నటీనటులు : నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ కురాకుల
సినిమాటోగ్రఫి: ప్రవీణ్ కె బంగారి
ఎడిటింగ్: ఆనంద్ పవన్, మణి కందన్
నిర్మాత: గీతా మిన్సాల
దర్శకత్వం: యుగంధర్ ముని
ఇరంబు తిరై సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన నితిన్ ప్రసన్న హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఏ. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. భిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న నితిన్ ప్రసన్న 2018లో తమిళ్ సినిమా సయి చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ ఏ సినిమాకి విజయ్ సేతుపతి తో ట్రైలర్ లాంచ్ చేయించడం, అలాగే ఏ ప్రమోషన్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఏ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించిన హీరో నితిన్ ప్రసన్న.. ప్రేక్షకులను ఎలా మెప్పించాడో సమీక్షలో చూసేద్దాం.
కథ:
హైద్రాబాద్ హైవే పై రోడ్డుపక్కన్న పడిపోయిన ఓ వ్యక్తిని అటుగా వెళ్తున్న వాళ్ళు కాపాడి హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అతని తలకు దెబ్బ తగలడంతో తన గతం గురించి మరచిపోతాడు. స్పృహలోకి వచ్చిన అతను తాను ఎవరు.. అనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. అదే హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తున్న పల్లవి( ప్రీతి అస్రాని ) తనను దగ్గరుండి చూసుకోవడంతో ఆమెపై అభిమానం పెరిగి ప్రేమగా మారుతుంది. పల్లవి కూడా అతని ప్రేమలో పడిపోతుంది. అయితే గతం గురించి తెలియని వ్యక్తి అయినా సరే సంజీవ్ (నితిన్ ప్రసన్న) అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళై హ్యాపీ గా ఉన్నప్పటికీ.. అతనిని తానెవరో అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. అతను కూడా తనని తాను తెలుసుకునే ప్రయత్నాల్లో పదేళ్లు గడిచిపోతాయి. అసలు అతనికి తన గతం గురించి తెలిసిందా ? సంజీవ్ గతం ఏమిటి? అన్నది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
ఈ సినిమాలో నితిన్ ప్రసన్న హీరోగానూ, విలన్ గాను రెండు రకాల షేడ్స్ తో ఆకట్టుకున్నాడు హీరో నితిన్ ప్రసన్న. మూడు పాత్రల్లో నితిన్ ప్రసన్న నటించిన తీరు బాగుంది. ముఖ్యంగా గతం మరచిపోయిన వ్యక్తిగా .. తన గతం గురించి వెతుక్కునే వ్యక్తి సంజీవ్ గా ఆకట్టుకునే నటన కనబరిచాడు. ఇక హీరోయిన్ పల్లవి పాత్రలో ప్రీతి అస్రాని నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. మిగతావారు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
ఏ సినిమా కి దర్శకుడు యుగంధర్ ముని మంచి పాయింట్ ను తీసుకుని దాన్నీ సస్పెన్స్ జోడించి తెరకెక్కించిన విధానం బాగుంది. తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్ మూవీస్ కొత్తకాదు. ఇప్పటివరకు మనం ఎన్నో థ్రిల్లర్స్ చూసివుంటాం.. అయితే ఈ సినిమాలో కూడా ఆ బ్లాక్ షీప్ ఎవరు అన్న విషయాన్నీ అటు హీరోకే కాదు ఇటు ప్రేక్షకులకు తెలియకుండా దాచడం బాగుంది. మనిషి తన యవ్వనం కంటిన్యూ గా అలాగే ఉండేలా మనిషి మెదడులో ఉండే కొన్ని కణాలను కంట్రోల్ చేస్తే మనిషి నిత్యా యవ్వనుడిగా ఉంటారన్న పాయింట్ కొత్తగా ఉంది. అయితే ఇదే కథను ఇంకా కాస్త కమర్షియల్ వే లో కూడా చెప్పి ఉంటె మరింత బాగుండేది.. అనిపిస్తుంది. థ్రిల్లర్ సబ్జెక్టు ని ఇష్టపడే అభిమానులకు ఏ మంచి థ్రిల్ ని కలిగిస్తుంది.
సాంకేతికంగా:
ఈ సినిమాకు నేపధ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. విజయ్ కురాకుల అందించిన మ్యూజిక్ ఓకె ఓకె గా ఉంది. ప్రవీణ్ కె బంగారి కెమెరా పనితనం సూపర్బ్. ఇంటెన్సివ్ ఫోటోగ్రఫి తో సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాడు. ఆనంద్ పవన్, మణి కందన్ అందించిన ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కత్తెరకు పనిచెప్పి ఉంటె బాగుండేది. కొన్ని సీన్స్ తగ్గించి ఉంటె కథ ఇంకా చక్కగా సాగేది.నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.