Advertisementt

సినీజోష్‌ రివ్యూ: రోగ్‌

Fri 31st Mar 2017 09:31 PM
telugu movie rougue,puri jagannath latest movie rogue,rogue movie review,rogue movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: రోగ్‌
సినీజోష్‌ రివ్యూ: రోగ్‌
Advertisement
Ads by CJ

తన్వి ఫిలింస్‌ 

రోగ్‌ 

తారాగణం: ఇషాన్‌, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్‌ సింగ్‌, పోసాని, ఆజాద్‌ఖాన్‌, ఆలీ, సత్యదేవ్‌, సుబ్బరాజు, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి తదితరులు 

సినిమాటోగ్రఫీ: ముఖేష్‌ జి. 

సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 

ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖి 

సమర్పణ: జయాదిత్య 

నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి 

రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 

విడుదల తేదీ: 31.03.2017 

పూరి జగన్నాథ్‌ సినిమాలకీ, ఆ సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్స్‌కీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ వుంది. పూరి సినిమా వస్తోందంటే అందులో ఏదో స్పెషాలిటీ వుంటుందన్న నమ్మకం ఆడియన్స్‌లో వుంటుంది. అలాంటి చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రూపొందిన సినిమా రోగ్‌. కొత్త హీరో ఇషాన్‌ కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూరి డైరెక్ట్‌ చేసిన రోగ్‌ చిత్రానికి సంబంధించి రిలీజ్‌కి ముందు విడుదలైన ట్రైలర్స్‌, సాంగ్స్‌ అంచనాలను భారీగా పెంచాయి. రవితేజతో ఇడియట్‌ ఓ చంటిగాడి ప్రేమకథ చేసిన పూరి ఇప్పుడు ఇషాన్‌తో రోగ్‌ మరో చంటిగాడి ప్రేమకథ అంటూ ఓ కొత్త కథతో వచ్చాడు. ఆ చంటిగాడు అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. మరి ఈ చంటిగాడు ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడా? ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాడా? రోగ్‌లో పూరి తన మార్క్‌ చూపించగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

రెండేళ్ళు జైలు శిక్ష పడిన ఖైదీ(చంటి). ఏం నేరం చేసి జైలుకొచ్చావు అని తోటి ఖైదీలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా తన స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు చంటి. చంటి, పోలీస్‌ కమిషనర్‌ చెల్లెలైన అంజలి(ఏంజెలా) ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ఓ ఫైన్‌ మార్నింగ్‌ తనకు ఇష్టం లేకపోయినా వేరే సంబంధం చేస్తున్నారని అంజలి ఏడుస్తూ చెప్తుంది. అంజలికి ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుండగా చంటి అక్కడికి వచ్చి గొడవ చేస్తాడు. అడ్డొచ్చిన పోలీసుల్ని చితకబాదుతాడు. ఆ నేరం కింద రెండేళ్ళు జైలు శిక్ష వేస్తారు. తర్వాత జైలుకి వచ్చిన అంజలి ఓ బాంబు పేలుస్తుంది. తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి జరుగుతోందని, లైట్‌ తీసుకోమని చెప్తుంది. అప్పటి నుంచి ఆడవాళ్ళంటేనే అసహ్యం పెంచుకుంటాడు చంటి. జైలు నుంచి విడుదలై వచ్చాక తండ్రి ఇంటికి రానివ్వడు. చంటి కొట్టిన దెబ్బలవల్ల ఓ కానిస్టేబుల్‌ కాళ్ళు పోగొట్టుకున్నాడని, అతని కుటుంబం రోడ్డున పడిందని చెప్తాడు. ఇకపై ఆ కుటుంబాన్ని తనే పోషించాలని డిసైడ్‌ అవుతాడు చంటి. అలా ఆ కానిస్టేబుల్‌ చెల్లెలు పరిచయం అవుతుంది. ఆమె పేరు అంజలి(మన్నారా చోప్రా). అన్నివిధాలుగా ఆ కుటుంబానికి అండగా వుంటాడు. ఈ క్రమంలో చంటికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ అంజలిని చంటి ప్రేమించాడా? ప్రేమిస్తే ఆమె వల్ల ఎలాంటి కష్టాలు చవిచూడాల్సి వచ్చింది? చివరికి ఈ కథ ఎలా ముగిసింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

కథగా చూస్తే ఇందులో కొత్తదనం అనేది ఇసుమంతైనా కనిపించదు. కథనంలో కూడా మనం చూడని విషయాలు ఏమీ వుండవు. రోగ్‌ అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌ కూడా ఏమీ వుందు. అందరూ నన్ను రోగ్‌ అంటారని హీరో చెప్పడమే తప్ప అతని ప్రవర్తనలో అలాంటి పోకడలు మనకు కనిపించవు. రోగ్‌కి ట్యాగ్‌లైన్‌గా పెట్టిన మరో చంటిగాడి ప్రేమకథ. దీనికీ జస్టిఫికేషన్‌ లేదు. సినిమాలో ప్రేమ కథ కంటే తన వల్ల నష్టపోయిన ఓ కుటుంబాన్ని ఆదుకునే మానవతా మూర్తి కథే ఎక్కువ కనిపిస్తుంది. కథ, కథనాల విషయం పక్కన పెట్టి కేవలం విజువల్‌గా గ్రాండ్‌గా వుంటే సరిపోతుందనుకున్నాడో ఏమో పూరి తన దృష్టంతా హీరోయిన్స్‌ని గ్లామర్‌గా చూపించడం, ఫైట్స్‌ డిఫరెంట్‌గా వుండేలా చూడడంపైనే ఎక్కువ పెట్టాడు. ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోదగ్గ ఒకే ఒక్క విషయం హీరో ఇషాన్‌. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా కూడా అతనికి మంచి మార్కులు వెయ్యొచ్చు. ఇప్పటివరకు జరిగిన ఫంక్షన్స్‌లో అతిథులు చెప్పినట్టు భవిష్యత్తులో ఇషాన్‌ పెద్ద హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అందర్నీ ఆట్టుకున్నాడు. హీరోయిన్లలో కాసేపే కనబడే ఏంజెలా ఆ కాసేపట్లోనే అందాలన్నీ ఆరబోసింది. ఇక మన్నారా చోప్రా చేసిన క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్‌ లేదు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా గ్లామర్‌ విషయంలో ఆడియన్స్‌కి న్యాయం చేసింది. సైకో క్యారెక్టర్లు ఇంతకుముందు చాలా చూసేసినా ఇందులో అనూప్‌ సింగ్‌ చేసిన సైకో క్యారెక్టర్‌ కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. పోకిరిలో బిచ్చగాళ్ళ కామెడీతో ఎంటర్‌టైనర్‌ చేసిన పూరి ఈ సినిమాలోనూ అదే తరహా కామెడీ ఆలీతో చేయించాలనుకున్నాడు. కానీ, అంతగా వర్కవుట్‌ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో చెప్పుకోదగ్గ వారెవరూ లేరు. 

సాంకేతికంగా చూస్తే ముఖేష్‌ ఫోటోగ్రఫీ వండర్‌ఫుల్‌ అని చెప్పాలి. ప్రతి షాట్‌ని, ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించడంలో ముఖేష్‌ సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా పాటల్ని చాలా బాగా తీశాడు. మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే సునీల్‌ కశ్యప్‌ చేసిన పాటల్లో రెండు పాటలు మాత్రమే ఆకట్టుకునేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ గురించి చెప్పాల్సి వస్తే విజువల్‌గా అంతకుముందు సినిమాల కంటే రోగ్‌ చాలా గ్రాండ్‌గా కనిపించింది. కథ, కథనం, డైలాగ్స్‌ విషయంలో సక్సెస్‌ అవ్వలేకపోయిన పూరి విజువల్‌గా గ్రాండియర్‌ని తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, మన్నారా చోప్రా గ్లామర్‌, ఇషాన్‌ పెర్‌ఫార్మెన్స్‌, మంచి విజువల్స్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, కొత్తదనం లేని కథ, కథనాలు, అర్థంలేని సీన్స్‌, బోరింగ్‌గా సాగే సెకండాఫ్‌, సాదా సీదా క్లైమాక్స్‌ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే ఆడియన్స్‌ ఆశించిన స్థాయిలో పూరి జగన్నాథ్‌ రోగ్‌ని తీర్చిదిద్దలేకపోయారు. 

ఫినిషింగ్‌ టచ్‌: విజువల్స్‌ ఫుల్లు.. విషయం నిల్లు 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ