Advertisementt

సినీజోష్‌ రివ్యూ: సుప్రీమ్‌

Thu 05th May 2016 03:41 PM
telugu movie supreme,supreme movie review,supreme movie review in cinejosh,supreme movie cinejosh review,saidharam tej new movie supreme  సినీజోష్‌ రివ్యూ: సుప్రీమ్‌
సినీజోష్‌ రివ్యూ: సుప్రీమ్‌
Advertisement

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 

సుప్రీమ్‌ 

తారాగణం: సాయిధరమ్‌ తేజ్‌, రాశి ఖన్నా, 

రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, కబీర్‌ సింగ్‌, రవికిషన్‌, 

వెన్నెల కిషోర్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను, సత్యం రాజేష్‌, 

పోసాని, రఘుబాబు తదితరులు 

సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌ 

సంగీతం: సాయికార్తీక్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

సమర్పణ: దిల్‌రాజు 

నిర్మాత: శిరీష్‌ 

రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి 

విడుదల తేదీ: 05.05.2016 

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి సూపర్‌హిట్స్‌తో హీరోగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్న హీరో సాయిధరమ్‌ తేజ్‌. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా పటాస్‌ వంటి కమర్షియల్‌ హిట్‌ ఇచ్చి ఫస్ట్‌ మూవీతోనే డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకున్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్‌ మూవీ సుప్రీమ్‌. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు వరస హిట్స్‌తో మంచి ఊపు మీదున్న సాయిధరమ్‌ తేజ్‌, ఫస్ట్‌ మూవీతోనే హిట్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ అనగానే ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ వుండడం సహజమే. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని సుప్రీమ్‌ ఎంతవరకు రీచ్‌ అయింది? సాయిధరమ్‌తేజ్‌కి సుప్రీమ్‌ హ్యాట్రిక్‌ హిట్‌ని అందించిందా? అనిల్‌ రావిపూడి ద్వితీయ విఘ్నం నుండి బయట పడగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సుప్రీమ్‌ అనే టైటిల్‌కి, కథకి ఎలాంటి సంబంధం లేకపోయినా టాక్సీ డ్రైవర్‌ అయిన మన హీరో బాలు(సాయిధరమ్‌తేజ్‌) తన కారు మీద ఆ పేరు వేసుకుంటాడు. ఎవరైనా హారన్‌ కొడితే ఇరిటేట్‌ అయి వారి భరతం పడతాడు. ఒకప్పుడు బాలు తండ్రి(రాజేంద్రప్రసాద్‌) కోటీశ్వరుడు. కాలం కలిసి రాక ఆస్తులు పోగొట్టుకుంటాడు. తాగుడుకి బానిసైన తండ్రిని కన్న కొడుకులా చూసుకుంటూ వుంటాడు బాలు. కథ విషయానికి వస్తే అతని పేరు నారాయణరావు(సాయికుమార్‌). జాగృతి చారిటబుల్‌ ట్రస్ట్‌ని నడుపుతుంటాడు. ఆ ట్రస్ట్‌ భవనం చుట్టూ ట్రస్ట్‌కి సంబంధించిన వేల ఎకరాలను సాగు చేసుకుంటూ 15 వేల మంది జీవిస్తుంటారు. బిజినెస్‌మేన్‌ విక్రమ్‌ సర్కార్‌(కబీర్‌సింగ్‌) కన్ను ట్రస్ట్‌పైన, చుట్టూ వున్న పొలాలపైన పడుతుంది. ఆ ప్రాపర్టీ అంతా అతనిదే అన్నట్టుగా డాక్యుమెంట్స్‌ సృష్టించి కోర్టుకు వెళతాడు. కోర్టు కూడా ఆ ప్రాపర్టీ అతనిదేనని తీర్పు ఇస్తుంది. ఆ స్థలాన్ని రాజవంశానికి చెందిన రాఘవరాజు అనే వ్యక్తి ట్రస్ట్‌కి దానం చేస్తాడు. అయితే దానికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ నారాయణరావు వద్ద లేకపోవడంతో తీర్పు అతనికి వ్యతిరేకంగా వస్తుంది. అయితే రాఘవరాజు వారసుల నుంచి ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ తెచ్చినట్టయితే జాగృతి ట్రస్ట్‌కే ఆ స్థలం చెందుతుందని కోర్టు నెల రోజులు టైమ్‌ ఇస్తుంది. జర్మనీకి చెందిన కంపెనీలతో వేల కోట్ల డీల్‌ కుదుర్చుకున్న విక్రమ్‌ సర్కార్‌ ఆ వారసుడెవరో కనుక్కొని చంపాలని ప్లాన్‌ చేస్తాడు. మరో పక్క వారసుడ్ని వెతుక్కుంటూ నారాయణరావు బయల్దేరతాడు. ఇంతకీ రాఘవరాజు వారసుడెవరు? విక్రమ్‌, నారాయణరావు ఆ వారసుడ్ని కనిపెట్టగలిగారా? దీనికి, మన హీరో బాలుకి వున్న సంబంధం ఏమిటి? రాఘవరాజు వారసుడు బాలుయేనా? చివరికి నారాయణరావు జాగృతి ట్రస్ట్‌ని దక్కించుకోగలిగాడా? అనేది మిగతా కథ. 

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ చిత్రాల్లో తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడని చెప్పాలి. డాన్సుల్లోగానీ, ఫైట్స్‌లోగానీ, కామెడీ సీన్స్‌లోగానీ, ఎమోషనల్‌ సీన్స్‌లోగానీ సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. హీరోయిన్‌ రాశి ఖన్నాది కేవలం గ్లామర్‌కే పరిమితమయ్యే క్యారెక్టర్‌. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో కొంత కామెడీ కూడా చేసే ప్రయత్నం చేసింది. హీరోతో తన్నులు తినకుండా వుండే డిగ్నిఫైడ్‌ విలన్‌గా కబీర్‌ సింగ్‌ చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. మిగతా క్యారెక్టర్స్‌లో రాజేంద్రప్రసాద్‌, రవికిషన్‌, రఘుబాబు, పోసాని, సత్యం రాజేష్‌, జయప్రకాష్‌రెడ్డి తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. జింగ్‌ జింగ్‌ అంటూ కొత్త తరహా కామెడీతో అందర్నీ నవ్వించారు పృథ్వి, ప్రభాస్‌ శ్రీను. ముఖ్యంగా రాజన్‌ అనే క్యారెక్టర్‌ బాలనటుడు మిఖైల్‌ గాంధీ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లో అందర్నీ ఆకట్టుకున్నాడు. పటాస్‌లో హీరోయిన్‌గా నటించిన శృతి సోధి కథ పరంగా హీరోయిన్‌గానే కనిపించి, ఓ పాటలో హీరోతో స్టెప్పులేసి ఓకే అనిపించింది. 

కథపరంగా చెప్పుకోవడానికి ఇందులో కొత్తదనం ఏమీ లేదు. హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, విలన్‌ ఎయిమ్‌గానీ, హీరో, హీరోయిన్‌ మధ్య పుట్టే ప్రేమగానీ అంతా రొటీన్‌గానే వుంటుంది. సినిమా మొదలైన పది నిముషాల్లోనే మిగతా కథ ఏమిటి అనేది తెలిసిపోయినా రెండు గంటలకుపైగా ఆడియన్స్‌ని సీట్లలో కూర్చో బెట్టేందుకు ఎన్ని మ్యాజిక్కులు చెయ్యాలో అన్ని మ్యాజిక్కులు చేశాడు డైరెక్టర్‌. పటాస్‌ తరహాలో కామెడీని డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో అసలు కథ ముందుకు వెళ్ళకపోయినా రఘుబాబు అండ్‌ ఫ్యామిలీ కామెడీ, పృథ్వి, ప్రభాస్‌ కామెడీతో ఫస్ట్‌ హాఫ్‌ అయ్యిందనిపించాడు. సెకండాఫ్‌లో కథ రన్‌ అవుతూ వుండగానే పోసాని, శ్రీనివాసరెడ్డి కామెడీ, రవికిషన్‌ అండ్‌ గ్యాంగ్‌ కామెడీతో ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవకుండా చేసేందుకు ట్రై చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో రవికిషన్‌ గ్యాంగ్‌తో వికలాంగులు చేసే ఫైట్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆహా అనిపించేంత భారీ క్లైమాక్స్‌ కాకపోయినా కథను సుఖాంతం చేసే క్లైమాక్స్‌తో సినిమాని ముగించారు. టెక్నికల్‌గా చూస్తే సాయిశ్రీరామ్‌ ఫోటోగ్రఫీ బాగుంది. సాయికార్తీక్‌ కూడా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపించాడు. అందం హిందోళం పాట విజువల్‌గా ఓకే అనిపించింది. మేకింగ్‌ పరంగా చూస్తే సినిమాని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ రిచ్‌గానే తీశారు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి చెప్పాలంటే అతను రాసుకున్న కథలో పటాస్‌లో వున్నంత స్ట్రాంగ్‌ పాయింట్‌ సుప్రీమ్‌ కథలో లేదు. పరమ రొటీన్‌ కథని రెండు గంటల ఇరవై నిముషాలపాటు లాగడానికి డైరెక్టర్‌ నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ ప్రయత్నంలో సినిమాకి కామెడీ బాగా హెల్ప్‌ అయిందని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా తేజు గత రెండు చిత్రాలతో పోలిస్తే ఇందులో బెటర్‌గానే అనిపించినా క్యారెక్టరైజేషన్‌ పరంగా ఈ సినిమాలో తేజు వీక్‌ అనే చెప్పాలి. ఫైనల్‌గా చెప్పాలంటే ముందే తెలిసిపోయే కథ కావడంతో ఆడియన్స్‌ కథలో లీనమయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి కథని, లాజిక్స్‌ని పక్కన పెట్టి కేవలం నవ్వుకోవడానికి ఈ సినిమా చూడొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: రొటీన్‌ కథకి కామెడీ టచప్‌! 

సిినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement