఆ తర్వాత విభా పరిచయం హర్షని మార్చేస్తుంది. అసలు విభా హర్ష ని ఎలా ప్రభావితం చేసింది? పెళ్లి చూపుల్లో హర్ష ఎందుకు అంతలా కన్ఫ్యూజ్ అయ్యాడు? విభా - హర్ష లవ్ లో పడతారా? విభా - హర్ష పెళ్లి చేసుకుంటారా? అనేది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
అఖిల్ హర్ష పాత్రకి పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. పెళ్లి చేసుకునే ఏజ్ లో ఉండాల్సిన.. పాతికేళ్ల కుర్రాళ్ల మనస్తత్వానికి దగ్గరగా అఖిల్ పాత్ర ఉంది. దానికి తగ్గట్టుగా స్టయిల్ గా, పెరఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. నటన పరంగా సూపర్ అనలేం.. ఎందుకంటే.. గత సినిమాలతో పోలిస్తే అఖిల్ పెరఫార్మెన్స్ పరంగా కాస్త పరిపక్వత చూపెట్టాడు అంతే. .ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పటిలాగే గ్లామర్ గా అందంగా విభా పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది. స్టాండప్ కమెడియన్ గా కనిపించే సన్నివేశాల్లో పూజా హెగ్డే నటన ఆకట్టుకుంది. మురళీ శర్మ, జయప్రకాష్, ఆమని తమ పరిధిమేర ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ మెప్పిస్తుంది. గెస్ట్ పాత్రల్లో నేహా శెట్టి, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా ఓకె ఓకె.
విశ్లేషణ:
బొమ్మరిల్లు భాస్కర్ అనగానే.. అందరికి సహజంగానే బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా తో బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఆ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ తో కెరీర్ కనుమరుగయ్యే డిజాస్టర్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు అక్కినేని యంగ్ హీరో అఖిల్ తోనూ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీనే కుటుంబానికి ముడిపెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తెరకేక్కిన్చాడు. బొమ్మమ్మరిల్లు భాస్కర్ - అఖిల్ కాంబోలో తెరకెక్కన ఈ సినిమా మొన్నీమధ్యనే వచ్చిన షాదీ ముబారక్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఒక్కటే.. ఆ పెళ్లి చూపులకి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి చూపులకి పెద్దగా తేడా అనిపించదు. ఇక హ్యాపీ లైఫ్ లోపెళ్లి తర్వాత అన్ని విషయాల్లో సర్దుకుపోవడంఅంటే నచ్చని హీరోయిన్ ని చూస్తే హీరో ఫ్యామిలీకి ఆమెని పిచ్చిదానిలా చూస్తారు. కానీ చివరికి హీరో కడుఆ హీరోయిన్ తీరి నే కరెక్ట్ అని ఆమె రూట్ లోకి వెళ్లిపోవడం.. కాస్త కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా.. పెళ్లి చూపులు, హీరో ఫ్యామిలీ ప్రోబ్లెంస్ తో గడిచిపోతే.. సెండాఫ్‌లో దాగుడు మూతల ప్రేమకథ పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే కోర్టు సీన్ లాజిక్‌కు దూరంగా అనిపించినా.. ఆ ఎపిసోడ్‌లో పోసాని కృష్ణ మురళి చేసే హంగామా మంచి కామెడీ అందిస్తుంది. సెకండ్ హాఫ్ లో భాస్కర్ రాసుకున్న కొన్ని ఎపిసోడ్లు బలవంతంగా ఇరికించినట్లుగా ఉంటాయి. ప్రేమకి.. రొమాన్స్‌కి మధ్య తేడాని సరైన రీతిలో వివరించి చెప్పడంలో ఆఖర్లో భాస్కర్ కాసత తడబడ్డాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అక్కడక్కడా బొమ్మమ్మరిల్లు ఫ్లేవర్ ని జోడించాడు దర్శకుడు.
సాంకేతికంగా..
గోపి సుందర్ మ్యూజిక్ ఆహ్లాదంగా అనిపిస్తుంది. లెహరాయి, గుచ్చే గులాబిలాగా పాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయో.. వాటి పిక్చరైజేషన్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంది. గోపీ సుందర్ సంగీతం, ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ, గీత ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమాకి మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి.
రేటింగ్: 2.75/5