బ్యానర్: యువి కాన్సెప్ట్స్
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, సుదర్శన్, బ్రహ్మాజీ, శ్రద్ధా దాస్, సప్తగిరి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
కథ: మేర్లపాక గాంధీ
నిర్మాత: యువి క్రియేషన్స్
దర్శకత్వం: కార్తీక్ రాపోలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వలన రెండోసారి లాక్ డౌన్ నడుస్తున్న వేళ మళ్ళీ థియేటర్స్ బంద్ కావడంతో.. చిన్న సినిమాలన్నీ ఓటిటి బాట పట్టాయి. ఎప్పుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటిటి తలుపుతడుతున్నాయి. మే 7 న అనసూయ థాంక్యూ బ్రదర్ ఓటిటి నుండి విడుదల కాగా ఇప్పుడు సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్ నుండి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఒక బోల్డ్ కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు తెరకెక్కించిన ఈ సినిమా యువి బ్యానర్ నుండి వస్తుంది అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలని ఏక్ మినీ కథ అందుకుందేమో సమీక్షలో చూసేద్దాం.
కథ:
సంతోష్ (సంతోష్ శోభన్)కు చిన్నతనం నుంచి తన ప్రవేట్ పార్ట్ చిన్నది అనే బెంగ ఉంటుంది. ఆ బెంగతో నే సరిగ్గా చదవక అత్తెసరు మార్కులతో ఇంజినీరింగ్ పాస్ అయ్యి ఓ చిన్న జాబ్ లో జాయిన్ అవుతాడు. ప్రవేట్ పార్ట్ చిన్నది అనుకుంటూ అనేక సమస్యలు కొని తెచ్చుకుంటుంటాడు. ఇలా ఉండగానే సంతోష్ కి అమృత (కావ్య థాపర్) తో పెళ్లి కుదురుతుంది. తన వ్యక్తిగత సమస్యతో పెళ్లి చేసుకుంటే ప్రాబ్లెమ్ అవుతుంది అనుకుని పెళ్లి తప్పించుకోవడానికి ట్రై చేసినా అమృత తో ప్రేమలో పడిపోతాడు. పెళ్లి వద్దనుకున్నా.. చివరికి సంతోష్ అమృత మెడలో తాళి కడతాడు. ఆ పెళ్లి తర్వాత సంతోష్ శోభనం జరిగిందా? అసలు సంతోష్ తన ప్రవేట్ పార్ట్ విషయంలో ఎదుర్కున్న సమస్యలేమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పెరఫార్మెన్స్:
సంతోష్ శోభన్ సంతోష్ పాత్రని అలవోకగా చేసేసినట్టుగా అనిపించినా.. ఆ పాత్రని ఒప్పుకుని చాలా ధైర్యం చేసాడనే చెప్పాలి. అడల్ట్ కంటెంట్ కథలని ఒప్పుకుంటే.. హీరో గా తనకి డ్యామేజ్ అవుతుందేమో అని ఆలోచించకుండా.. ఎలాంటి ఇమేజ్ వచ్చినా పర్లేదు అనుకుని ఆ పాత్రని సెలెక్ట్ చేసుకోవడం మాములు విషయం కాదు. ఈ సినిమాలో సంతోష్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా సరిపోయాయి. హీరోయిన్ కావ్య థాపర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమెకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. జస్ట్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో ఆ అమ్మాయికి డైలాగులే ఉండవు. కమెడియన్ సుదర్శన్ హీరో తర్వాత హీరో లాంటివో పాత్రతో కామెడీ పరమానంగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ కూడా కామెడీ పరముగా ఆకట్టుకున్నాడు. శోభన్ తండ్రిగా బ్రహ్మాజీ నటన కూడా మెప్పిస్తుంది. శ్రద్ధాదాస్ ని ఓ పాత్ర కోసం తీసుకొచ్చారు గానీ.. అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. ఇక మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంచుకున్న కథ కాస్త బోల్డ్ గా ఉన్నా.. రెగ్యులర్ సినిమాల నుంచి కొత్తగా అనిపిస్తుంది. అసలు ఇలాంటి బోల్డ్ కథలను సినిమాగా చూపించే విషయంలో ఎక్కడా సున్నితత్వం మిస్ కాకూడదు. ప్రేక్షకులకి చిరాకు అనిపించకూడదు. ఈ ఏక్ మినీ కథలో అదే జరిగింది. ఓ అబ్బాయి కి సైజ్(ప్రవేట్ పార్ట్) చిన్నదన్న ఫీలింగ్ కలగడం, దాన్ని పెంచుకోవడానికి రకరకాలుగా తిప్పలు పడడం, డాక్టర్ దగ్గర డైరెక్ట్ గా సైజుల గురించి మాట్లాడడం.. ఇవన్నీ మాములు విషయాలు కాదు. అలాంటి బోల్డ్ కథకి కామెడీ టచ్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ రాపోలు. కామెడీతో కూడిన స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. కథని మొదలెట్టిన తీరు, మెల్లగా అసలు విషయంలోకి లాక్కెళ్లిన విధానం.. ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. డాక్టరు దగ్గరకు వెళ్లి తన సైజు గురించి చెప్పుకోవడం, వ్యభిచార గృహంలోకి వెళ్లి చెక్ చేసుకోవడం లాంటి సీన్స్ చూడడానికి ఎలాంటి బెరుకు లేకుండా కామెడీతో నవ్వించేసాడు. ఫస్ట్ హాఫ్ అంత ఆహ్లాదంగా సాగినా.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి బోర్ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో శోభనాన్ని తప్పించుకోవడం కోసం చేసే పనులు విసిగిస్తాయి. అప్పటిదాకా సహజంగా సాగిపోతున్న కథాకథనాలు.. ఇక్కడి నుంచి కొంత సినిమాటిక్ గానే అనిపిస్తాయి. సన్నివేశాల సాగదీతలా అనిపిస్తుంది. దర్శకుడు ఈ సబ్జెక్టును ఫస్ట్ హాఫ్ వరకు డీల్ చేసిన విధానం బాగుంది కానీ ఇదే సెకండాఫ్ లో కూడా కొనసాగించి ఉంచితే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఇక చివరిలో హీరో చేసిన పనులు తెలిసిపోయి హీరోయిన్ దూరం అయిపోతుంది. వాళ్లిద్దరినీ మళ్లీ కలిపే ప్రోసెస్ కాస్త రియాలిటీకి దూరంగా నాటకీయంగా కనిపిస్తుంది. ఏక్ మినీ కథ ని ఏక్ గా అంటే ఫ్యామిలీతో కలిసి చూడలేకపోయిన.. సింగిల్ గా చూసే సినిమా ఇది. థియేటర్స్ అంటే ఫ్యామిలీ మొత్తం వెళుతుంది కానీ. ఓటిటి అంటే ఎవరికీ వారే సపరేట్ గా ఏక్ మినీ కథ ని ఏక్ గా చూసుకునే ఫెసిలిటీ ఉందిగా.
సాంకేతికంగా:
ప్రవీణ్ లక్కరాజు అందించిన సాంగ్స్, నేపథ్య సంగీతం రెండూ ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, లిరిక్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బావుండేది. యువి కాన్సెప్ట్ బ్యానర్ వారు వాళ్ల స్థాయికి తగ్గట్లే బడ్జెట్ పెట్టారు.
పంచ్ లైన్: 'మినీ' కథ
రేటింగ్: 2.5/5