Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఎన్‌జికె(నంద గోపాలకృష్ణ)

Fri 31st May 2019 10:16 PM
surya new movie ngk,surya and sriraghava combo movie ngk,ngk movie review,ngk movie cinejosh review,ngk cinejosh review  సినీజోష్‌ రివ్యూ: ఎన్‌జికె(నంద గోపాలకృష్ణ)
telugu movie ngk సినీజోష్‌ రివ్యూ: ఎన్‌జికె(నంద గోపాలకృష్ణ)
సినీజోష్‌ రివ్యూ: ఎన్‌జికె(నంద గోపాలకృష్ణ) Rating: 2 / 5
Advertisement

 

 

 

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 

ఎన్‌జికె(నంద గోపాలకృష్ణ) 

నటీనటులు: సూర్య, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయిపల్లవి, నిళల్‌గల్‌ రవి, దేవరాజ్‌, ఉమా పద్మనాభన్‌, ఇళవరసు తదితరులు 

సంగీతం: యువన్‌ శంకర్‌రాజా 

సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌. 

నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు 

రచన, దర్శకత్వం: శ్రీరాఘవ 

విడుదల తేదీ: 31.05.2019 

హీరో సూర్య... పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్స్‌తోపాటు పెర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్స్‌ చెయ్యడానికి ఎక్కువగా మక్కువ చూపుతాడు. గజిని, ఆరు, యముడు, సింగం సిరీస్‌.. ఇలా డిఫరెంట్‌ జోనర్స్‌లో సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాడు. డైరెక్టర్‌ శ్రీరాఘవ... తమిళ్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు చేసిన శ్రీరాఘవ తెలుగులో 7జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రూపొందించాడు. అలాగే కార్తీ హీరోగా తెరకెక్కిని యుగానికి ఒక్కడు సినిమా కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఇలా రెండు విభిన్నమైన ఇమేజ్‌లు కలిగిన సూర్య, శ్రీరాఘవ కాంబినేషన్‌లో తొలి సినిమా రాబోతోందంటే ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ ఇద్దరికీ కొత్త జోనర్‌ అయిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ఎన్‌జికె. ఈ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. డిఫరెంట్‌ ఇమేజ్‌లు ఉన్న ఇద్దరూ కలిసి చేసిన ఎన్‌జికె ప్రేక్షకుల అంచనాలను రీచ్‌ అయ్యిందా? ఎన్‌జికె ద్వారా శ్రీరాఘవ చెప్పదలుచుకున్నదేమిటి? సూర్యకు ఈ సినిమా హీరోగా ఎలాంటి పేరుని తెచ్చింది? ఈ డిఫరెంట్‌ సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే. 

ఎన్‌జికెగా పిలవబడే నందగోపాలకృష్ణ ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఎంటెక్‌ చదివిన అతనికి ఆ జాబ్‌ కంటే ఆర్గానిక్‌ వ్యవసాయంపైన, ప్రజలకు సేవ చేయడంపైన ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే జాబ్‌కి రిజైన్‌ చేసి ఊరికి వచ్చేస్తాడు. ఆర్గానిక్‌ వ్యయసాయం పట్ల ఆ ఊరి రైతులను చైతన్యవంతుల్ని చేస్తాడు. కొంతమంది యువకులతో కలిసి ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తుంటాడు. ఇది కొంతమంది పెద్దలకు నచ్చదు. రైతులకు అప్పులిచ్చి వడ్డీలకు చక్రవడ్డీలు లాగుతూ పబ్బం గడుపుకునే ఆ గ్యాంగ్‌ ఎన్‌జికె కు వార్నింగ్‌ ఇస్తుంది. అయినా అతను తన పద్ధతి మార్చుకోడు. దీంతో ఊరి జనంపై దాడికి దిగుతుంది ఆ గ్యాంగ్‌. తన వల్ల జనం నష్టపోవడం ఇష్టం లేని ఎన్‌జికె ఒక శ్రేయోభిలాషి సలహా మేరకు ఆ ఏరియా ఎమ్మెల్యేను కలుస్తాడు. తమవారిపై జరుగుతున్న దాడులను ఆపించాలని రిక్వెస్ట్‌ చేస్తాడు. ఒక్క ఫోన్‌ కాల్‌తో అవన్నీ ఆపిస్తాడు ఎమ్మెల్యే. తను చేసిన సాయానికి బదులుగా తనకు ఏం చేస్తావని అడుగుతాడు. ఎన్‌జికెతోపాటు 500 మంది ఆ పార్టీలో చేరతాడని అతని స్నేహితుడు చెప్తాడు. చెప్పినట్టుగానే అందరూ పార్టీలో చేరతారు. ఎమ్మెల్యే చెప్పిన పనల్లా చేస్తూ అతని దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు ఎన్‌జికె. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్ళడం ఒక్కటే మార్గం అని తెలుసుకున్న ఎన్‌జికె ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలుపెడతాడు. క్రమేణా ప్రజల్లో ఎన్‌జికె మంచి పేరు సంపాదించుకుంటాడు. అతని పాపులారిటీ వల్ల తాము నష్టపోతామని భావించిన అధికార పక్షం, ప్రతిపక్షం ఎన్‌జికెను అంతం చెయ్యాలనుకుంటాయి. ఈ పరిస్థితిని ఎన్‌జికె ఎలా ఎదుర్కొన్నాడు? రాజకీయంగా ఎలా ఎదిగాడు? రాజకీయాల వల్ల ఎన్‌జికె నష్టపోయిందేమిటి? ఎన్‌జికెగా సూర్య ఎలాంటి నటనను ప్రదర్శించాడు? ఈ సినిమా ద్వారా శ్రీరాఘవ ఆడియన్స్‌కి చెప్పదలుచుకున్నదేమిటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఒక యాక్షన్‌ హీరో, ఎలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసే హీరో... అలాంటి ఒక హీరోతో శ్రీరాఘవ చేసిన ఎన్‌జికె ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్షలా మారింది. నందగోపాలకృష్ణ క్యారెక్టర్‌ ఇచ్చి ఒకవిధంగా సూర్యతో శ్రీరాఘవ ఆడుకున్నాడనే చెప్పాలి. అతని క్యారెక్టరైజేషన్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. పైగా అతని ఇమేజ్‌కి డామేజ్‌ కలిగించేలా పెర్‌ఫార్మెన్స్‌ ఇప్పించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ దశలోనూ సూర్య ఫలానా సీన్‌లో బాగా చేశాడు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే క్యారెక్టర్‌లోనే విషయం లేనపుడు హీరో నుంచి మంచి నటన ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఎన్‌జికె భార్యగా నటించిన సాయిపల్లవి... ఈ క్యారెక్టర్‌ని సాయిపల్లవే చెయ్యక్కర్లేదు ఎవరు చేసినా ఒకటే. ఎందుకంటే ఎలాంటి ఇంపార్టెన్స్‌ లేని క్యారెక్టర్‌. సాయిపల్లవిని పెట్టుకున్నాం కాబట్టి కొన్ని డైలాగ్స్‌ ఉండాలి అన్నట్టుగా అర్థం పర్థం లేని కొన్ని డైలాగులు ఆమెతో చెప్పించారు. ఆ సీన్స్‌ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. ఇక ఒక పార్టీకి పి.ఆర్‌. ఇన్‌ఛార్జ్‌గా రకుల్‌ ప్రీత్‌ కనిపిస్తుంది. అసలు ఆ క్యారెక్టర్‌ పెట్టడంలో ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. సూర్యకి, రకుల్‌కి మధ్య ఎలాంటి లవ్‌ ఎఫైర్‌ లేకపోయినా సాయిపల్లవి అనుమానించడం, హీరోను నానా మాటలు అనడం.. ఇవన్నీ మన సహనానికి పరీక్ష పెడతాయి. సూర్యతో ఎలాంటి ఎఫైర్‌ లేకపోయినా కలలో అతనితో ఒక డ్యూయెట్‌ వేసుకుంటుంది రకుల్‌. సినిమా మొత్తంలో మనకు తెలిసిన ముఖాలు ఈ మూడే. మిగతా వారంతా తమిళ్‌ నటనటులు కావడం, మనకు పరిచయం లేని వారు కావడంతో టోటల్‌గా తమిళ్‌ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే నేటివిటీ కూడా దానికి తగ్గట్టుగానే ఉండడంతో తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ అస్సలు రాదు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవడానికి కూడా పెద్ద ఈ సినిమాలో ఏమీ లేదు. శివకుమార్‌ విజయన్‌ ఫోటోగ్రఫీ బాగానే ఉన్నప్పటికీ సినిమా చెప్పుకోదగ్గ హైలైట్‌ సీన్స్‌ ఏమీ లేకపోవడంతో ఫోటోగ్రఫీ కూడా ఎక్కడా హైలైట్‌ అవ్వలేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌రాజా మరో ఫ్లాప్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. సినిమాలోని ఏ ఒక్క పాట కూడా వినసొంపుగా ఉండదు. దానికి తగ్గట్టుగానే సింగర్స్‌ని కూడా సెలెక్ట్‌ చేసుకోవడంతో పాటలు కర్ణ కఠోరంగా అనిపిస్తాయి. సినిమా కథ, కథనాలకు తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా నీరసంగా ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి స్లో నేరేషన్‌ ఉంటుంది. దాంతో ఎడిటింగ్‌ పైనే ఎక్కువ ప్రభావం పడింది. స్లో నెరేషన్‌వల్ల సినిమా లెంగ్త్‌ ఎక్కువనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగానే ఉన్నాయి. డైరెక్టర్‌ శ్రీరాఘవ గురించి చెప్పాలంటే యూత్‌కి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న అతని ప్రయత్నం మంచిదే అయినా దాన్ని సరైన రీతిలో చెప్పలేకపోవడం వల్ల టోటల్‌గా సినిమా అడ్డదారి తొక్కింది. కథ, కథనాల్లో పటుత్వం లేకపోవడం, క్యారెక్టర్స్‌ అన్నీ తేలిపోవడం, హీరో క్యారెక్టర్‌ని ఓ బఫూన్‌లా చూపించే ప్రయత్నం చెయ్యడం, హీరోయిన్ల క్యారెక్టర్లతో సుత్తి కొట్టడం, సరైన పాటలు లేకపోవడం, ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది జీరోగా ఉండడం వంటి అంశాలు సినిమా పరాజయానికి కారణాలుగా చెప్పొచ్చు. డైరెక్టర్‌ తాను చెప్పాలనుకున్న విషయాల్లో అతనికే క్లారిటీ లేదనేది సినిమా పూర్తయిన తర్వాత మనకు అర్థమవుతుంది. సాధారణంగా సూర్య సినిమా అనగానే మంచి మాస్‌ డైలాగ్స్‌, టిపికల్‌ ఫైట్స్‌, హీరోయిన్స్‌తో డూయెట్స్‌.. ఇలా అన్నీ ఉండాలని ప్రేక్షులు కోరుకుంటారు. కానీ, ఈ సినిమాలో పైన చెప్పుకున్న ఏ ఒక్కటీ సరిగ్గా ఉండదు. ఇక సినిమాలో హైలైట్స్‌ గురించి చెప్పుకోవాలంటే ఒక్కటి కూడా లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే సూర్య, శ్రీరాఘవ కాంబినేషన్‌లో వచ్చిన ఎన్‌జికె చిత్రం ఏ వర్గం ఆడియన్స్‌నీ ఆకట్టుకోదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఎన్‌జీకే.. నాట్‌ ఓకే!

telugu movie ngk:

surya new movie ngk

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement