Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కేశవ

Fri 19th May 2017 09:44 PM
telugu movie keshava review,keshava movie review in cinejosh,keshava cinejosh review,hero nikhil new movie keshava,keshava movie directed by sudheer varma  సినీజోష్‌ రివ్యూ: కేశవ
keshava movie review సినీజోష్‌ రివ్యూ: కేశవ
సినీజోష్‌ రివ్యూ: కేశవ Rating: 2.75 / 5
Advertisement
Ads by CJ

అభిషేక్‌ పిక్చర్స్‌ 

కేశవ 

తారాగణం: నిఖిల్‌, రీతూ వర్మ, ఈషా కొప్పికర్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, 

బ్రహ్మాజీ, జీవా, అజయ్‌, రవిప్రకాష్‌, రాజా రవీంద్ర, ప్రియదర్శి, మధుసూదన్‌, సుదర్శన్‌, సత్య తదితరులు 

సినిమాటోగ్రఫీ: దివాకర్‌ మణి 

సంగీతం: సన్ని ఎం.ఆర్‌. 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ప్రశాంత్‌ పిళ్ళై 

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌ 

సమర్పణ: దేవాంశ్‌ నామ 

నిర్మాత: అభిషేక్‌ నామ 

రచన, దర్శకత్వం: సుధీర్‌వర్మ 

విడుదల తేదీ: 19.05.2017 

సుధీర్‌వర్మ దర్శకత్వంలో నిఖిల్‌ చేసిన స్వామిరారా ఓ డిఫరెంట్‌ మూవీగా అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిత్రం సాధించిన సక్సెస్‌తో తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం వుండేలా చూసుకుంటూ సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేస్తున్నాడు నిఖిల్‌. స్వామిరారా తర్వాత నాగచైతన్యతో సుధీర్‌వర్మ చేసిన దోచెయ్‌ సక్సెస్‌ అవ్వలేదు. లేటెస్ట్‌గా నిఖిల్‌తో కేశవ పేరుతో మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీని చేశాడు. నిఖిల్‌ చేసే ప్రతి సినిమా వెరైటీగా వుంటుందని, రెగ్యులర్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా వుంటుందని ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్స్‌కి వచ్చే ఆడియన్స్‌ని కేశవ శాటిస్‌ఫై చెయ్యగలిగిందా? నిఖిల్‌, సుధీర్‌వర్మ కాంబినేషన్‌ మరో సూపర్‌హిట్‌ ఇవ్వగలిగిందా? కేశవ చిత్రంలో వున్న వెరైటీ ఏమిటి? దాన్ని ఆడియన్స్‌ ఎంతవరకు యాక్సెప్ట్‌ చేశారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమా, ఓ విభిన్న కథా చిత్రం అనగానే మన డైరెక్టర్లకు వచ్చే ఆలోచన హీరో క్యారెక్టర్‌ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేద్దాం. హీరోకి ఏదైనా డిసీజ్‌ పెట్టి దానిపైన సినిమాని రన్‌ చేద్దాం లేదా ఓ మర్డర్‌ మిస్టరీని మిస్టరీగా తీద్దాం వంటి ఆలోచనలే వస్తాయి. అలా వచ్చిన ఆలోచనే ఈరోజు విడుదలైన కేశవ. కేశవ అనే టైటిల్‌కి పెద్ద ప్రాధాన్యత లేదు. కేవలం హీరో క్యారెక్టర్‌ పేరునే టైటిల్‌గా పెట్టారు తప్ప టైటిల్‌ ద్వారా ఏమీ చెప్పాలనే ప్రయత్నం చెయ్యలేదు. ఈ సినిమా గురించి మొదటి నుంచీ చెప్పుకుంటూ వస్తున్నట్టుగానే ఇది ఓ రివెంజ్‌ డ్రామా. ఏ కథలోనైనా హీరో.. విలన్‌పై లేదా విలన్లపై పగ తీర్చుకోవాలనుకోవడానికి ఓ బలమైన రీజన్‌, హీరోకి అన్యాయం చేసిన వారిని చంపి తీరాల్సిందే అని ఆడియన్స్‌ కూడా ఫీల్‌ అయిన సందర్భాల్లోనే హీరో ఏం చేసినా విజిల్స్‌ వేస్తారు. అయితే ఇందులో కేవలం పగ తీర్చుకోవడానికి హీరోకి ఒక రీజన్‌ కావాలి కాబట్టి పోలీసుల వల్ల హీరోకి అన్యాయం జరిగినట్టు చూపించడం జరిగింది. ఓ యాక్సిడెంట్‌లో తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన పోలీసుల్ని వరసగా చంపుకుంటూ పోవడమే కేశవ ప్రధాన ఇతివృత్తం. అయితే సినిమా స్టార్టింగ్‌లోనే కథ ఏమిటి, హీరో నెక్స్‌ట్‌ ఏం చెయ్యబోతున్నాడు అనేది సగటు ప్రేక్షకుడు సైతం ఊహించే విధంగానే వుంటాయి. అయితే వాటిని కూడా డైరెక్టర్‌ ఎంత అందంగా తీశాడు? కేశవ క్యారెక్టర్‌లో నిఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది? హత్యలు చేసి పోలీసుల నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు? అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. 

నిఖిల్‌ అనగానే జాలీగా వుండే కుర్రాడిలా, హీరోయిన్‌ చుట్టూ తిరుగుతూ అల్లరి చేసేవాడిలా మనందరికీ తెలుసు. అయితే ఫస్ట్‌టైమ్‌ ఈ సినిమాలో సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు సీరియస్‌ మూడ్‌లోనే వుండే క్యారెక్టర్‌ చేశాడు నిఖిల్‌. సినిమా మొత్తంలో అతను చెప్పిన డైలాగ్స్‌ కూడా చాలా తక్కువ. కేశవ క్యారెక్టర్‌కి తగ్గట్టు నిఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు అనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌కి అస్సలు పనిలేదు. హీరోయిన్‌ వుండాలి కాబట్టి వుంది అన్నట్టుగా రీతూవర్మతో ఆ క్యారెక్టర్‌ చేయించారు. ఆమె పెర్‌ఫార్మెన్స్‌ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సీరియస్‌ మూడ్‌లో వెళ్తున్న కథలో వెన్నెల కిషోర్‌, సత్య, ప్రియదర్శి, మధుసూదన్‌ వంటి ఆర్టిస్టులు అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశారు. కొంత వరకు సక్సెస్‌ అయ్యారని చెప్పాలి. కేశవ చేసే హత్యల మిస్టరీని ఛేదించేందుకు వచ్చిన స్పెషల్‌ ఆఫీసర్‌ షర్మిలగా ఈషా కొప్పికర్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. ఆమె పెర్‌ఫార్మెన్స్‌కి, అనసూయ చెప్పిన డబ్బింగ్‌ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయింది. రెండు వేరియేషన్స్‌ కలిగి వున్న రావు రమేష్‌ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో అజయ్‌, జీవా, బ్రహ్మాజీ, రాజా రవీందర్‌ ఫర్వాలేదు అనిపించారు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌కి వస్తే దివాకర్‌ మణి ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని ఏరియల్‌ షాట్స్‌ చాలా అందంగా చెయ్యగలిగాడు. మ్యూజిక్‌ విషయానికి వస్తే సన్ని ఎం.ఆర్‌. ఈ చిత్రం కోసం చేసిన పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. ప్రశాంత్‌ పిళ్ళై ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. ఎస్‌.ఆర్‌.శేఖర్‌ ఎడిటింగ్‌ కూడా మంచి గ్రిప్పింగ్‌గా వుంది. సినిమాలో ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. పాటల కోసం, ఫైట్స్‌ కోసం ఫారిన్‌ లొకేషన్స్‌కి వెళ్ళకపోయినా వున్నంతలో సినిమాని రిచ్‌గా చెయ్యడంలో అభిషేక్‌ పిక్చర్స్‌ సక్సెస్‌ అయింది. డైరెక్టర్‌ సుధీర్‌వర్మ గురించి చెప్పాల్సి వస్తే నిఖిల్‌తో చేసిన మొదటి సినిమాలో వున్నంత విషయం ఈ సినిమాలో లేదనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఐదుగురు పోలీసులు వున్న జీప్‌ వచ్చి తమ కారుని గుద్దేస్తే దానివల్ల తల్లిదండ్రులు చనిపోతే యాక్సిడెంట్‌ చేసినవాడిని కాకుండా కారులో వున్న అందర్నీ వరసగా చంపుకుంటూ పోవడం పేలవంగా అనిపిస్తుంది. హీరోకి గుండె కుడివైపున వుంటుందని, దానివల్ల ఎక్కువ ఆవేశపడితే చనిపోతాడని స్టార్టింగ్‌లో చెప్తారు. అయితే దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు సినిమాలో ఎక్కడా అనిపించదు. ఇన్స్‌పెక్టర్‌ అయిన రవిప్రకాష్‌ రాష్ట్రంలో ఎక్కడ మర్డర్‌ జరిగినా అక్కడ ఠక్కున ప్రత్యక్షమవుతుంటాడు. ఇది కాస్త కామెడీగానే అనిపించింది. ఇక హీరో పోలీసులకు దొరక్కుండా చాలా అలవోకగా హత్యలు చేసుకుంటూ వెళ్తుంటాడు. పోలీసులకు మాత్రం ఎలాంటి క్లూ దొరకదు. ఈ హత్యలు చేసే ప్రాసెస్‌ అంతా హీరోకి ఫేవర్‌గానే జరుగుతూ వుంటుంది. ఇదంతా ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కి హీరోని అరెస్ట్‌ చెయ్యడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో అందరూ ఈజీగా ఊహించేలా వుంది. హత్యల కేసులో అరెస్ట్‌ అయిన హీరో అంతే సునాయాసంగా నిర్దోషిగా విడుదలై వస్తాడు. ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అని చెప్పుకోదగినవి హీరో పెర్‌ఫార్మెన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఫోటోగ్రఫీ మాత్రమే. స్లో నేరేషన్‌, ప్రధాన ఇతివృత్తంలోనే లోపాలు వుండడం, హీరో, హీరోయిన్‌ మధ్య అసలు లవ్‌ ట్రాక్‌ అనేదే లేకపోవడం, పూర్తిగా రెండు గంటలు కూడా లేని సినిమాని మూడు గంటల సేపు చూస్తున్న ఫీలింగ్‌ కలగడం సినిమాకి మైనస్‌ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే వరసగా హిట్స్‌ కొడుతూ వస్తున్న నిఖిల్‌కి కేశవ నిరుత్సాహాన్ని కలిగించే సినిమా అనే చెప్పాలి. రివెంజ్‌ డ్రామాలో వుండాల్సిన స్పీడ్‌ లేకపోవడం వల్ల, కథ, కథనాల్లో అనేక లోపాలు వుండడం వల్ల కేశవ ఓ ఏవరేజ్‌ మూవీగా నిలుస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: రొటీన్‌ రివెంజ్‌ డ్రామా

keshava movie review:

hero nikhil latest movie keshava directed by sudheer varma. keshava is a revenge drama as told before in many movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ