Advertisementt

సినీజోష్‌ రివ్యూ: పులి

Sat 03rd Oct 2015 10:16 AM
vijay new movie puli,sridevi in puli,telugu movie puli review,vijay movie puli cinejosh review,sruthi haasan in puli,hansika in puli,puli music director devisri prasad  సినీజోష్‌ రివ్యూ: పులి
సినీజోష్‌ రివ్యూ: పులి
Advertisement

ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ 

పులి 

తారాగణం: విజయ్‌, శ్రీదేవి, సుదీప్‌, శృతిహాసన్‌, హన్సిక, 

ప్రభు, నందిత శ్వేత తదితరులు 

సినిమాటోగ్రఫీ: నటరాజన్‌ సుబ్రహ్మణ్యం 

ఎడిటింగ్‌: ఎ.శ్రీకరప్రసాద్‌ 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

సమర్పణ: ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ 

నిర్మాతలు: సిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌, సి.శోభ 

రచన, దర్శకత్వం: చింబుదేవన్‌ 

విడుదల తేదీ: 02.10.2015 

తమిళ్‌లో విజయ్‌ స్టార్‌ హీరో అయినప్పటికీ తెలుగులో అతనికి అంతగా మార్కెట్‌ లేదు. అయినప్పటికీ తుపాకి, జిల్లా చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా చింబుదేవన్‌ దర్శకత్వంలో సిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఫాంటసీ అడ్వంచర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందించిన పులి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్‌. ఎస్‌.వి.ఆర్‌. మీడియా పతాకంపై సి.శోభ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. శుక్రవారం తెలుగులో విడుదలైన ఈ చిత్రం విజయ్‌కి ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? ఫాంటసీ అడ్వంచర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఏమేరకు థ్రిల్‌ చేసింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: అది బేతాళులు పాలిస్తున్న 56 ఊళ్ళలో ఒకటైన భైరవకోన. ఓ పక్క కరవు, మరో పక్క బేతాళులు ఆ ఊరిని పట్టి పీడిస్తుంటారు. అదే సమయంలో ఆ ఊరి నాయకుడైన నరసింగ్‌(ప్రభు)కి నదిలో పక్షుల గూడులో ఒక పక్షి గుడ్డుతోపాటు కొట్టుకు వచ్చిన పిల్లవాడు దొరుకుతాడు. అతనితోపాటు వచ్చిన గుడ్డు పక్షి పిల్ల అవుతుంది. ఆ పిల్లవాడికి మనోహరుడు(విజయ్‌) అని పేరు పెట్టి పెంచుతాడు. అతనికి తోడు పక్షి వుంటుంది. అప్పుడప్పుడు బేతాళులు ఆ ఊరికి వచ్చి బలవంతంగా కప్పం వసూలు చేసుకొని వెళ్తుంటారు. ఇలా వుండగా ఆ ఊరిలోనే వుండే మందారమల్లి(శృతిహాసన్‌)తో ప్రేమలో పడతాడు మనోహరుడు. ఆమె ప్రేమను గెలుచుకునేందుకు తన మనుషులతోనే బేతాళుల వేషం వేయించి వారిని చితకబాది మందారమల్లి మెప్పు పొందుతాడు. ఆమె కూడా మనోహరుడిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఓరోజు అడవిలో మనోహరుడికి బేతాళులు తారసపడతారు. ఆ వేషంలో వున్నవారు తమ మనుషులే అని భ్రమపడతాడు మనోహరుడు. తమ వేషంలో ఆ ఊరి జనం తిరుగుతున్నారని తెలుసుకున్న బేతాళులు మనోహరుడు లేని సమయంలో ఊరిని ధ్వంసం చేసి మందారమల్లిని ఎత్తుకుపోతారు. అడ్డుపడిన విజయ్‌ తండ్రి నరసింగ్‌ని చంపేస్తారు. కొన ఊపిరితో వున్న నరసింగ్‌ మనోహరుడితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ, చెప్పకుండానే కన్ను మూస్తాడు. మందారమల్లిని భేతాళ కోటలో బంధించారని తెలుసుకొని తన మిత్రులతో కలిసి అక్కడికి బయల్దేరతాడు మనోహరుడు. అత్యంత శక్తివంతులైన భేతాళుల్ని మనోహరుడు ఎదుర్కోగలిగాడా? మనోహరుడి తండ్రి చనిపోయే ముందు అతనికి ఏం చెప్పాలనుకున్నాడు? అసలు మనోహరుడు ఎవరి కొడుకు? భేతాళ కోటలో వున్న మందారమల్లిని మనోహరుడు రక్షించుకోగలిగాడా? బేతాళకోటకు చేరుకోవడంలో అతనికి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? వాటిని ఎదుర్కొని మందారమల్లిని భైరవకోనకు ఎలా తీసుకురాగలిగాడు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: మనోహరుడుగా, పులివీరుడుగా రెండు పాత్రల్లో విజయ్‌ మెప్పించగలిగాడు. ఓ పక్క కామెడీ చేస్తూనే బేతాళుల్ని ఎదుర్కొనే మనోహరుడుగా తన పెర్‌ఫార్మెన్స్‌లో వేరియేషన్స్‌ చూపించాడు. అతని డాన్సుల్లో, ఫైట్స్‌లో చాలా స్పీడ్‌ కనిపించింది. మందారమల్లిగా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది శృతిహాసన్‌. భేతాళదేశానికి రాణి అయిన యవనరాణి పాత్రను శ్రీదేవి అద్భుతంగా పోషించింది. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యలేదని చెప్పాలి. విజయ్‌తో కత్తి ఫైట్‌ని కూడా ఎంతో హుషారుగా చేసింది. యవనరాణి కుమార్తె మందాకిని(హన్సిక)గా హన్సిక మంచి గ్లామరస్‌ రోల్‌ చేసింది. ఆమె వున్న సీన్స్‌ అన్నీ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తాయి. భేతాళ దేశపు దళపతి జలంధరుడుగా సుదీప్‌ చాలా సెటిల్డ్‌ క్యారెక్టర్‌ చేశాడు. అతను చేసిన ప్రతి సీన్‌ ఆకట్టుకునేలా వుంది. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి సంబంధించి ఆర్టిస్టుల కంటే ఎక్కువ కష్టపడింది టెక్నీషియన్సే. నటరాజన్‌ సుబ్రహ్మణ్యం ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. సినిమాలో లెక్కకు మించి వున్న అందమైన లొకేషన్లను అంతకంటే అందంగా చూపించాడు. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే అతను చేసిన పాటల్లో మూడు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. విజువల్‌గా కూడా బాగా తీశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఎక్స్‌లెంట్‌గా చేశాడు. సినిమా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ సిట్యుయేషన్‌కి, ఎమోషన్స్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ చేయడం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నాడు. చక్కని ఫోటోగ్రఫీకి మంచి మ్యూజిక్‌ తోడైంది. వీటన్నింటినీ మించి భారీ సెట్స్‌, అద్భుతమైన గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌ సినిమాకి గ్రాండియర్‌ లుక్‌ని తీసుకొచ్చాయి. డైరెక్టర్‌ చింబుదేవన్‌ గురించి చెప్పాలంటే ఇంత గ్రాండియర్‌ వున్న సినిమాకి బలమైన కథ, పదునైన మాటలు లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. సినిమా స్టార్ట్‌ అవ్వడమే నీరసంగా స్టార్ట్‌ అవుతుంది. ఆ తర్వాత అనవసరమైన కామెడీ సీన్స్‌ తెగ బోర్‌ కొట్టిస్తాయి. హీరో విజయ్‌తో కూడా కామెడీ చేయించాలని చూసిన చింబుదేవన్‌ సక్సెస్‌ అవ్వలేదు. ఫస్ట్‌ హాఫ్‌ మరో పది నిముషాల్లో ఎండ్‌ అవుతుందనగా సినిమాకి ఒక్కసారిగా స్పీడ్‌ పెరుగుతుంది. సెకండాఫ్‌ కూడా అక్కడక్కడా కొంత ల్యాగ్‌ వున్నా ఓవరాల్‌గా సెకండాఫ్‌ ఓకే అనిపిస్తుంది. డబ్బింగ్‌ విషయానికి వస్తే సెకండాఫ్‌లో లెక్కకు మించిన చోట్ల డబ్బింగ్‌ జర్క్స్‌ వినిపిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. 

విశ్లేషణ: ఇది చిన్న పిల్లలు ఆడుకునే వీడియో గేమ్‌ తరహా సినిమా. ప్రియురాల్ని ఎత్తుకెళ్ళిన భేతాళులను వెతుక్కుంటూ బయల్దేరడం, మధ్యలో లిల్లీపుట్స్‌ కనిపించడం, భేతాళ కోటకు దారి కనుక్కునేందుకు కొన్ని ట్రిక్కులు ప్లే చేయడం.. చిన్న పిల్లల్ని ఆకట్టుకునే ఇలాంటి అంశాలతో రూపొందిన సినిమా ఇది. కథ పరంగా ఇది బాహుబలిని గుర్తు తెస్తుంది. నీళ్ళల్లో కొట్టుకొచ్చిన పిల్లాడు పులివీరుడు అనే వీరుడి కొడుకు. బాహుబలిలో కొండపైకి ఎక్కి అవతల ఏముందో తెలుసుకోవాలని హీరో ప్రయత్నిస్తాడు. ఇందులో హీరోయిన్‌ని వెతుక్కుంటూ భేతాళ కోటకు వెళ్తాడు. తను పులివీరుడి కొడుకునని తెలుసుకుంటాడు. భేతాళ కోటలోని యవనరాణి క్యారెక్టర్‌ అనగనగా ఓ ధీరుడు చిత్రంలో లక్ష్మీ మంచు చేసిన ఐరెంద్రిని పోలి వుంటుంది. సినిమా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ వరకు చెప్పుకోవాలంటే ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా నాసిరకమైన సీన్స్‌, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కి తెగ బోర్‌ కొట్టిస్తుంది. హీరో భేతాళ కోటకు బయల్దేరిన తర్వాత సినిమా స్పీడ్‌ అందుకుంటుంది. సెకండాఫ్‌లో అక్కడక్కడా ల్యాగ్‌లు వున్నప్పటికీ ఓవరాల్‌గా ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుందని చెప్పొచ్చు. విజువల్‌ గ్రాండియర్‌, ఆకట్టుకొనే కొన్ని పాటలు, సినిమాని ముందుకు నడిపించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చెప్పుకోదగ్గ ప్లస్‌ పాయింట్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే విజువల్‌గా ఎంత బాగున్నా ఆడియన్స్‌కి అంతగా రుచించని సినిమా ఇది. సినిమా చూస్తున్నంత సేపు గ్రాండియర్‌గా కనిపించినా కంప్లీట్‌ అయిన తర్వాత సినిమాలో ఏమీ లేదనే విషయాన్ని గ్రహిస్తారు ఆడియన్స్‌. భారీ సెట్స్‌, ఫైట్స్‌, పాటలు, కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. అయితే మెజారిటీ ఆడియన్స్‌కి మాత్రం ఇది నచ్చే సినిమా కాదు. 

ఫినిషింగ్‌ టచ్‌: స్టొరీ వీక్.. విజువల్స్ టాప్ . 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement