Advertisementt

సినీజోష్ రివ్యూ: మాస్ట్రో

Fri 17th Sep 2021 10:39 AM
maestro movie telugu review,maestro movie,maestro movie review,nithin maestro movie review  సినీజోష్ రివ్యూ: మాస్ట్రో
Maestro Movie Telugu Review సినీజోష్ రివ్యూ: మాస్ట్రో
Advertisement
Ads by CJ

బ్యానర్‌: శ్రేష్ఠ్‌ మూవీస్‌

నటీనటులు: నితిన్‌, తమన్నా, నభా నటేశ్‌, జిషు సేన్‌ గుప్త, నరేశ్‌, తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర్‌

సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖర్‌

నిర్మాత: సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి

దర్శకత్వం: మేర్లపాక గాంధీ

ఓటిటి రిలీజ్: డీస్నీ+హాట్‌స్టార్‌

ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత యంగ్ హీరో నితిన్ చెక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చెక్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. వెను వెంటనే.. రంగ్ దే లాంటి కలర్ ఫుల్ లవ్ స్టోరీ తో మరోసారి సందడి చేసిన నితిన్ ఈ ఏడాది మూడో సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేసాడు. కరోనా సెకండ్ వేవ్ ముగిసినా.. థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా ఓటిటి ద్వారా తాను నటించిన మ్యాస్ట్రో మూవీని రిలీజ్ చేసాడు నితిన్. తన ఓన్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆయుష్మాన్ ఖురానా అంధాదున్ మూవీని తెలుగులో మ్యాస్ట్రో గా రీమేక్ చేసాడు. గ్లామర్ గర్ల్ తమన్నా విలన్ గాను, నాభ నటేష్ గ్లామర్ హీరోయిన్ గా నటించిన మ్యాస్ట్రో మూవీ ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి నేడు సెప్టెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ మ్యాస్ట్రో తో ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో సమీక్షలో చూసేద్దాం. 

కథ:

పియానో వాయించడంలో నెంబర్ వన్ అయిన అరుణ్‌(నితిన్‌)కు చిన్న వయసులోనే కంటి చూపుపోతుంది. తన పియానో పాడైపోవడంతో అరుణ్ కొత్తది కొనుక్కోవాలని చూస్తాడు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌ ఓనర్‌ కూతురు సోఫి(నభా నటేశ్‌)తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అదే రెస్టారెంట్ కి తరచూ వచ్చే ఒకనాటి హీరో మోహన్‌(నరేశ్‌).. ఆ రెస్టారెంట్ లో పియానో వాయించే అరుణ్‌ ని చూసి తన మ్యారేజ్ యానివెర్సరీకి ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. దానితో అరుణ్‌.. మోహన్‌ ఇంటికి వెళ్తాడు. అరుణ్ వెళ్లేసరికి మోహన్ ఆయన ఇంట్లోనే హత్యకు గురవుతాడు. ఏమి తెలియని అరుణ్ మోహన్ వైఫ్ సిమ్రన్‌(తమన్నా) ముందు పియానో వాయిస్తాడు. అసలు మోహన్ ని హత్య చేసిందెవరు? మోహన్‌ భార్య సిమ్రన్‌(తమన్నా), బాబీ(జిషు సేన్‌ గుప్త)లకు సంబంధం ఏంటి? కళ్ళు కనిపించని అరుణ్‌ ఆ హత్యలో ఎలా ఇరుక్కున్నాడు? అసలు ఈ హత్య విషయంలో అరుణ్ ఎలాంటి సమస్యలను ఎదురుక్కున్నాడు? అనేది తెలియాలంటే.. మ్యాస్ట్రో ని హాట్ స్టార్ లో వీక్షించాల్సిందే.

పెరఫార్మెన్స్:

నితిన్‌ అంధుడిగా అరుణ్ పాత్రలో నిజంగా అదరగొట్టేసాడనే చెప్పాలి, బాలీవుడ్ అంధాదున్ లో ఆయుష్మాన్‌ ఖురానాకి ఈక్వెల్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీ పరంగాను, ఇటు ఎమోషనల్ గాను నితిన్ పెరఫార్మెన్స్ సూపర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మరో కీ రోల్. సిమ్రాన్ పాత్ర చేసిన తమన్నా. భర్త ఉండగానే ఇంకొకరితో సంబంధం పెట్టుకుని.. భర్తనే హాత్త్య చేసి.. ఆ మర్డర్ ని అంధుడైన అరుణ్ కి తెలిసిపోవడంతో.. సిమ్రాన్ గా తమన్నా పడే టెంక్షన్, ఆమె గ్లామర్.. అన్ని అద్భుతమే. బాలీవుడ్ లో టబు కేరెక్టర్ కి ఏ మాత్రం తగ్గకుండా తమన్నా మెప్పించింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. నాభ నటేష్ జస్ట్ గ్లామర్ రోల్ కే పరిమితమైంది తప్ప ఆ రోల్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఇక జిషు సేన్‌ గుప్త, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

విశ్లేషణ:

టాలీవుడ్ కి రీమక్స్ కొత్త కాదు.. తమిళ్, మలయాళ, హిందీ ఏ భాషలో అయిన హిట్ అయిన మూవీస్ ని తెలుగు హీరోలు ఎప్పటికప్పుడు రీమేక్స్ చేస్తూనే ఉంటారు. ఒరిజినల్ కి పెద్దగా మార్పులు చేర్పులు చెయ్యకుండా తెలుగు నేటివిటీకి దగ్గరగా చేసిన సినిమాలేవీ ప్లాప్ అయిన దాఖలాలు లేవు. కానీ రీమేక్స్ లో ఎక్కువ చేంజెస్ చేస్తే ఫలితం తేడా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఓ భాష లో హిట్ అయిన మూవీ రీమేక్ చేస్తున్నారనగానే ప్రేక్షకులు అలెర్ట్ అయ్యిపోయి.. ఆ సినిమాని చూసేస్తున్నారు. దానితో రీమేక్ కి ఒరిజినల్ కంటెంట్ కి పోలికలు పెట్టేస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి, ఆయుష్మాన్‌ ఖురానా అంధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న చిత్రం అంధాదున్‌ ని తెలుగులో రీమేక్ చేసాడు. ఒరిజినల్ కథలోని సోల్ ఏ మాత్రం చెడకుండా దర్శకుడు మాస్ట్రోని  మలిచిన తీరు బాగుంది. అంధుడైన అరుణ్‌ పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు. అరుణ్‌ కామెడీ కడుపుబ్బా నవ్వించడంతో పాటు అలరించేలా సాగుతుంది. నటుడు మోహన్‌ ఇంటికి అరుణ్‌ వెళ్లిన సమయానికి అప్పటికే అక్కడ హత్య జరిగి ఉండటంతో స్టోరీ లో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు అరుణ్‌ కళ్లుండి కూడా లేని వాడిలా నటిస్తున్నాడేమో అనే అనుమానంలో సిమ్రన్‌, పోలీస్‌ ఆఫీసర్‌ బాబీ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకి నచ్చుతాయి. అరుణ్ - సిమ్రాన్ కాంబో సన్నివేశాలు, బాబీ అరుణ్ ని చంపాలనుకునే సన్నివేశాలు, విపత్కర పరిస్థితుల్లో అరుణ్ ఎదురుక్కున్న సమస్యలు ఆకట్టుకునేలా తెరకేక్కిన్చారు దర్శకుడు మేర్లపాక. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆహ్లాదంగా సాగగా.. సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్ లు, ఎమోషనల్ గా సాగుతుంది. ఒరిజినల్ సోల్ చెడకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సాగిన మ్యాస్ట్రో ని ప్రేక్షకులు వీక్షించాల్సిందే. 

సాంకేతికంగా..

మ్యాస్ట్రో కి మ్యూజిక్ అందించిన హతి స్వర సాగర్‌ సాంగ్స్ సో సో అయినప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. నేపథ్య సంగీతం  ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసింది. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. ఎస్‌.ఆర్‌.శేఖర్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిమనవిలువలు రిచ్ గా కనిపించాయి. 

రేటింగ్ 2.75/5

Maestro Movie Telugu Review:

Nithin Maestro Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ