Advertisementt

ఓటిటి రివ్యూ: 'ఆకాశం నీ హద్దురా'(సూర్య)

Fri 13th Nov 2020 02:20 PM
aakaasam nee haddhu ra movie,surya,aakaasam nee haddhu ra review,aakaasam nee haddhu ra telugu review  ఓటిటి రివ్యూ: 'ఆకాశం నీ హద్దురా'(సూర్య)
Aakaasam Nee Haddhu Ra Movie Review ఓటిటి రివ్యూ: 'ఆకాశం నీ హద్దురా'(సూర్య)
Advertisement
Ads by CJ

నటీనటులు: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రవెల్, ఊర్వశి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: జివి ప్రకాష్ 

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి 

ఎడిటింగ్: సతీష్ సూర్య 

నిర్మాత: సూర్య

కథ, దర్శకత్వం: సుధా కొంగర 

విమానమంటే కేవలం డబ్బున్నోడికే కాదు..లేని వాడిని విమానమెక్కించి.. తక్కువ ధరలోనే ప్రయాణించేలా చెయ్యాలనేది ఓ యువకుడి కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి మరో ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి కష్టాలను ఓట్ర్చి, ఎదురు దెబ్బలు తిని.. చివరికి ఆ కలని ఎలా సాధించాడో అనేదే ఆకాశమే నీ హద్దురా. ఉన్నవాళ్లు మాత్రమే బిజినెస్ క్లాస్, విమాన ప్రయాణం చేయాలా? ఏ ఏమి లేని వాళ్ళు విమానం ఎక్కకూడదా? వాళ్ళు ఆకాశంలో ఎగరకుడదా.. అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. దాని కోసం ఓ రియల్ స్టోరీ ని ఎంచుకున్నారు దర్శకురాలు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాధ్ జీవిత కథాంశం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. దాని ఆధారంగానే.. ఓ పల్లెటూరి యువకుడు ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడిగా ఎలా మారాడో.. లేని వాళ్ళని ఆకాశంలో ఎగరడాన్ని ఎలా సాధ్యం చేసి చూపించాడు అనేది ఈ సినిమా కథ.  సూర్యకి ప్రయోగాలు కొత్తేమి కాదు. అయితే జీవిత కథ అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే పేక్షకులకు ఎక్కదు.. అదే నాటకీయత జోడిస్తే.. సినిమాటిక్ గా ఉందంటారు. మరి ఓ రియల్ కథని సుంద కొంగర ప్రేక్షకులు మెచ్చేలా ఎలా డీల్ చేసారో సమీక్షలో చూసేద్దాం.

కథలోకి వెళితే.... తూత్తుకూడి అనే చిన్న గ్రామంలో జన్మించిన మహా, చంద్ర మహేష్(సూర్య) కి పల్లెటూర్లలో నివసిస్తూ, ఏమి లేని వాళ్ళని కూడా అతి తక్కువ ఖర్చుతో ఆకాశంలో విహరింపక చెయ్యాలనే కలతో తిరుగుతుంటాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. అందులోనే పని చేస్తున్న తన ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి ఓ ఎయిర్ లైన్స్ స్థాపించాలనే కసితో ముందుకు సాగుతుంటాడు. అలా అనుకుంటూ కష్టపడుతున్న సమయంలోనే మహా బేబీ(అపర్ణ బాలమురళి)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. బేబీ కూడా తనకు నచ్చినా బిజినెస్ చేస్తూ మహతో అన్ని పంచుకుంటున్న సమయంలో.. మహా ఎయిర్ లైన్స్ స్థాపించడానికి పూనుకుంటాడు. అసలు మహా ఫ్లైట్స్ ఆకాశం ఎగరకుండా ఓ బడా ఎయిర్ లైన్స్ ఓనర్ పరేష్ గోస్వామి(పరేష్ రవెల్) అడుగడుగునా అడ్డుతగులుతూ మహాని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి పరేష్ పెట్టిన పరీక్షలకు నిలబడి మహా ఎయిర్ లైన్స్ స్థాపించాడా? ఆ ఎయిర్ లైన్స్ స్థాపించడంలో మహా ఫ్రెండ్స్ పాత్ర ఎంత? అతని భార్య బేబీ మహాకి సపోర్ట్ చేసిందా? ఎయిర్ లైన్ స్థాపనలో మహా ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు? అసలు రూపాయి కే విమానయానం ఎలా సాధ్యం? అనేది ఆకాశం నీ హద్దురా చూసి తెలుసుకోవాల్సిందే.

నటనపరంగా చెప్పాలంటే.. సూర్య కి ఇలాంటి మహా పాత్రలు కొత్తేమి కాదు.. ఇలాంటి పాత్రలు సూర్య కి కొట్టిన పిండే. చంద్ర మహేష్ పాత్రలో సూర్య నటన అద్భుతం. పల్లెటూరి యువకుడిగా, తండ్రి ని చూడాలనే ఆరాటంలో ఫ్లైట్ ఎక్కేందుకు డబ్బులు కోసం పడే తాపత్రయంలో సూర్య నటన సినిమాకే హైలెట్. అసలు సూర్యది వన్ మ్యాన్ షోనే. కానీ సినిమా మొదట్లో సూర్య కి డబ్బింగ్ చెప్పిన సత్య దేవ్ వాయిస్ సూర్య పాత్రనే డామినేట్ చేసింది. అక్కడక్కడా సూర్య పాత్రలో సత్యదేవ్ కనిపిస్తాడు. ఇక సూర్య భార్య బేబీ పాత్రలో నటించిన అపర్ణ బాలకృష్ణ పల్లెటూరి గడుసమ్మాయిగా, ఇంటర్ చదివి తనకు బిజినెస్ చెయ్యగలను అంటూ భర్త కి సహకరించే పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. అలాగే సూర్యకి అండగా నిలబడిన ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా సినిమాకి ప్లస్ అయ్యారు. బడా బిజినెస్ మ్యాన్ గా పరేష్ రావెల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా మోహన్ బాబు, సూర్య తల్లి పాత్రలో ఊర్వశి.. అందరి చక్కటి ప్రదర్శన కనబర్చారు. 

విశ్లేషణ:

నిజం చెప్పాలంటే జీవిత కథలకు కమర్షియల్ హంగులు అద్దడం అనేది ఆ బయోపిక్ రూపాన్నే మార్చేస్తుంది. సినిమా వాళ్ళ బయోపిక్ లకు ఉన్న కమర్షియల్ పాయింట్స్.. బిజినెస్ మ్యాన్స్ విషయానికి వచ్చేసరికి ఉండవు. ఒకవేళ సినిమా కోసం వాటిని జోడిస్తే..అది సినిమా స్టయిల్ లోకి మరిపోతుంది. దాన్ని ప్రేక్షకుడు ఒప్పుకుంటాడనే నమ్మకము ఉండదు. మరి ఓ బిజినెస్ మ్యాన్ బయోపిక్ ని సినిమా చేసి హిట్ కొట్టాలంటే సాహసం చెయ్యాల్సిందే. దర్శకురాలు సుధా కొంగర అలాంటి ప్రయాణమే చేసింది. ఓ ఎయిర్ లైన్స్ ఓనర్ జీవిత కథని తీసుకున్న కథ పక్కకి పోకుండా ప్రేక్షకుడు మెచ్చేలా ఆకాశం నీ హద్దురా అంటూ సినిమాని తెరకెక్కించింది. ఇక సినిమాలోకి వెళితే డబ్బులు ఉన్నవాళ్లు అవసరమైనా, అనవసరమైనా ఫ్లైట్స్ లోనే త్రిరుగుతుంటారు. కానీ లేని వాళ్లకు ఎంత అవసరం వచ్చినా ఏదో ఓక్ ట్రైన్ లోనో, బస్సు లోనో వెళ్ళాలి తప్ప ఫ్లైట్ ఎక్కడానికి వాళ్ళ ఆర్ధిక పరిస్థితి సహకరించదు. తాము అత్యవసర సమయంలో వెళ్ళడానికి విమానమెక్కేందుకు డబ్బులు సరిపోవు. అలాంటి వారి కోసమే ఎయిర్ లైన్స్ స్థాపించి రూపాయికే విమానప్రయాణం ఎలా సాధ్యమయ్యిందో ఈ సినిమాలో సుధా కొంగర సూటిగా చెప్పింది. పల్లెటూరి యువకుడు మాస్టర్ కొడుకు..ఎయిర్ ఫోర్స్ లో పెద్ద జాబ్ లో ఉన్నవాడు ఎయిర్ లైన్స్ ఎందుకు స్థాపించాలనుకున్నాడో అనే విషయాన్నీ సుధా కొంగర చక్కగా ప్రెజెంట్ చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎయిర్ లైన్స్ స్థాపించాలనే కసి, పెళ్లి, భార్య కథతో నడిపింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ యువకుడు అసలెందుకు ఎయిర్ ఫోర్స్ జాబ్ వదులుకుని మరీ.. ఎయిర్ లైన్స్ స్థాపించాలని అనుకున్నాడో.. దాని కోసం బడా బిజినెస్ మ్యాన్ లతో ఎలా ఢీ కొట్టాడో చూపించింది. 

ఇక ఈ సినిమాలో ఓ డైలాగ్.. ఓ సీన్ ప్రేక్షకుడికి బాగా ఎక్కేస్తాయి. ఓ చిన్న హోటల్ కి, ఫైవ్ స్టార్ హోటల్ కి ఉన్న అంతరాన్ని చూపిస్తూ.. ఇక్క‌డ 13 రూపాయ‌ల‌కు దొరికే దోశ‌… స్టార్ హోటెల్‌లో 200కి ఎందుకు అమ్ముతున్నారు అంటూ హీరో చెప్పే డైలాగ్ కి థియేటర్స్ లో అయితే క్లాప్స్ పడేవి. ఇక సినిమాలో తెలుగు నేటివిటీ లోపించింది. తమిళ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ దర్శకురాలు సినిమాని తెరకెక్కించిందా అనుకుంటే.. సినిమా అలా నేచురల్ గా ఉంటేనే ఆ కథకి సెట్ అవుతుంది అనేది కొద్దిమంది మాత్రమే అర్ధమయ్యే పాయింట్. అయితే ఎయిర్ లైన్ స్థాపించడం అంటే అంత ఈజీ కాదు.. దాన్ని ఈ సినిమాలో కష్టాన్ని జోడించి చూపించినా.. ఓహ్ ఇంతేనా అనిపించేలా ఉంది. కానీ ఎయిర్ లైన్ స్థాపించడం, అందులోని తక్కువ ధరకే విమాన ప్రయాణం అంటే ఎన్నో ఏళ్ళ శ్రమ. ఎన్నో ఒడిడుకులు.. అందుకే అక్కడక్కడా సినిమా స్టయిల్లో కనిపించినా.. సినిమా ఓవరాల్ గా అదిరిపోయిందని చెప్పాలి. కాకపోతే సినిమాకి నిడివి ఇబ్బందిగా మారింది. ఈ సినిమా 150 నిమిషాల కథ. ఓటిటి లకు అంత నిడివి అక్కర్లేదు.. కానీ సుధా కొంగర ఎక్కడ ఏ సీన్ కట్ చేస్తే.. కథ పక్కకి పోతుందేమో అనే ఆలోచనతో నిడివి పెంచేసిందేమో అనిపిస్తుంది. అలాగే సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహాలు మూడో నాలుగో.. మిగతా వాళ్లంతా తమిళ నటులు కావడం తెలుగు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టె విషయం. ఏమైనా సినిమా సూర్య అభిమానులకే కాదు.. సగటు ప్రేక్షకుడు కూడా మెచ్చుకునే ఉంది. 

సాంకేతికంగా.. జివి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. కానీ ఈ కథకి అన్ని పాటలు అవసరం లేదనిపించింది.. కథలో అలా వచ్చి వెళుతుంటాయి. నిడివి ప్రాబ్లమ్ వలన పాటలు బోర్ అనిపిస్తాయి కానీ.. లేదంటే కథకి తగ్గ సాంగ్స్ అవి. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి బావుంది. సినిమాని నేచురల్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఎడిటింగ్ లో కత్తిరించాల్సిన సీన్స్ లేకపోయినా... నిడివి సినిమాకి మైనస్ గా మారె అవకాశముంది. నిర్మాణ విలువలు కథానుసారం మెప్పిస్తాయి.

రేటింగ్: 3.0/5  

Aakaasam Nee Haddhu Ra Movie Review:

Surya Aakaasam Nee Haddhu Ra Telugu Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ