Advertisementt

సినీజోష్‌ రివ్యూ: పడేసావే

Sat 27th Feb 2016 05:00 PM
telugu movie padesave,padesave movie review,padesave movie cinejosh review,karthikraju and nitrya shetty in padesave  సినీజోష్‌ రివ్యూ: పడేసావే
సినీజోష్‌ రివ్యూ: పడేసావే
Advertisement
Ads by CJ

అయాన్‌ క్రియేషన్స్‌ 

పడేసావే 

తారాగణం: కార్తీక్‌రాజు, నిత్యశెట్టి, స్యామ్‌, 

విశ్వ, నరేష్‌, రాశి తదితరులు 

సినిమాటోగ్రఫీ: కన్నా కూనపరెడ్డి 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

ఎడిటింగ్‌: ధర్మేంద్ర కె. 

మాటలు: కిరణ్‌ 

నిర్మాణం: అయాన్‌ క్రియేషన్స్‌ 

రచన, దర్శకత్వం: చునియా 

విడుదల తేదీ: 26.02.2016 

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమకథలు వచ్చాయి. తీసిన సినిమాలనే బ్యాక్‌డ్రాప్‌లు మార్చి మన మీదకు వదిలినా మనం చూశాం. అలా వచ్చిన సినిమాల్లో కొన్ని సూపర్‌హిట్‌ అయ్యాయి, మరికొన్ని సూపర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. అలా ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చూసేశాం అనిపించేలా పడేసావే పేరుతో ఓ కొత్త సినిమా వచ్చింది. కార్తీక్‌రాజు, నిత్యశెట్టి, స్యామ్‌ ప్రధాన పాత్రల్లో చునియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనం ఆల్రెడీ చూసేసిన సినిమాని మళ్ళీ మనకు కొత్తగా ఎలా ప్రజెంట్‌ చేశారు? టిప్పుతో హీరోగా పరిచయమైన కార్తీక్‌రాజుకి రెండో సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? మొదటి ప్రయత్నంగా చునియా చేసిన ఈ సినిమా దర్శకురాలిగా ఆమెకు ఎలాంటి పేరు తెచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఇప్పుడొస్తున్న ప్రేమకథా చిత్రాల్లో హీరో ఏ పనీ పాటా లేకుండా గాలికి తిరుగుతూ వుంటాడు. తొలి చూపులోనే ఒక అమ్మాయిని చూసి ప్రేమించేస్తాడు. ఆమె కోసం తన జీవితాన్ని ధార పోసేస్తాడు. పడేసావే సినిమాలో పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. అయితే ఇందులో హీరో గాలికి తిరగడమే కాకుండా జంక్‌ ఆర్ట్‌ కూడా వేస్తుంటాడు. మన హీరో పేరు కార్తీక్‌(కార్తీక్‌రాజు), హీరో ఇంటి పక్క అమ్మాయి నిహారిక(నిత్యశెట్టి), ఈ ఇద్దరికీ ఫ్రెండ్‌ విశ్వ(విశ్వ). ఈ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్‌. కానీ, నిహారిక మాత్రం కార్తీక్‌ని ప్రేమిస్తుంటుంది. అయితే అది వన్‌సైడ్‌ లవ్‌ మాత్రమే. ఈ ముగ్గురి మధ్యలోకి నిహారిక క్లోజ్‌ ఫ్రెండ్‌ స్వాతి(స్యామ్‌) ఎంటర్‌ అవుతుంది. స్వాతిని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు కార్తీక్‌. స్వాతికి ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిపోతుంది. విశ్వ చేసిన పొరపాటు వల్ల కార్తీక్‌ కూడా తనని ప్రేమిస్తున్నాడన్న భ్రమలో వుంటుంది నిహారిక. స్వాతికి తన ప్రేమ విషయాన్ని తెలియజేస్తాడు కార్తీక్‌. కానీ, స్వాతి అతని ప్రేమను ఒప్పుకోదు. ఈలోగా కార్తీక్‌కి, నిహారికకి, పెళ్ళి చెయ్యాలని పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. కార్తీక్‌ పెద్దలు నిర్ణయించిన ప్రకారం నిహారికను పెళ్ళి చేసుకున్నాడా? లేక ప్రేమించిన స్వాతిని పెళ్ళి చేసుకున్నాడా? తను ప్రేమించిన కార్తీక్‌ని దక్కించుకోవడానికి నిహారిక ఏం చేసింది? చివరికి ఎవరికి ఎవరితో పెళ్ళి జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఇది ఒక సాదా సీదా కథ. కొత్తదనం మచ్చుకైనా లేని రొటీన్‌ కథ. ఈ కథ ప్రధానంగా ముగ్గురు చుట్టూ తిరుగుతూ వుంటుంది కాబట్టి ఇది ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ అనుకోవాలా? అంటే అదీ కాదు. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌ కూడా చెప్పుకోదగ్గట్టుగా ఏమీ వుండవు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ పెర్‌ఫార్మెన్స్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. కథలో కొత్తదనం లేనట్టుగానే టోటల్‌ సినిమాలో నటించిన ఏ ఒక్క ఆర్టిస్టు పెర్‌ఫార్మెన్స్‌ కూడా కొత్తగా అనిపించదు. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కన్నా కూనపరెడ్డి ఫోటోగ్రఫీ టీవీ సీరియల్‌కి ఎక్కువ సినిమాకి తక్కువ అన్నట్టుగానే వుంది తప్ప సినిమా చూస్తున్న భావన మనకు కలగదు. ఇప్పటివరకు అనూప్‌ చేసిన పాటల్లో ఏమాత్రం క్వాలిటీ లేని పాటలు ఇవే అని చెప్పొచ్చు. పాటల్ని విజువల్‌గా కూడా మనం ఎంజాయ్‌ చెయ్యలేకపోవడం ఈ సినిమాలోని పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. కిరణ్‌ రాసిన మాటలు చాలా రొటీన్‌గా, చాలా పేలవంగా అనిపిస్తాయి. డైరెక్టర్‌ చునియా గురించి చెప్పాల్సి వస్తే కథలోగానీ, కథనంలోగానీ, డైరెక్షన్‌లోగానీ ఎక్కడా కమాండింగ్‌ కనిపించదు. ఆర్టిస్టులు ఎవరి మానాన వాళ్ళు పెర్‌పార్మ్‌ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక లేడీ డైరెక్టర్‌ అయినప్పటికీ ఈ సినిమాలో మందు సీన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చారు. అలాగే గే కామెడీకి కూడా ప్రాధాన్యమిచ్చారు. యూత్‌ని టార్గెట్‌ చేస్తూ ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని తియ్యాలని చునియా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పాలి. ఆల్రెడీ చూసేసిన సినిమాని మరోసారి చూడబోతున్నామని సినిమా స్టార్ట్‌ అయిన కాసేపటికే ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. సినిమాకి ప్లస్‌ అని చెప్పదగ్గ అంశాలు ఏమీ లేవు. సినిమాలోని మైనస్‌ల గురించి మాట్లాడుకోవాలంటే బోలెడు మ్యాటర్‌ వుంది. సెకండాఫ్‌లో ఆలీ, కృష్ణుడు, విశ్వలతో ఒక పాట చేయడం, దానికి వెగటు పుట్టే కామెడీని కూడా జోడించడంతో ఆడియన్స్‌ పడినంత పనిచేశారు. త్వరగా క్లైమాక్స్‌ ఏదో చూపించేస్తే చూసి వెళ్ళిపోతాం అన్నట్టు సీటు చివర కూర్చొని క్లైమాక్స్‌ కోసం ఎదురుచూసే స్థాయి ఆడియన్స్‌ని తీసుకు రావడంలో డైరెక్టర్‌ చునియా చేసిన కృషి మెచ్చుకోదగినదే. ఫైనల్‌గా చెప్పాలంటే పడేసావే సినిమాలో లవ్‌స్టోరీ వున్నప్పటికీ అది యూత్‌కి నచ్చేంత అందంగా లేదు, ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా అంతకన్నా లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్రాణాలు తోడేసావే! 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ