Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఫిదా

Fri 21st Jul 2017 08:35 PM
sekhar kammula new movie fidaa,telugu movie fidaa,fidaa movie telugu review,hero varun tej new movie fidaa,telugu movie fidaa review in cinejosh.com,telugu movie fidaa cinejosh review  సినీజోష్‌ రివ్యూ: ఫిదా
telugu movie fidaa review సినీజోష్‌ రివ్యూ: ఫిదా
సినీజోష్‌ రివ్యూ: ఫిదా Rating: 3 / 5
Advertisement

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ 

ఫిదా 

తారాగణం: వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి, రాజా చెంబోలు, సాయిచంద్‌, శరణ్య ప్రదీప్‌, 

గీతా భాస్కర్‌, హర్షవర్థన్‌ రాణే, సత్యం రాజేష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి. కుమార్‌ 

సంగీతం: శక్తికాంత్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జీవన్‌బాబు 

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ 

నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌ 

రచన, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల 

విడుదల తేదీ: 21.07.2017 

శేఖర్‌ కమ్ముల సినిమా అనగానే అది సినిమాలా కాకుండా ఎంతో సహజంగా, నిత్యం మనం చూసే క్యారెక్టర్లు, వినే మాటలు, సంఘటనలు... ఇవే గుర్తొస్తాయి. చెప్పుకోదగ్గ కథ లేకపోయినా కథనం, మాటలు, పాత్ర చిత్రణతో ప్రేక్షకుల్ని మెప్పించెయ్యగలడు. అలాంటి శేఖర్‌ కమ్ముల ఈమధ్య కాలంలో తీసిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరవైంది. తన పంథా మార్చుకోకపోవడం వల్లనో, ప్రేక్షకుల అభిరుచి మారడం వల్లనో వరసగా పరాజయాలు చవి చూశాడు శేఖర్‌ కమ్ముల. ఇప్పుడు ఫిదా అంటూ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? శేఖర్‌ కమ్ముల తన పంథాను మార్చుకున్నాడా? లేక ప్రేక్షకులకే కొత్త పంథా పరిచయం చేశాడా? వరుణ్‌ తేజ్‌కి ఈ సినిమా ఎలాంటి ప్లస్‌ అవుతుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మొదట మనం చెప్పుకున్నట్టు శేఖర్‌ కమ్ముల సినిమాలో కథ కంటే మిగతా విషయాలకే ఎక్కువ ప్రాధాన్యముంటుంది. ఫిదా విషయంలో కూడా అదే జరిగింది. శేఖర్‌ తన పంథాని మార్చుకోలేదు గానీ కొన్ని కొత్త హంగుల్ని తన సినిమాలో చేర్చాడు. అదేమిటంటే తెలంగాణ స్లాంగ్‌. హీరోయిన్‌ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారు. మధ్యలో హీరోతో కూడా ఒకటి రెండు సన్నివేశాల్లో తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పించారు. కథ విషయానికి వస్తే వరుణ్‌(వరుణ్‌తేజ్‌) అమెరికాలో డాక్టర్‌. అన్నయ్య, తమ్ముడితో కలిసి వుంటాడు. తన అన్నయ్యకి ఇండియా నుంచి ఒక పెళ్ళి సంబంధం వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత తన తమ్ముడి ఒపీనియన్‌ కూడా తీసుకోవాలంటాడు అన్నయ్య. అలా వరుణ్‌ బాన్సువాడ గ్రామంలోకి ఎంటర్‌ అవుతాడు. వచ్చీ రావడంతోనే పెళ్ళి కూతురి చెల్లెలు భానుమతి(సాయిపల్లవి)తో వాగ్వాదం జరుగుతుంది. అక్క పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళిపోవడం భానుకి ఇష్టం లేదు. పెళ్ళయితే పుట్టి, పెరిగిన ఊరిని వదిలి వెళ్ళాలా? ఇక్కడే ఎందుకు వుండకూడదు అనేది భాను వాదన. పల్లెటూళ్ళో ఏముంది? అంతా చెత్త అనేది వరుణ్‌ అభిప్రాయం. అలా వారి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ కోపంతో వరుణ్‌ని నానా ఇబ్బందులు పెడుతుంది. అందరి అభీష్టం మేరకు వరుణ్‌ అన్నయ్యకు, భానుమతి అక్కతో పెళ్ళి జరిగిపోతుంది. ఈ క్రమంలో వరుణ్‌ ఎంత మంచివాడో తెలుసుకుంటుంది భానుమతి. వరుణ్‌ కూడా భాను ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను వరుణ్‌కి వ్యక్త పరచాలనుకునే టైమ్‌లో ఒక అపార్థం వారి మధ్య చోటు చేసుకుంటుంది. దాంతో అన్నయ్య, వదినతో కలిసి అమెరికా వెళ్ళిపోతాడు వరుణ్‌. అతను ఫోన్‌ చేసినా భాను ఆన్సర్‌ చెయ్యదు. ఒకరి ప్రేమను మరొకరికి చెప్పుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి? వారి మధ్య దూరం పెరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? చివరికి వరుణ్‌, భానుమతి ఎలా కలుసుకున్నారు? భాను ప్రపంచంలోకి వరుణ్‌ వచ్చాడా? వరుణ్‌ ఇష్టానుసారం భానుమతి నడుచుకుందా? అనేది తెరపై చూడాల్సిందే. 

చెప్పుకోవడానికి ఇది చాలా సాదా సీదా కథ. హీరో, హీరోయిన్‌ మధ్య అపార్థాలు రావడానికి, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత దూరం అయిపోవడానికి బలమైన కారణం మనకు కనిపించదు. సినిమాలో చూపించిన కారణం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒకరంటే ఒకరికి చెడు అభిప్రాయాలు కలుగుతాయి. తన మరిది బాధ చూడలేని వదిన తన చెల్లెల్ని మర్చిపొమ్మని, ఆమె అంత మంచిది కాదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి అంత డీప్‌గా వెళ్ళిపోయి నిద్రాహారాలు మానేసి హీరోయిన్‌ కోసం వెంపర్లాడేంత అవసరం హీరోకి లేదు. కానీ, దాదాపు సెకండాఫ్‌ అంతా హీరో మూడీగానే వుంటాడు, ఎప్పుడూ బాధపడుతూ వుంటాడు. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా నీరసం వస్తుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌ వరకు తెలంగాణ యాసను మినహాయిస్తే శేఖర్‌ కమ్ముల డైరెక్ట్‌ చేసిన ఆనంద్‌ సినిమా గుర్తొస్తుంటుంది. సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగు రాని సాయిపల్లవి తెలంగాణ యాసలో డబ్బింగ్‌ చెప్పడం అన్నింటినీ మించిన కొత్త విషయం. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా సాయిపల్లవికి నూటికి నూరు మార్కులు పడతాయి. వరుణ్‌తేజ్‌కి ఇది కొత్త తరహా సినిమాయే అయినప్పటికీ హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఇంప్రెస్‌ చేసినంతగా హీరో క్యారెక్టర్‌ చెయ్యలేదనేది వాస్తవం. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అతనికి నూటికి యాభై మార్కులు ఇవ్వొచ్చు. 

శేఖర్‌ కమ్ముల చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలకు విజయ్‌ సి.కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌. ఈ సినిమాకి కూడా అతనే ఫోటోగ్రఫీ అందించాడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ని అందంగా చూపించాడు. అయితే కొన్ని ఏరియల్‌ షాట్స్‌ నిలకడగా తీసినట్టు అనిపించవు. కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ శక్తికాంత్‌ పాటలు బాగా చేశాడు. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్‌ కూడా బాగా చేశారు. జీవన్‌బాబు కథ, కథనాలకు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాడు. మార్తాండ్‌ కె.వెంకటేష్‌ చేసిన ఎడిటింగ్‌లో అక్కడక్కడా జర్క్స్‌ కనిపించాయి. అయితే అవి కథనాన్ని దెబ్బతీసేవిగా లేవు. శేఖర్‌ కమ్ముల గురించి చెప్పాలంటే 13 సంవత్సరాల క్రితం తీసిన ఆనంద్‌ తరహాలోనే ఈసారి తెలంగాణ స్లాంగ్‌లో ఒక కొత్త ప్రయత్నం చేశాడు. రెండున్నర గంటల సినిమాలో ప్రతి సన్నివేశం చాలా స్లోగా కదులుతుంది. చూసిన సీన్లనే మళ్ళీ మళ్ళీ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. వదిన, మరిది మధ్య పదే పదే అవే సీన్స్‌ ఒకే టాపిక్‌తో రిపీట్‌ అవుతుంటాయి. ఆ సీన్స్‌లో దాదాపు అవే డైలాగ్స్‌ వినిపిస్తాయి. ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోదగ్గవి హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌, సాయిపల్లవి పెర్‌ఫార్మెన్స్‌, తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్‌, ఫోటోగ్రఫీ, పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సెంటిమెంట్‌ సీన్స్‌. మైనస్‌ పాయింట్స్‌ గురించి చెప్పాలంటే బలమైన కథంటూ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కేవలం సీన్స్‌తో, డైలాగ్స్‌తో నడిపించెయ్యడం, ఫస్ట్‌హాఫ్‌లో కనిపించిన హుషారు సెకండాఫ్‌లో లేకపోవడం, సెకండాఫ్‌ మధ్యలోనే ముగించాల్సిన కథని మరో అరగంట పాటు సాగదీయడం.. వంటి విషయాల వల్ల మూడు గంటల సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా కలిసి చూడదగ్గ సినిమా అయినప్పటికీ కథలో బలం లేకపోవడం వల్ల కేవలం హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌, తెలంగాణ సంప్రదాయాలు, పాటలు, ఫోటోగ్రఫీ కోసం సినిమాని చూడొచ్చు. సినిమా స్టార్టింగ్‌ నుండి వున్న స్లో నేరేషన్‌ వల్ల బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌ని ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: సాయిపల్లవికి ఫిదా అయిపోతారు

telugu movie fidaa review:

sekhar kammula new directorial movie fidaa

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement