Advertisementt

ఓటీటీ రివ్యూ: శకుంతలాదేవి

Fri 31st Jul 2020 10:33 PM
shakuntala devi,shakuntala devi review,vidya balan,shakuntala devi report  ఓటీటీ రివ్యూ: శకుంతలాదేవి
Shakuntala Devi Review ఓటీటీ రివ్యూ: శకుంతలాదేవి
Advertisement
Ads by CJ

ఓటిటి రివ్యూ: శకుంతలాదేవి

బ్యానర్: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్

నటీనటులు: విద్యా బాలన్, జిషు సేన్ గుప్త, సన్యా మల్హోత్రా, అంది సడి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: సచిన్ జిగర్ - కారం కులకర్ణి

సినిమాటోగ్రఫీ: కియోరా నకర

ఎడిటింగ్: అంతర లహరి

నిర్మాత: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, విక్రమ్ మల్హోత్రా

దర్శకత్వం: అను మీనన్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల శతకం మొదలై ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. బయోపిక్స్‌కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందులోను బాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఇంపార్టెన్స్ ఇచ్చే విద్యాబాలన్ నుండి బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమాపై ఎంత క్రేజ్ ఉండాలి. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్స్ మూత బడడంతో సినిమాలన్నీ వరసగా ఓటీటీల ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టే.. విద్యాబాలన్ మెయిన్ లీడ్‌లో అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గణిత శాస్త్ర మేధావి, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి బయోపిక్ కూడా శుక్రవారం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణిత శాస్త్రంలో మేధావి, హ్యూమన్ కంప్యూటర్ అంటూ శకుంతలాదేవిని పొగడడమే కానీ, ఆమె ఎలా గణిత శాస్త్రంలో మేధావి అయింది, ఆమెలోని మిగతా కళలు ఏమిటి అనేవి శకుంతలాదేవి బయోపిక్‌లో అను మీనన్ చూపించడానికి చేసిన ప్రయత్నమే శకుంతలాదేవి బయోపిక్. మరి విద్యాబాలన్ సోషల్ మీడియా ప్రమోషన్స్‌తో సినిమాపై మంచి అంచనాలు, ఆసక్తి పెంచేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

జీవితం దుర్భరంగా మారి... పూట గడవని స్థితిలో బిక్ష మిత్రమణి (ప్రకాష్ బేలవాడి) ఓ సర్కస్ కంపెనీలో పని చేస్తుంటాడు. బిక్ష మిత్ర తన కూతురు శకుంతలాదేవి(విద్యాబాలన్) చిన్నప్పటినుండే గణితంలో అపారమైన తెలివితేటలుండటం గమనించి గణిత ప్రదర్శనలివ్వడం మొదలుబెడతాడు. కనీసం స్కూల్‌కి కూడా వెళ్లని శకుంతలాదేవి, తండ్రి మార్గదర్శకత్వంలో గణితంలో జీనియస్‌గా ఎదుగుతుంది. ఆ నోటా ఈనోటా శకుంతలాదేవి పేరు మార్మోగిపోతోంది. తర్వాత లండన్ వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు, అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. శకుంతల పరితోష్ బెనర్జీ(జిష్షు సేన్ గుప్త)ని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కూతురు అను(సన్యా మల్హోత్రా) పుట్టిన తరువాత భర్తను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఐతే కొంతకాలానికి కూతురు అను కూడా శకుంతలను వదిలేసి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంది? శకుంతలాదేవి ఎలా భర్త, కూతురు దగ్గరకు చేరింది? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

శకుంతలాదేవి పాత్రకి విద్యాబాలన్ సూట్ అవుతుందో లేదో అనుకున్నవారికి.. విద్యాబాలన్ తప్ప శకుంతలాదేవి పాత్ర ఎవరూ చేసినా రక్తి కట్టేది కాదు అని చెబుతారు సినిమా చూస్తే. విద్యాబాలన్ నటన గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పుకునేది కాదు. బయోపిక్ పాత్రలకు విద్యనే పెట్టింది పేరు అనేలా ఉంది. వెండితెర మీద ఎక్కడా విద్యాబాలన్ కనిపించదు. శకుంతలాదేవినే కనబడుతుంది. వివిధ దశల వారీగా సాగే పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ విద్యాబాలన్ నటనతో కట్టిపడేస్తుంది. హ్యూమర్, కోపం, లెక్కచేయని తనం వంటి అనేక ఎమోషన్స్ ఆమె బాగా పండించారు. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు కూతురుతో వచ్చే కాంబినేషన్ సీన్స్‌లో విద్యానటన గురించి ఎంత చెప్పినా తక్కువే. శకుంతలాదేవి కూతురు పాత్రధారి సన్యా మల్హోత్రా ఆకట్టుకునేలా ఉంది. భర్తగా జిష్షు సేన్ గుప్త ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధిమేర నటించారు.

విశ్లేషణ:

గణిత మేధావి శకుంతలాదేవి అంటే.. హీరోయిజం ఉండదు. ఇప్పటివరకు తెరకెక్కిన బయోపిక్‌లలో హీరోయిజం ఎలివేట్ చెయ్యడానికి.. కొంత కల్పిత కథను యాడ్ చేస్తుండేవారు దర్శకులు. కానీ శకుంతలాదేవి బయోపిక్ అలా కాదు అన్నిటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకురాలు అనుమీనన్ ఈ శకుంతలాదేవి బయోపిక్‌ని ఆమె కూతురు అనుపమ బెనర్జీ దృష్టి కోణం నుండి తెరకెక్కించింది. ఫస్ట్ హాఫ్‌లో శకుంతలాదేవి చిన్నప్పటినుండి గణితంలో ఎంత మేధావో... ఆమె యొక్క ప్రతిభని తండ్రి ప్రోత్సహించడం, ఆమె ఘనీయటంలో ఇచ్చే ప్రదర్శనలు, లెక్కల్లో సూపర్ కంప్యూటర్ కన్నా ఎక్కువ స్పీడు ఉన్న శకుంతలాదేవి పేరు ప్రఖ్యాతలు అన్నిటితో ఫస్ట్ హాఫ్ చక్కగా సాగిపోతుంది. సినిమా సెకండ్ హాఫ్‌లో కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులు, ఆమె వాటిని ఎదుర్కొన్న విధానం మరికొంత ఎఫెక్టివ్‌గా తీయాల్సింది. శకుంతలాదేవి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. శకుంతలాదేవి - కూతురు మధ్యలో సాగే ఎమోషనల్ సంభాషణలు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే సినిమా ప్రారంభం నుండి స్లోగా సాగుతుంది. మొత్తంగా శకుంతలాదేవి తల్లికూతురు మధ్య నడిచే ఓ ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. ఆకట్టుకొనే కథనం, విద్యాబాలన్ అద్భుత నటన, హ్యూమర్ అండ్ ఎమోషన్స్ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తూ ముందుకు తీసుకెళతాయి. అయితే కమర్షియల్ హంగులు లేని శకుంతలాదేవి జీవితాన్ని బయోపిక్‌గా తీయడం అనేది పెద్ద సాహసమే అయినప్పటికీ.. ప్రేక్షకులను ఖచ్చితంగా ఈ బయోపిక్ మెప్పిస్తుంది.

సినీజోష్ రేటింగ్: 3/5

Shakuntala Devi Review:

Shakuntala Devi review and report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ