సినీజోష్ రివ్యూ: ప్రేమపిపాసి

Prema Pipasi Movie Review

ప్రేమ పిపాసి మూవీ రివ్యూ  

నటీనటులు : జిపిఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌‌పుత్‌, మమత శ్రీ చౌదరి, ఢీ జోడి ఫేమ్‌ అంకిత తదితరులు

సంగీతం : ఆర్స్‌

సినిమాటోగ్రఫర్ : తిరుమల రోడ్రిగ్జ్‌

ఎడిటర్ : ఎస్‌ శివ కిరణ్‌

నిర్మాత‌లు : పియస్‌ రామకృష్ణ (ఆర్కే)

రచన – దర్శకత్వం : మురళి రామస్వామి (ఎమ్. ఆర్)

ప్రేమకథలు కోకొల్లలుగా వచ్చినప్పటికీ.. అందులో విషయముంటే మాత్రం ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. లేదు రొటీన్ సినిమా అంటే వదిలేస్తారు కానీ.. ఎన్ని ప్రేమ కథలు వచ్చిన విభిన్న ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. చాలామంది దర్శకులు మొదటి ప్రయత్నంలో ప్రేమ కథలనే నమ్ముకుంటారు. అందుకే నిరంతంరం ఏదో ఓ ప్రేమ కథ వస్తూనే ఉంటుంది. మరి అలాంటి కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది ప్రేమ పిపాసి. మరి ప్రేమ పిపాసి చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కనిపించిన ప్రతీ అమ్మాయిని ట్రాప్‌లో పడేసే బావ (కపిలాక్షి మల్హోత్ర)... ప్రేమ పేరు చెప్పి అసలు పని కానిచ్చేస్తాడు. బావతో పరిచయం పెంచుకున్న అమ్మాయిలు కూడా బావను తెగ వాడేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే బాలా (సోనాక్షి)ను చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. అమ్మాయిలను ఆటవస్తువుల్లా వాడుకుని వదిలేసే బావ బాలాను ఎందుకు ప్రేమిస్తాడు? బాలా ఎంతగా చీ కొట్టినా తన వెంటే ఎందుకు పడతాడు? బావ-బాలాకు  ఉన్న గతం ఏంటి? అమ్మాయిలను బావ ఎందుకు ట్రాప్ చేస్తుంటాడు? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ప్రేమకథలు ఎన్ని వచ్చినా.. కథలో కొత్తదనం.. రొమాన్స్ విషయంలో కథని ఆసక్తిగా మలిస్తే ఆ సినిమా హిట్ అవడం పక్కా. కానీ కొంతమంది దర్శకులు చాలా రొటీన్ కథలతో ప్రేమ కథలు అంటూ రెడీ అవుతుంటారు. అయితే ప్రేమ పిపాసి సినిమాకు తీసుకున్న స్టోరీ లైన్ యూత్‌ను ఆకట్టుకునేది కావడం ప్లస్ పాయింట్. ఈ కాలంలో ప్రేమ ఎలా ఉంది? అమ్మాయిలు-అబ్బాయిలు ఎందుకు ప్రేమించుకుంటున్నారు? దేని కోసం ప్రేమించుకుంటున్నారు? అనే అంశాలతో అల్లుకున్న కథ కావడంతో బాగానే అనిపిస్తుంది. కానీ దాన్ని తేర మీద ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ప్రేమలో ఓడిపోయిన బావ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్‌ను ఓపెన్ చేయడంతో అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించాడు. ఇక మెల్లిగా గతంలోకి తీసుకెళ్లడంతో ప్రథమార్థంలో ఊపు పెరిగినట్టుగా అనిపిస్తుంది. బావ రాసలీలలు, అమ్మాయిలను ట్రాప్ చేసే ట్రిక్స్, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ప్రథమార్థం సో సో గా అనిపిస్తుంది. అక్కడక్కడా డైలాగ్స్ బాగానే పేలాయి. ఇక కాస్త లాగింగ్ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ కూడా అలా అలా అనిపిస్తుంది. సినిమాలో స్టోరీ చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా అనిపించదు. స్క్రిప్ట్ లో బలం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. మొత్తంగా యూత్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా వాటిని తెరమీద ప్రెజెంట్ చెయ్యడంలో తడబడ్డాడు అనిపిస్తుంది.

ప్రేమ పిపాసిలో సంగీతం ఓకే ఓకేగా అనిపిస్తుంది. అక్కడక్కడా బీట్స్‌తో  మెప్పించినట్టు అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక సినిమాటోగ్రాఫర్ తన కెమెరాతో హీరో, హీరోయిన్లను అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు సో సో గా అనిపిస్తాయి.

రేటింగ్:2.25/5

Cinejosh Prema Pipasi Movie Review and Report

actor gps
kapilakshi malhotra
prema pipasi
movie
review
report