Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఆంధ్రా పోరి

Fri 05th Jun 2015 03:56 PM
telugu movie andhra pori,puri akash,andhra pori movie review,prasad productions  సినీజోష్‌ రివ్యూ: ఆంధ్రా పోరి
సినీజోష్‌ రివ్యూ: ఆంధ్రా పోరి
Advertisement
Ads by CJ

ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ 

ఆంధ్రా పోరి

నటీనటులు: ఆకాష్‌ పూరి, ఉల్కా గుప్తా, అరవింద్‌ కృష్ణ,

శ్రీముఖి, పూర్ణిమ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ వనమాలి

సంగీతం: డా॥ జోశ్యభట్ల

నిర్మాత: ఎ.రమేష్‌ప్రసాద్‌

రచన, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు

విడుదల తేదీ: 05.06.2015

‘చిరుత’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. లోటస్‌పాండ్‌, ధోని చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచిన ఆకాష్‌ ‘ఆంధ్రా పోరి’ చిత్రంతో హీరో అయిపోయాడు. మరాఠిలో సూపర్‌హిట్‌ అయిన ‘టైమ్‌ పాస్‌’ చిత్రం ఆధారంగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వంలో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ అధినేత ఎ.రమేష్‌ప్రసాద్‌ ‘ఆంధ్రా పోరి’ పేరుతో తెలుగులో నిర్మించారు. టీనేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంతో టీనేజ్‌లో వుండగానే హీరోగా పరిచయమయ్యాడు పూరి ఆకాష్‌. అతనికి జంటగా ఉల్కా గుప్తా నటించింది. మరాఠిలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్ర కథ తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్‌ అయింది? ఆకాష్‌ పూరికి ఈ సినిమా హీరోగా కరెక్ట్‌ లాంచింగ్‌ అనిపించుకుందా? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: మరాఠి నుంచి ఈ కథను తీసుకున్నప్పటికీ ఇది కొత్త కథేం కాదు. టీనేజ్‌లో యువతీయువకులు ప్రేమించుకోవడం, వీరి ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం అనేది అనాదిగా వస్తూనే వుంది. ఈ సినిమా విషయానికి వస్తే నర్సింగ్‌ యాదవ్‌(ఆకాష్‌ పూరి) చదువు గురించి పట్టించుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగే యూత్‌. భర్త చనిపోయిన తర్వాత తన ఆశలన్నీ కొడుకు నర్సింగ్‌పైనే ఆశలు పెట్టుకుంటుంది అతని తల్లి. తమ బస్తీకి దగ్గరలోని కాలనీలో  వుండే ప్రశాంతి(ఉల్కా గుప్తా)ని చూసి ఫస్ట్‌ సైట్‌లోనే లవ్‌లో పడిపోతాడు నర్సింగ్‌. ఆమెను లవ్‌ చెయ్యమని వెంటపడుతుంటాడు, పాటలు పాడుతుంటాడు. ఆ క్రమంలో ప్రశాంతి కూడా నర్సింగ్‌ని లవ్‌ చెయ్యడం మొదలుపెడుతుంది. వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం ప్రశాంతి తండ్రికి తెలిసిపోతుంది. ఎప్పటిలాగే హీరోని కలవకుండా కూతుర్ని కట్టడి చేస్తాడు ప్రశాంతి తండ్రి. మరి నర్సింగ్‌ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అందుకోసం ఏం చేశాడు? వీళ్లిద్దరి పెళ్ళికి వారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? అనేది తెరపై చూడాల్సిన కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: చాలా లేత వయసులో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయ్యాడు ఆకాష్‌ పూరి. పూర్తిగా తెలంగాణ యాస డైలాగ్స్‌ చెప్తూ చాలా ఎంజాయ్‌ చేస్తూ నర్సింగ్‌ క్యారెక్టర్‌ను చేశాడు ఆకాష్‌. ఒక సాధారణమైన కథలో మనం ఎన్నోసార్లు సినిమాల్లో చూసేసిన క్యారెక్టర్‌లో ఆకాష్‌ బాగానే చేశాడు. అతని డైలాగ్‌ డెలివిరీగానీ, డాన్స్‌గానీ చూస్తే భవిష్యత్తులో మంచి హీరోగా ఎదుగుతాడనిపించింది. ఇక హీరోయిన్‌ ఉల్కా గుప్తా గురించి చెప్పాలంటే టి.వి. సీరియల్స్‌లో నటిస్తూ ఆమధ్య రుద్రమదేవి చిత్రంలో ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌లో నటించిన ఉల్కా గుప్తా ‘ఆంధ్రా పోరి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆకాష్‌, ఉల్కా తమ తమ క్యారెక్టర్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేసిన అరవింద్‌ కృష్ణ ఫర్వాలేదనిపించాడు. అలాగే హీరోయిన్‌కి తల్లిగా ఒకప్పటి హీరోయిన్‌ పూర్ణిమ బాగా పెర్‌ఫార్మ్‌ చేసింది. 

టెక్నీషియన్స్‌: పాల్వంచలోని అందాల్ని తన కెమెరాలో బంధించి అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ వనమాలి సక్సెస్‌ అయ్యాడు. ప్రతి సీన్‌ని ఎక్స్‌లెంట్‌గా తీశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ డా॥ జోశ్యభట్ల చాలా మంచి మ్యూజిక్‌ చేశాడు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల చాలా సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యాయి. డైరెక్టర్‌ విషయానికి వస్తే రాజ్‌ మాదిరాజు ఈ మరాఠి కథను తెలుగులో పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్‌ చెయ్యలేకపోయాడు. కథకు తగ్గట్టు, వారి క్యారెక్టర్స్‌కి తగ్గట్టుగా నటీనటులు మంచి పెర్‌ఫార్మెన్స్‌నే ఇచ్చారు. మనం ఎన్నోసార్లు చూసేసిన కథని తెలుగులో మళ్ళీ రీమేక్‌ చెయ్యాలన్న సాహసం చేశారు దర్శకనిర్మాతలు. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. ప్రతి సీన్‌ రిచ్‌గానే కనిపిస్తుంది. క్వాలిటీ కోసం నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని అర్థమవుతుంది. 

ప్లస్‌ పాయింట్స్‌: 

హీరోహీరోయిన్ల పెర్‌ఫార్మెన్స్‌

మ్యూజిక్‌

సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌:

చాలా పాత కథ

సాగదీసిన కొన్ని సీన్స్‌

విశ్లేషణ: ఈ సినిమాకి ఎక్కువ పబ్లిసిటీ రావడానికి ముఖ్య కారణం ఆకాష్‌ పూరి. డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్స్‌తో హీరో క్యారెక్టర్‌ డిజైన్‌ చేసే పూరి జగన్నాథ్‌ తనయుడు హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఎలా వుండబోతోందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో వుంది. కథగా పాతదే అయినప్పటికీ దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చెయ్యలేకపోయాడు డైరెక్టర్‌. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సాగదీసినట్టు వుండడమే కాకుండా కొన్ని సీన్స్‌ని మధ్యలో ఇరికించినట్టు అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త బోరింగ్‌ సాగి, సెకండాఫ్‌లో ఆడియన్స్‌కి రిలీఫ్‌ కలిగింది. క్లైమాక్స్‌లోని ఎమోషనల్‌ సీన్స్‌ అందరికీ నచ్చుతాయి. ముఖ్యంగా ఈ సినిమాని యూత్‌ ఎక్కువగా లైక్‌ చేసే అవకాశం వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా అక్కడక్కడ కాస్త స్లో అయి బోర్‌ కొట్టినా ఒకసారి చూసి ఎంజాయ్‌ చెయ్యొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: పాత కథకి కొత్త అందాలు అద్దే ప్రయత్నం

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

- హరా జి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ