Advertisementt

సినీజోష్‌ రివ్యూ: లయన్‌

Thu 14th May 2015 02:23 PM
nandamuri balakrishna,telugu movie lion,lion movie review,trisha,radhika apte,manisharma  సినీజోష్‌ రివ్యూ: లయన్‌
సినీజోష్‌ రివ్యూ: లయన్‌
Advertisement
Ads by CJ

ఎస్‌.ఎల్‌.వి. సినిమా 

లయన్‌

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే,

ప్రకాష్‌రాజ్‌, చంద్రమోహన్‌, ప్రదీప్‌ రావత్‌, ఆలీ,

పోసాని, అర్చన తదితరులు

సినిమాటోగ్రఫీ: వెంకటప్రసాద్‌

సంగీతం: మణిశర్మ

ఎడిటింగ్‌: గౌతంరాజు

నిర్మాత: రుద్రపాటి రమణారావు

రచన, దర్శకత్వం: సత్యదేవ

విడుదల తేదీ: 14.05.2015

‘లెజెండ్‌’ సాధించిన ఘనవిజయంతో ఎంతో ఉత్సాహంగా వున్న నందమూరి ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని మరోసారి ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి ‘లయన్‌’గా వచ్చాడు నందమూరి బాలకృష్ణ. ‘లెజెండ్‌’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ఈరోజు ‘లయన్‌’ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయింది. ‘సింహా’గా, ‘లెజెండ్‌’గా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని తనదైన నటనతో అలరించిన నందమూరి బాలకృష్ణ ‘లయన్‌’గా ఎంతవరకు ఆకట్టుకోగలిగాడు? ఈ చిత్రం ఏ రేంజ్‌ విజయం సాధించింది? ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన సత్యదేవ నందమూరి అభిమానుల అంచనాలను అందుకోగలిగాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఓపెన్‌ చేస్తే అది ముంబాయిలోని రామ్‌ మనోహర్‌ హాస్పిటల్‌. 18 నెలలుగా కోమాలో వున్న ఓ వ్యక్తి చనిపోతాడు. అతన్ని మార్చురీకి తరలిస్తారు. ఉన్నట్టుండి ఆ శవం ప్రాణం పోసుకుంటుంది. అప్పటివరకు చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుంటాడు. అతనికి మళ్ళీ ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ అవుతుంది. అతని కోసం తల్లిదండ్రులు వచ్చినా వారిని గుర్తించడు. ‘నీ పేరు గాడ్సే.. మేం నీ తల్లిదండ్రులం’ అని చెప్పినా అతనికి గుర్తు రాదు. తన పేరు బోస్‌ అని చెప్తాడు. అయితే అక్కడ కనిపించేవి, తను పనిచేస్తున్నట్టుగా చెప్తున్న కంపెనీలోని ఎంప్లాయీస్‌ అతన్ని రిసీవ్‌ చేసుకునే విధానం, అతని ఐడి కార్డ్‌ అతన్ని గాడ్సేగా కన్‌ఫర్మ్‌ చేస్తాయి. అయినా నమ్మని అతను తను బోస్‌ అనే విషయం కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి హైదరాబాద్‌ వెళ్తాడు. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు, చెల్లెలు కూడా అతనెవరో తెలీదంటారు. ప్రేమించిన నందిని(త్రిష) కూడా అతన్ని గుర్తు పట్టదు. అసలు గాడ్సే ఎవరు? బోస్‌ ఎవరు? ఇద్దరూ ఒకటి కాదా? బోస్‌ని అతని తల్లిదండ్రులు ఎందుకు గుర్తు పట్టలేకపోయారు? గాడ్సేగా చెప్పబడుతున్న వ్యక్తి అతని తల్లిదండ్రుల్ని ఎందుకు పోల్చుకోలేకపోయాడు? ఈ కన్‌ఫ్యూజన్‌ వెనుక వున్న మిస్టరీ ఏమిటి? బోస్‌ గాడ్సేగా మారాడా? అలా మారడానికి కారణం ఏమిటి? అనే విషయాలే కాకుండా ఇక్కడ ప్రస్తావించని చాలా అంశాల గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే మెయిన్‌గా చెప్పుకోవాల్సింది నందమూరి బాలకృష్ణ గురించే. మొదట గాడ్సేగా, ఆ తర్వాత సి.బి.ఐ. ఆఫీసర్ బోస్‌గా రెండు షేడ్స్‌, రెండు విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్‌ కలిగిన పాత్రని నందమూరి బాలకృష్ణ చాలా అద్భుతంగా పోషించారు. బాలయ్య గత చిత్రాలతో పోల్చుకుంటే ఏమాత్రం  ఎనర్జీ లెవల్స్‌ తగ్గకుండా తన క్యారెక్టర్స్‌కి న్యాయం చేశాడు. అభిమానుల్ని మెప్పించేలా డైలాగ్స్‌ చెప్పడంలోగానీ, ఈ వయసులో కూడా యాక్షన్‌ సీన్స్‌లో చూపించిన ఫైర్‌ తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ తర్వాత ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్ర ఏదీ లేదనే చెప్పాలి. హీరోయిన్స్‌గా త్రిష, రాధికా ఆప్టే తమ క్యారెక్టర్స్‌కి లిమిట్‌లోనే బాగానే చేశారనిపించుకున్నారు. బాలకృష్ణ, త్రిషలపై చిత్రీకరించిన ఫోక్‌ సాంగ్‌, బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టేలపై చిత్రీకరించిన సెట్‌ సాంగ్స్‌లో వారి పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ అక్కడక్కడ నవ్వించడానికి విఫలయత్నం చేశారు. సెకండాఫ్‌లో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఎంటర్‌ అయి ఎండిరగ్‌ వరకు కొనసాగే ముఖ్యమంత్రి భరద్వాజ్‌ క్యారెక్టర్‌లో ప్రకాష్‌రాజ్‌ నటన చాలా రొటీన్‌గా ఇంతకుముందే చాలా సినిమాల్లో వున్నట్టే అనిపిస్తుంది. ఒకే ఒక్క సీన్‌లో కనిపించే పోసాని వున్న కాసేపు నవ్వించడానికి ప్రయత్నించాడు. ఇక కోట, శ్రీనివాసరావు, ప్రదీప్‌ రావత్‌, చంద్రమోహన్‌, జయసుధ, చలపతిరావు, గీత, అర్చన క్యారెక్టర్లు చాలా సాదా సీదాగా వున్నాయి. ఎవరికీ పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న క్యారెక్టర్స్‌ పడలేదు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌: టెక్నీషియన్స్‌లో మొదట చెప్పుకోవాల్సింది ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌, లక్ష్మణ్‌ల గురించి. సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ఎక్కువ కష్టపడిరది వాళిద్దరు, ఫైటర్స్‌ అనేది అందరికీ అర్థమవుతుంది. సినిమాలో వచ్చే ఫైట్స్‌ అన్నింటినీ దేనికదే డిఫరెంట్‌గా కంపోజ్‌ చేశారు. అంతేకాకుండా బాలకృష్ణతో కొన్ని రిస్కీ ఫైట్స్‌ కూడా చేయించారు. సెకండాఫ్‌లో ఫారెస్ట్‌లో తీసిన ఫైట్‌, క్లైమాక్స్‌లో ఛేజ్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీసి ఒక భారీ యాక్షన్‌ మూవీ లుక్‌ తెచ్చారు. సినిమాటోగ్రాఫర్‌ వెంకట ప్రసాద్‌ ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా లేకపోయినా సినిమాకి తగ్గట్టుగా బాగానే వుంది. కెమెరావర్క్‌లో ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయకుండా నార్మల్‌గానే చూపించే ప్రయత్నం చేశాడు. గౌతంరాజు ఎడిటింగ్‌ ఫర్వాలేదు అనిపించాడు. రెండు గంటల నలభై నిముషాల సినిమాని ఓ 20 నిముషాలు తగ్గించి వుంటే స్పీడ్‌ అయి వుండేది. మణిశర్మ సంగీతం గురించి చెప్పాలంటే గతంలో బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ వచ్చాయి. వాటితో ఈ ఆడియోను పోల్చలేం. ఎందుకంటే ఇందులోని పాటలు అంతగా ఆకట్టుకోలేదు. విజువల్‌గా ఓ రెండు పాటలు ఫర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయానకి వస్తే మణిశర్మ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడని చెప్పాలి. గతంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల రేంజ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ థియేటర్‌లో అదిరిపోయిందని చెప్పాలి. డైరెక్టర్‌ సత్యదేవ తను చెప్పాలనుకున్న పాయింట్‌ని పర్‌ఫెక్ట్‌గా ఆడియన్స్‌కి రీచ్‌ చెయ్యడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. ఫస్ట్‌ హాఫ్‌లో గాడ్సే, బోస్‌ క్యారెక్టర్ల మధ్య కన్‌ఫ్యూజన్‌ని మిగతా పాత్రలకంటే ఆడియన్స్‌ ఎక్కువ కన్‌ఫ్యూజ్‌ అవుతారు. కొన్నిచోట్ల ఏం జరుగుతుందో కూడా అర్థంకాని పరిస్థితుల్లో ఆడియన్స్‌ సినిమా చూస్తూ వుండిపోతారు. ఫస్ట్‌ హాఫ్‌లో గాడ్సేకి వున్న జబ్బు గురించి డాక్టర్‌ ఇచ్చే లెక్చర్‌, సెకండాఫ్‌లో బోస్‌ క్రియేట్‌ చేసుకున్న ఫైర్‌వాల్‌ గురించి టెక్నీషియన్స్‌ తీసుకున్న క్లాస్‌ ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తుంది. బి, సి సెంటర్లలోని ఆడియన్స్‌కి ఏం చెబుతున్నారనేది కూడా అర్థం కాదు. కథాపరంగా, కథనం పరంగా ఏమాత్రం కొత్తదనం లేని సినిమా ఇది. రకరకాల ట్విస్ట్‌లు వున్న ఇలాంటి సినిమాకి స్క్రీన్‌ప్లే అనేది చాలా ఇంపార్టెంట్‌. అది పర్‌ఫెక్ట్‌గా వుంటే సినిమా ఎక్కడో వుండేది. బాలకృష్ణ సినిమా అంటే అభిమానులు డైలాగ్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసి వస్తారు. అంతవరకు డైరెక్టర్‌ బాగానే రాసుకున్నాడు. అయితే అందులోని కొన్ని డైలాగ్స్‌ చాలా పేలవంగా వుండడమే కాకుండా ఆడియన్స్‌కి నవ్వు తెప్పించేవిగా వున్నాయి. సినిమా ఓపెనింగ్‌ సీన్‌లో రామ్‌ మనోహర్‌ హాస్పిటల్‌ని ఎక్స్‌టీరియర్‌లో చూపిస్తూ ఇంటీరియర్‌లో కిమ్స్‌ హాస్పిటల్‌ని చూపించారు. కిమ్స్‌ హాస్పిటల్‌ అనే పేర్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. 

ప్లస్‌ పాయింట్స్‌: 

బాలకృష్ణ పెర్‌ఫార్మెన్స్‌

రామ్‌లక్ష్మణ్‌ ఫైట్స్‌

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌:

ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం

కథ, కథనం

ప్రాధాన్యత కరువైన పాత్రలు

విశ్లేషణ: ఓపెనింగ్‌ సీన్‌, ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని కన్‌ఫ్యూజన్స్‌, కొంత ఫ్లాష్‌ బ్యాక్‌ నడుస్తుంది. ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్‌ బోర్‌ కొట్టిస్తూ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ వరకు వెళ్తుంది. సెకండాఫ్‌ సినిమా ఎక్కడికో వెళ్తుందని ఆశించిన ఆడియన్స్‌కి నిరాశే ఎదురవుతుంది. సినిమాని సాగదీయడానికి అన్నట్టు ఒకే సీన్‌ని చాలా సేపు సాగదీయడం, ఐదు నిముషాల ఫైట్‌ని 10 నిముషాలు చెయ్యడం, కథకి ఉపయోగంలేని ట్విస్ట్‌లతో సినిమాని ముందుకు నెట్టే ప్రయత్నం కనిపిస్తుంది. బాలకృష్ణ సినిమా అంటే అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేసేది పవర్‌ఫుల్‌ హీరోయిజం, బాలకృష్ణ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌. ఇందులో పవర్‌ఫుల్‌ హీరోయిజం కనిపించింది కొన్నిచోట్లే, అలాగే డైలాగ్స్‌ కూడా కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ ఆడియన్స్‌కి తెగ బోర్‌ కొట్టిస్తాయి. సహజత్వానికి దూరంగా వున్న కొన్ని సీన్స్‌ విసుగు పుట్టిస్తాయి. గాడ్సేకి తల్లిదండ్రులం అని చెప్పుకోవడానికి చంద్రమోహన్‌, జయసుధ చెప్పిన రీజన్‌ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఐదు పాటలు, ఆరు ఫైట్స్‌, కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌ అనే రెగ్యులర్‌ ఫార్ములాలోనే సినిమా తీసి వుంటే ఆడియన్స్‌కి బాగా ఎక్కేది. ఎక్కువ కన్‌ఫ్యూజన్‌, ఓవర్‌ ఫైట్స్‌, ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించి వున్న బాలయ్య క్యారెక్టరైజేషన్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవ్వలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే బాలకృష్ణ సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలగదు. అయితే సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కొన్ని డైలాగ్స్‌, ముఖ్యంగా బాలకృష్ణ పెర్‌ఫార్మెన్స్‌ బి, సి సెంటర్లలోని ఆడియన్స్‌కి నచ్చే అవకాశం వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేక్షకులు, అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ‘లయన్‌’ రీచ్‌ అవ్వలేకపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: గర్జించలేకపోయిన ‘లయన్‌’

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ