Advertisement
Banner Ads

సినీజోష్‌ రివ్యూ: బస్తీ

Fri 03rd Jul 2015 10:28 PM
telugu movie basthi review,hero sreyan,heroine pragathi,director vasu manthena,cinejosh review basthi  సినీజోష్‌ రివ్యూ: బస్తీ
సినీజోష్‌ రివ్యూ: బస్తీ
Advertisement
Banner Ads

వజ్మాన్‌ ప్రొడక్షన్స్‌

బస్తీ

నటీనటులు: శ్రేయన్‌, ప్రగతి, కోట శ్రీనివాసరావు,

ముఖేష్‌ రుషి, అభిమన్యు సింగ్‌, స్నిగ్ధ, ఆలీ, సప్తగిరి, సత్య

తదితరులు

సినిమాటోగ్రఫీ: వి.కె.గుణశేఖర్‌

సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి

మాటలు: వడ్డాలపు ప్రభాకర్ 

ఎడిటింగ్‌: గౌతంరాజు

నిర్మాణం: వజ్మాన్‌ ప్రొడక్షన్స్‌ 

రచన, దర్శకత్వం: వాసు మంతెన

విడుదల తేదీ: 03.07.2015

హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తనయుడు శ్రేయన్‌ వజ్మాన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వాసు మంతెన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బస్తీ’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు విడుదలైన ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రేయన్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించగలిగాడా? తొలి ప్రయత్నంగా స్వీయ దర్శకత్వంలో వాసు మంతెన నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఓపెన్‌ చేస్తే అది ఓ పార్క్‌. ఉదయం అందరూ జాగింగ్‌, వాకింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో చెట్ల పొదల్లో పడివున్న ఓ అమ్మాయి శవం వాకింగ్‌ చేస్తున్న ఓ అమ్మాయి కంట పడుతుంది. కట్‌ చేస్తే పోలీసులు, ఎంక్వయిరీ. ఇదిలా వుంటే సిటీలోని ఓ బస్తీలో బిక్షపతి(కోట శ్రీనివాసరావు), అమ్మిరాజు(ముఖేష్‌ రుషి) అనే పెద్ద మనుషులు వుంటారు. వారిద్దరికీ పడదు. బిక్షపతి కొడుకు భవాని(అభిమన్యు సింగ్‌) ఏదో విధంగా అమ్మిరాజును కెలుకుతుంటాడు. అందులో భాగంగానే అమ్మిరాజు దగ్గర పనిచేసే వ్యక్తి కూతుర్ని రేప్‌ చేసి చంపేస్తాడు. ఇది తెలుసుకున్న అమ్మిరాజు ఒక పథకం ప్రకారం భిక్షపతి కూతురు స్రవంతి(ప్రగతి)ని కిడ్నాప్‌ చేసి స్టోర్‌ రూమ్‌లో రహస్యంగా వుంచుతాడు. కట్‌ చేస్తే అమ్మిరాజుకు తమ్ముడు వరసయ్యే విజయ్‌(శ్రేయన్‌) అమెరికా నుంచి దిగుతాడు. తమ ఇంట్లో ఓ అమ్మాయి వుందని గుర్తించిన విజయ్‌ ఆమెను ఇంట్లోకి తీసుకొస్తాడు. వారి మధ్య పరిచయం పెరుగుతుంది. అది స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతారు. ఇదే విషయాన్ని అన్నయ్య అమ్మిరాజుకు చెప్తాడు విజయ్‌. స్రవంతి తన దగ్గరే వుందని, భిక్షపతితో మీటింగ్‌ ఎరేంజ్‌ చేస్తే మాట్లాడతానని పోలీసులకు చెప్తాడు అమ్మిరాజు. భిక్షపతి, భవాని, అమ్మిరాజులకు మీటింగ్‌ ఎరేంజ్‌ చేస్తారు పోలీసులు. అక్కడ జరిగిన ఘర్షణలో భిక్షపతిని, అమ్మిరాజులను షూట్‌ చేసి చంపేస్తాడు భవాని. అప్పుడు విజయ్‌, స్రవంతి అక్కడి నుంచి పారిపోతారు. ఇక అప్పటి నుంచి భవాని మనుషులు వారిని పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటారు. పారిపోయిన ఆ ప్రేమ జంట ఎక్కడికి వెళ్ళింది? భవాని వారిని పట్టుకోగలిగాడా? విజయ్‌, స్రవంతిల పెళ్ళి జరిగిందా? ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రేయన్‌కి తనను తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం రాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎలాంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్‌ శ్రేయన్‌ది. కథ ప్రకారం వచ్చే సీన్స్‌ చేస్తూ వెళ్ళిపోవడం తప్ప తనకి వున్న ప్రత్యేకత ఏమిటో చూపించే ఛాన్స్‌ ఇవ్వలేదు డైరెక్టర్‌. సినిమాలో వున్నంత సేపు ఫర్వాలేదు అనిపించాడు తప్ప ఎక్కడా తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చెయ్యలేకపోయాడు. హీరోయిన్‌గా పరిచయమైన ప్రగతి కూడా సోసోగానే వుంది. అట్రాక్టివ్‌ ఫేస్‌ కాకపోవడం, ఆకట్టుకునే పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వలేకపోవడంతో సినిమాకి హీరోతోపాటు ఆమె కూడా మైనస్‌ అయింది. మిగతా క్యారెక్టర్లలో భిక్షపతిగా కోట శ్రీనివాసరావు, అమ్మిరాజుగా ముఖేష్‌ రుషి తమకు అలవాటైన స్టైల్‌లోనే రొటీన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. భవానిగా అభిమన్యు సింగ్‌ కాస్త కొత్తగా కనిపించాడు. అతని క్యారెక్టరైజేషన్‌ సీరియస్‌గా వున్నప్పటికీ దానికి అతను చేసిన పెర్‌ఫార్మెన్స్‌ అక్కడక్కడ నవ్వు తెప్పించింది. హీరో ఫ్రెండ్‌ పింకీగా నటించిన స్నిగ్ధ తన ఓవర్‌ యాక్షన్‌తో కాస్త ఓవర్‌గానే చేసింది. ఇక సెకండాఫ్‌లో వచ్చే సత్య, ఆలీ, సప్తగిరి చేసిన కామెడీ ఆడియన్స్‌కి పరమ బోర్‌ కొట్టించింది. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అయిన అంశం ఏదైనా వుందీ అంటే అది ఫోటోగ్రఫీ. గుణశేఖర్‌ అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు రిచ్‌గా కనిపించిందంటే దానికి కారణం గుణశేఖర్‌ ఫోటోగ్రఫీ. ప్రవీణ్‌ ఇమ్మడి చేసిన పాటల్లో ఓ రెండు పాటలు ఫర్వాలేదనిపించాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. సీనియర్‌ ఎడిటర్‌ గౌతంరాజు ఎడిటింగ్‌ మాత్రం ఆయన స్థాయిలో లేదు. కొత్తవారు ఎడిట్‌ చేసిన సీన్స్‌లా కనిపించాయి. డైరెక్టర్‌ వాసు మంతెన గురించి చెప్పాలంటే అతను తీసుకున్న పాయింట్‌ బాగానే వుంది. కానీ, దాన్ని నడిపించడంలో మాత్రం ఫెయిల్‌ అయ్యాడు. ప్రత్యర్థి కూతుర్ని కిడ్నాప్‌ చేసి తన ఇంట్లోనే పెట్టుకోవడం, ఆ అమ్మాయితో ఆ ఇంట్లోనే వుండే అబ్బాయి ప్రేమలో పడడం, పెళ్ళి చేసుకోవాలనుకోవడం వరకు బాగానే వుంది. కానీ, ఆ తర్వాత ఏం చెయ్యాలో, కథని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో తెలీక అనవసరమైన సీన్స్‌, చిరాకు తెప్పించే కామెడీ సీన్స్‌తో కాలయాపన చేసి చివరికి క్లైమాక్స్‌ని చాలా చప్పగా చూపించి చేతులెత్తేశాడు డైరెక్టర్‌. ఒక ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు, ఎలాంటి థ్రిల్స్‌ లేకుండా చాలా బోరింగ్‌గా తీశాడు డైరెక్టర్‌. ‘బస్తీ’ అనే టైటిల్‌ పెట్టి దానికి సరైన జస్టిఫికేషన్‌ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాకి ఆ టైటిల్‌ ఎందుకు పెట్టారనే డౌట్‌ సినిమా కంప్లీట్‌ అయిన తర్వాత ప్రతి ఒక్కరికీ వస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌:

ఫోటోగ్రఫీ

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌:

కథ

కథనం 

హీరో

హీరోయిన్‌

డైరెక్షన్‌

విశ్లేషణ: ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో స్టార్ట్‌ అయిన తర్వాత దానికి కంటిన్యూయేషన్‌గా హీరోయిన్‌ని కిడ్నాప్‌ చేసి తన ఇంట్లోనే పెట్టుకోవడం, హీరోయిన్‌, హీరో ప్రేమలో పడడం, పెళ్ళి చేసుకోవాలనుకోవడం వంటి సీన్స్‌ అన్నీ నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందన్న దానిపై క్యూరియాసిటీని కలిగించాయి. కొన్ని బోర్‌ కొట్టించే సీన్స్‌ వున్నా ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపించారు. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లోనే కోట శ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి వంటి కీలక పాత్రలు చనిపోవడంతో అక్కడి నుంచి సినిమా డ్రాప్‌ అయిపోయింది. ఎంత సేపూ హీరో, హీరోయిన్‌ తప్ప మనకి ఎవరూ కనిపించరు. దానికితోడు మధ్య మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తాయి. 1 గంట 56 నిముషాల తక్కువ నిడివి వున్న ఈ సినిమాలోని సెకండాఫ్‌ని క్లైమాక్స్‌కి తీసుకు రావడానికి డైరెక్టర్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. తీరా క్లైమాక్స్‌కి వచ్చాక హీరో నీరసంగా చెప్పే డైలాగ్స్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. అంతే నీరసంగా ఆడియన్స్‌ థియేటర్‌ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఫైనల్‌గా చెప్పాలంటే ఓ పట్టాన ఇది ఎవరికీ నచ్చే సినిమా కాదు. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 

ఫినిషింగ్‌ టచ్‌: బస్తీ చూడాలంటే కుస్తీ పట్టాల్సిందే!

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads