Advertisementt

సినీజోష్‌ రివ్యూ: దర్శకుడు

Sat 05th Aug 2017 11:50 AM
darshakudu movie review,telugu movie darshakudu,darshakudu movie review in cinejosh,darshakudu cinejosh review,sukumar produced movie darshakudu  సినీజోష్‌ రివ్యూ: దర్శకుడు
darshakudu movie review సినీజోష్‌ రివ్యూ: దర్శకుడు
సినీజోష్‌ రివ్యూ: దర్శకుడు Rating: 2.5 / 5
Advertisement
Ads by CJ

సుకుమార్‌ రైటింగ్స్‌, బి.టి.ఆర్‌.ఎన్‌. క్రియేషన్స్‌, ప్లేబ్యాక్‌ ప్రొడక్షన్స్‌ 

దర్శకుడు 

తారాగణం: అశోక్‌, ఈషా రెబ్బా, పూజిత, సుదర్శన్‌, కేదార్‌ శంకర్‌, జెమిని సురేష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ అనుమోలు 

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 

సంగీతం: సాయికార్తీక్‌ 

నిర్మాతలు: బి.ఎన్‌.సి.ఎస్‌.పి.విజయ్‌కుమార్‌, థామస్‌రెడ్డి అదూరి, రవిచంద్ర సట్టి 

రచన, దర్శకత్వం: జక్కా హరిప్రసాద్‌ 

విడుదల తేదీ: 04.08.2017 

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలంటే అందరూ ఇష్టంగానే చూస్తారు. అయితే రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తే రొటీన్‌కి భిన్నంగా వుంటూ ఆడియన్స్‌ని రిలాక్స్‌ చేస్తాయి. చాలారోజుల తర్వాత సినిమా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ప్రేమకథా చిత్రం దర్శకుడు. కొత్త హీరో అశోక్‌తో సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌లో కొత్త దర్శకుడు జక్కా హరిప్రసాద్‌ రూపొందించిన దర్శకుడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బ్యాక్‌డ్రాప్‌, పైగా లవ్‌స్టోరీ. ఈ రెండింటినీ ప్రేక్షకులకు కనెక్ట్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ హరిప్రసాద్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అసలు దర్శకుడు అనే టైటిల్‌ పెట్టడానికి రీజన్‌ ఏమిటి? అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి హీరోగా మారిన అశోక్‌ తన క్యారెక్టర్‌కి ఎంతవరకు న్యాయం చేశాడు? ఈ సినిమాలో డైరెక్టర్‌ చూపించిన కొత్తదనం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

అతని పేరు మహేష్‌(అశోక్‌). స్కూల్‌లో చదువుతున్న రోజుల నుంచే సినిమా అంటే పిచ్చి. పెద్దయ్యాక డైరెక్టర్‌ అవ్వాలన్నది అతని కల. అతని లక్ష్యాన్ని గుర్తించిన తండ్రి ఎలాగైనా డైరెక్టర్‌ అవ్వాలని కొడుకు దగ్గర మాట తీసుకుంటాడు. కట్‌ చేస్తే పెద్దవాడైన మహేష్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. ఆ సినిమా హీరోకి కథ చెప్పి ఓకే చేయించుకుంటాడు. ఆ తర్వాత నిర్మాతకి కూడా కథ చెప్తాడు. అయితే కథ బాగానే వుంది కానీ అందులో లవ్‌స్టోరీ మిస్‌ అయిందని, అది కూడా వుంటే సినిమా సూపర్‌గా వుంటుందని చెప్తాడు. నువ్వు ఎవర్నీ లవ్‌ చెయ్యలేదు కాబట్టి ఆ ఫీల్‌ నీకు తెలీదని, 15 రోజులు టైమ్‌ తీసుకొని లవ్‌ ట్రాక్‌ కూడా రాసుకొని రమ్మంటాడు. వెంటనే సిటీ నుంచి ఊరికి బయల్దేరతాడు మహేష్‌. ట్రైన్‌లో నమ్రత(ఈషా రెబ్బా) పరిచయమవుతుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ కలిసి జర్నీ చెయ్యాల్సి వస్తుంది. ఈ జర్నీలో అతనికి కావాల్సినన్ని ఎమోషన్స్‌, లవ్‌సీన్స్‌ దొరుకుతాయి. వాటిని తన కథలో వాడుకుంటాడు. మహేష్‌తో చేసిన జర్నీలో నమ్రత అతన్ని ప్రేమిస్తుంది. ప్రపోజ్‌ చేసే టైమ్‌లో తన ప్రేమని కథ కోసం వాడుకుంటున్నాడని మహేష్‌ని ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. సినిమా కోసం నమ్రత ప్రేమను, ఆమె ఎమోషన్స్‌ని వాడుకున్న మహేష్‌ దానికి ఎలా రియాక్ట్‌ అయ్యాడు? సినిమా కోసమే కాదని, నిజంగానే నమ్రతని ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాడా? ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చాయి? వారి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి కథ సుఖాంతమైందా? అనేది తెరమీద చూడాల్సిందే. 

ఈ సినిమాతో హీరోగా పరిచయమైన అశోక్‌ నటన పరంగా ప్రారంభ దశలోనే వున్నాడు కాబట్టి కొన్ని ఎమోషన్స్‌ని ఫేస్‌లో చూపించలేకపోయాడు. మరికొన్ని సీన్స్‌లో చాలా నేచురల్‌గా పెర్‌ఫార్మ్‌ చెయ్యగలిగాడు. సాధారణంగా డైరెక్టర్లు ఎలా బిహేవ్‌ చేస్తారనేది కూడా బాగా చేశాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో కొత్తవాడైనా ఓకే అనిపించాడు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా మరికొంత బెటర్‌మెంట్‌కి ట్రై చేస్తే హీరోగా సక్సెస్‌ అయ్యే అవకాశం వుంది. హీరోయిన్‌ ఈషా రెబ్బా తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది. అన్ని ఎమోషన్స్‌ని చక్కగా పలికించింది. నమ్రత క్యారెక్టర్‌ని అందరూ ఇష్టపడేలా పెర్‌ఫార్మ్‌ చెయ్యగలిగింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన సుందర్శన్‌ సందర్భానుసారం కొంత కామెడీ చెయ్యగలిగాడు. రెండుంపావు గంటల సినిమాలో ఎక్కువ శాతం హీరో, హీరోయినే స్క్రీన్‌పై కనిపిస్తుంటారు. కాబట్టి మిగతా క్యారెక్టర్లకు పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్‌ లేదు. 

సాంకేతిక విభాగాలకు వస్తే ప్రవీణ్‌ అనుమోలు ఫోటోగ్రఫీ బాగుంది. ఉన్నంతలో ప్రతి సీన్‌ని రిచ్‌గా, బ్రైట్‌గా కళ్ళకు ఇబ్బంది కలగని విధంగా చూపించాడు. సాయికార్తీక్‌ మ్యూజిక్‌ బాగుంది. ఎలాంటి హడావిడి చేయకుండా అందరూ విని ఎంజాయ్‌ చెయ్యదగ్గ పాటలు చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు, ఎమోషన్స్‌కి తగ్గట్టు చేశాడు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాగానే వున్నప్పటికీ సెకండాఫ్‌లో చాలా అనవసరమైన సీన్స్‌ వల్ల ల్యాగ్‌ ఎక్కువైపోయింది. ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యే సందర్భాలు కూడా వున్నాయి. కథకు తగ్గట్టు సినిమాకి ఎంత బడ్జెట్‌ పెట్టాలో అంత బడ్జెట్‌ పెట్టడంలో నిర్మాతలు కాంప్రమైజ్‌ అవ్వలేదు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. డైరెక్టర్‌ హరిప్రసాద్‌ గురించి చెప్పాలంటే తన మొదటి ప్రయత్నమే సినిమా బ్యాక్‌డ్రాప్‌లో తియ్యాలనుకోవడం సాహసమనే చెప్పాలి. ఒక పక్క దర్శకుడి కథ, మరో పక్క అతని లవ్‌స్టోరీ. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌ ఎక్కడా డిస్ట్రబ్‌ అవ్వకుండా బాగానే మేనేజ్‌ చేసాడని చెప్పొచ్చు. సినిమాలో కథ, కథనాలకు సంబంధించి చాలా లాజిక్కులు మిస్సయ్యాయి. హీరో చెప్పిన కథకి ఓకే అన్న నిర్మాత అందులో లవ్‌ ట్రాక్‌ మిస్‌ అయ్యిందని చెప్తాడు. అది చేస్తే సినిమా స్టార్ట్‌ చెయ్యొచ్చు అంటాడు. హీరో మాత్రం హీరోయిన్‌తో ట్రావెల్‌ అయిన ప్రతి సీన్‌ని సినిమా కోసం వాడుకుంటాడు. హీరో, హీరోయిన్‌ ట్రైన్‌లో కలుసుకున్న దగ్గర నుంచి ఎండింగ్‌ వరకు అదే స్టోరీతో సినిమా చేసి అదే కథ అన్నట్టు చూపించాడు తప్ప అసలు కథ ఇదీ అని చెప్పలేదు. డైరెక్షన్‌ అంటేనే క్రియేటివిటీ. హీరో ఎలాంటి క్రియేటివిటీని చూపించకుండా హీరోయిన్‌తో తను గడిపిన క్షణాలతోనే కథ చేసి సినిమా తీస్తాడు. ఆ కథతోనే హిట్‌ కొడతాడు. డైరెక్టర్‌ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న హీరో తన సొంత కథతో సినిమా తియ్యలేకపోయాడు. ఫస్ట్‌హాఫ్‌ అంతా హీరోయిన్‌ మూమెంట్స్‌ తన కథకి అన్వయించుకుంటూ హీరో వెళ్ళడం, కథ కూడా అలాగే రన్‌ అవ్వడం కొత్తగా అనిపించింది. ఎప్పుడైతే తన ప్రేమని సినిమా కథకి వాడుకుంటున్నాడని తెలుసుకున్న హీరోయిన్‌ ఛీ కొట్టడంతో ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అవుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎక్కడ ఆగిన కథ అక్కడే వుంటుంది. కథకి అవసరం లేని సీన్స్‌తో కాలక్షేపం చేశాడు డైరెక్టర్‌. ఇక క్లైమాక్స్‌ను కూడా సాగదీశాడు. ఐదు నిముషాల్లో పూర్తి కావాల్సిన క్లైమాక్స్‌కి దాదాపు 20 నిముషాలు తీసుకున్నాడు. దీంతో ఎంత సేపటికీ సినిమా కంప్లీట్‌ అవ్వదేమిటి? అనే అసహనం ప్రేక్షకుల మొహాల్లో కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే దర్శకుడు ఇప్పుడొస్తున్న సినిమాలకు భిన్నమైన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథ, కథనం, మాటలు కొత్తగా అనిపిస్తాయి. స్లో నేరేషన్‌తో సినిమా రన్‌ అవుతున్నా ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి నేరేషన్‌ మరింత స్లో అయిపోవడం, అనవసరమైన సీన్స్‌ కథలోకి వచ్చి చేరడం, ఎంతకీ సినిమా కంప్లీట్‌ అవ్వడం లేదనే ఫీలింగ్‌ కలిగించడం సినిమాకి మైనస్‌ అయ్యాయి. సినిమా బ్యాక్‌డ్రాప్‌ అంటే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌ కలిగించే అంశమే కాబట్టి ఈ సినిమా యూత్‌ని ఆకట్టుకునే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: దర్శకుడు కొన్ని మిస్సయ్యాడు

darshakudu movie review:

sukumar produced new movie darshakudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ