Advertisementt

సినీజోష్‌ రివ్యూ: డిక్టేటర్‌

Thu 14th Jan 2016 06:21 PM
telugu movie dictator,dictator movie review,dictator movie cinejosh review,balakrishna new movie dictator,dictator movie director srivaas  సినీజోష్‌ రివ్యూ: డిక్టేటర్‌
సినీజోష్‌ రివ్యూ: డిక్టేటర్‌
Advertisement
Ads by CJ

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ 

వేదాశ్వ క్రియేషన్స్‌ 

డిక్టేటర్‌ 

తారాగణం: నందమూరి బాలకృష్ణ, అంజలి, 

సోనాల్‌ చౌహాన్‌, నాజర్‌, రతి అగ్నిహోత్రి, 

పోసాని, సుమన్‌, షాయాజీ షిండే, అక్ష తదితరులు 

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: చిన్నా 

రచన: శ్రీధర్‌ సీపాన 

మాటలు: ఎం.రత్నం, 

స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌ 

నిర్మాణం: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవాస్‌ 

విడుదల తేదీ: 14.01.2016 

ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ చేసిన 98 సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్స్‌ చేశాడు. అన్ని రకాల సినిమాలు చేశాడు. అయితే అన్నింటికంటే ఎక్కువగా అతనికి పేరు తెచ్చినవి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌. అయితే ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో అతని క్యారెక్టరైజేషన్‌ పవర్‌ఫుల్‌గా వుండేలా డైరెక్టర్స్‌ జాగ్రత్త పడుతున్నారు. బాలకృష్ణ కూడా అలాంటి కథలనే ఓకే చేస్తున్నాడు. అలా చేసిన సినిమాల్లో సింహా, లెజెండ్‌ వంటి సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు 99వ సినిమాగా శ్రీవాస్‌ డైరెక్షన్‌లో చేసిన డిక్టేటర్‌ కోసం ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ సంక్రాంతికి బాలయ్య డెఫినెట్‌గా హిట్‌ కొడతాడు అనే కాన్ఫిడెన్స్‌తో వున్నారు అభిమానులు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్‌ బేనర్‌పై స్వీయ దర్శకత్వంలో శ్రీవాస్‌ నిర్మించిన డిక్టేటర్‌ బాలకృష్ణకి ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? బాలయ్యని కొత్త డైమెన్షన్‌లో చూపించాలనుకున్న శ్రీవాస్‌ ఆవిషయంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్‌ ఎంత పవర్‌ఫుల్‌గా వుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

ఓపెన్‌ చేస్తే డ్రగ్‌ మాఫియా గ్యాంగ్‌తో సంబంధం వున్న మినిస్టర్‌ కొడుకుని ఓ హోటల్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అయితే ఆ ఆఫీసర్‌తో వచ్చిన పోలీస్‌ ఆఫీసర్స్‌ ఆ గ్యాంగ్‌తో చేతులు కలిపి అతన్ని చంపేస్తారు. ఈ హత్యను ఆ హోటల్‌లోని వెయిటర్‌ చూస్తాడు. అతన్ని చంపాలని ఆ గ్యాంగ్‌ అతని వెంటపడుతుంది. కట్‌ చేస్తే అది ధర్మా సూపర్‌ మార్కెట్‌. అందులో పనిచేసే మన హీరో చందు(నందమూరి బాలకృష్ణ). అతనికి కాత్యాయని(అంజలి)తో పెళ్ళవుతుంది. చందు అతని అత్తగారింట్లోనే వుంటాడు. కాత్యాయని మాత్రం అతనికి దూరంగా ఎక్కడో వుంటుంది. అప్పుడప్పుడు ఫోన్‌లో మాత్రమే మాట్లాడుతూ వుంటుంది. అయితే అతనితో మాట్లాడేది కాత్యాయని కాదు, ఆమె చెల్లెలు శృతి(అక్ష). ఈ విషయం చందుకి కూడా తెలుసు. ఎప్పుడూ ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్‌ చేతిలో పట్టుకొని సైలెంట్‌గా కనిపిస్తూ సూపర్‌ మార్కెట్‌లోనూ, తను వుండే కాలనీలోనూ మంచి పేరు తెచ్చుకుంటాడు చందు. అనుకోకుండా అతనికి ఇందు(సోనాల్‌ చౌహాన్‌) పరిచయమవుతుంది. డ్రగ్‌ గ్యాంగ్‌ వెతుకుతున్న వెయిటర్‌ చెల్లెలే ఇందు. తన అన్నయ్య ఎక్కడ వున్నాడో చెప్పమని ఆ గ్యాంగ్‌కి చెందినవారు ఇందుని కిడ్నాప్‌ చేసి ఓ పబ్‌లో బంధిస్తారు. విషయం తెలుసుకున్న చందు ఆ పబ్‌లో వున్న మినిస్టర్‌ కొడుకుతో సహా 20 మందిని చంపేస్తాడు. దీంతో తన కొడుకుని చంపిన వాడిని చంపాలని మినిస్టర్‌ చందు కోసం వెతుకుతుంటాడు. అదే టైమ్‌లో సూపర్‌ మార్కెట్‌లో 5 లక్షలు మిస్‌ అవుతాయి. ఆ నేరం తనపై వేసుకొని జైలుకి వెళ్తాడు చందు. ఆ విజువల్స్‌ని టి.వి.లో చూసిన ధర్మా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌ ధర్మా(సుమన్‌) హైదరాబాద్‌ వస్తాడు. చందు మామగారిని, అతని ఫ్యామిలీని కలుసుకున్న రాజశేఖర్‌ వారితోపాటు వుంటున్న చందు మామూలు వ్యక్తి కాదని, అతను పనిచేసే ధర్మా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి ఛైర్మన్‌ అని చెప్తాడు. కోట్ల ఆస్తి వున్నా ఓ సాధారణ వ్యక్తిగా చందు సూపర్‌ మార్కెట్‌లో ఎందుకు పనిచేస్తున్నాడు? అతని భార్య కాత్యాయనిలా ఆమె చెల్లెలు శృతి ఎందుకు ఫోన్‌లో మాట్లాడుతూ వుంటుంది? అసలు కాత్యాయని ఏమైంది? సైలెంట్‌గా వుండే చందు పబ్‌లో 20 మందిని ఎలా చంపగలిగాడు? చందు డిక్టేటర్‌గా ఎందుకు మారాడు? అనేది మిగతా కథ. 

సినిమా స్టార్టింగ్‌లో సైలెంట్‌గా వుండి ఆ తర్వాత తన విశ్వరూపాన్ని చూపించే క్యారెక్టర్లు గతంలో బాలకృష్ణ చాలా చేశాడు. కానీ, ఈ సినిమాలో చందుగా, డిక్టేటర్‌గా పూర్తి ఆపోజిట్‌ క్యారెక్టర్స్‌ చేశాడు. డాన్సుల పరంగా బాలకృష్ణలో స్పీడ్‌ పెరిగింది. బాలకృష్ణ వేసిన డిఫరెంట్‌ స్టెప్స్‌ అభిమానుల చేత విజిల్స్‌ వేయించాయి. కొత్త సౌండింగ్‌తో అతను చెప్పిన డైలాగ్స్‌ అందరితోనూ చప్పట్లు కొట్టించాయి. ఫైట్స్‌ కూడా యంగ్‌ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చేశాడు. సెకండాఫ్‌లో కనిపించే అంజలి ఓ పర్పస్‌ వున్న క్యారెక్టర్‌ చేసింది. పెర్‌ఫార్మెన్స్‌పరంగా, గ్లామర్‌ పరంగా అందర్నీ ఆకట్టుకుంది. ఫస్ట్‌ హాఫ్‌లో సోనాల్‌ చౌహాన్‌ తన గ్లామర్‌తో అలరించింది. లేడీ విలన్‌ మహిమా రాయ్‌గా రతి అగ్నిహోత్రి పెర్‌ఫార్మెన్స్‌ డిగ్నిఫైడ్‌గా వుంది. ఫస్ట్‌హాఫ్‌లో డ్రగ్‌ డీలర్‌గా విక్రమ్‌జీత్‌ విర్క్‌ టెర్రిఫిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. మహిమా రాయ్‌గా లేడీ విలన్‌ క్యారెక్టర్‌ రతి అగ్నిహోత్రి పెర్‌ఫార్మెన్స్‌ చాలా డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నాజర్‌, సుమన్‌, పృథ్వీ, హేమ, రఘుబాబు, అక్ష, వెన్నెల కిషోర్‌, పోసాని, షాయాజీ షిండే.. ఇలా లెక్కకు మించిన ఆర్టిస్టులు వున్నారు. వారి వారి క్యారెక్టర్ల తమ పెర్‌ఫార్మెన్స్‌తో ఓకే అనిపించారు. 

ఈ సినిమాకి టెక్నికల్‌గా మంచి సపోర్ట్‌ ఇచ్చినవారు సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె.నాయుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన చిన్నా, ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన రవివర్మ, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ రాసిన రత్నం, బాలకృష్ణ నుంచి పవర్‌ఫుల్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్న శ్రీవాస్‌. బాలకృష్ణను అందంగా చూపించడంలో శ్యామ్‌ సక్సెస్‌ అయ్యాడు. అలాగే పాటల్ని, సన్నివేశాల్ని రిచ్‌గా చూపించాడు. ఆడియో పరంగా థమన్‌ చేసిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ స్పెషలిస్ట్‌ అయిన చిన్నా ఈ సినిమాకి కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గ్రాండ్‌గా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాలో లెక్కకు మించిన ఫైట్స్‌ వున్నాయి. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో పబ్‌ ఫైట్‌ని చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేశాడు రవివర్మ. తన ప్రతి సినిమాలోనూ డైలాగ్స్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే బాలయ్య ఈ సినిమాలో చాలా కొత్త డైలాగులు చెప్పాడు. ఈ డైలాగ్స్‌ని రత్నం రాశాడు. శ్రీధర్‌ సీపాన రాసిన కథకి కోన వెంకట్‌, గోపీమోహన్‌ స్క్రీన్‌ప్లేని జోడించి శ్రీవాస్‌ చాలా గ్రాండియర్‌గా తీశాడు. బాలకృష్ణ నుంచి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో శ్రీవాస్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. 

సినిమా స్టార్టింగ్‌లో ఓ మర్డర్‌తో స్టార్ట్‌ అయిన కథలో ఓ హై ఓల్టేజ్‌ ఫైట్‌తో ఎంటర్‌ అవ్వకుండా చాలా సాదా సీదాగా ఒక పాట ద్వారా బాలకృష్ణ ఇంట్రడక్షన్‌ ఇచ్చారు. కాలనీలో హేమ, పృథ్వి ప్రెసిడెంట్‌ పదవి కోసం పోటీ పడడం, ప్రచారం చెయ్యడం, అదే అదనుగా ఓ ఐటమ్‌ సాంగ్‌ పెట్టడం, కాలనీ ఎలక్షన్స్‌, కౌంటింగ్‌..ఇలా రకరకాల సీన్స్‌తో బోర్‌ కొట్టించాడు శ్రీవాస్‌. ఎప్పుడైతే హీరో పబ్‌లో తన విశ్వరూపం చూపించాడో అక్కడ సినిమా గ్రాఫ్‌ ఒక్కసారిగా పైకి వెళ్తుంది. మంచి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఆ గ్రాఫ్‌ అలాగే మెయిన్‌టెయిన్‌ అవుతుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి చందు కాత్యాయని ఇంట్లోనే ఎందుకు వుంటున్నాడు? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి? డిక్టేటర్‌గా అతను ఎందుకు మారాడు అనే విషయాలు చెప్పడం కోసం మనల్ని ఫ్లాష్‌బ్యాక్‌కి తీసుకెళ్తాడు. అయితే అది చాలా పెద్ద ఫ్లాష్‌బ్యాక్‌ కావడంతో తిరిగి ప్రజెంట్‌లోకి వచ్చేసరికి అంతకుముందు ఏం జరిగింది అనే విషయాన్ని ఆడియన్స్‌ మర్చిపోతారు. ఫస్ట్‌హాఫ్‌లో పబ్‌ ఫైట్‌ని, బాలయ్య చెప్పిన కొత్త డైలాగ్స్‌ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి అవే ఫైట్స్‌, అవే డైలాగ్స్‌, అవే సీన్స్‌ రిపీటెడ్‌గా అనిపించడంతో అవన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌ వున్నంత గ్రిప్పింగ్‌గా, స్పీడ్‌గా సెకండ్‌ హాఫ్‌ లేదనిపిస్తుంది. అయితే మాస్‌ ఆడియన్స్‌కి నచ్చే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. ఎ క్లాస్‌ కంటే బి, సి సెంటర్స్‌లో ఈ చిత్రాన్ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు. కమర్షియల్‌గా కొన్ని ఏరియాల్లో వర్కవుట్‌ అవుతుంది.

ఫినిషింగ్‌ టచ్‌: ఈ డిక్టేటర్‌ పక్కా మాస్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ