Advertisementt

సినీజోష్‌ రివ్యూ: గంగ

Sat 02nd May 2015 02:54 AM
telugu movie ganga,lawrence ganga review,tapsi,nitya menon,thaman ss,raghava lawrence  సినీజోష్‌ రివ్యూ: గంగ
సినీజోష్‌ రివ్యూ: గంగ
Advertisement
Ads by CJ

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌

గంగ

నటీనటులు: రాఘవ లారెన్స్‌, తాప్సీ, నిత్య మీనన్‌, కోవై సరళ,

సుహాసిని, శ్రీమాన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: రాజవేల్‌ ఒలివీరన్‌

సంగీతం: లియోన్‌ జేమ్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌, సి.సత్య,

అశ్వమిత్ర

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి

సమర్పణ: బెల్లంకొండ సురేష్‌

నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

విడుదల తేదీ: 01.05.2015

కొరియోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ అయిన రాఘవలారెన్స్‌ ‘ముని’తో ఓ కొత్త తరహా హార్రర్‌ మూవీని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ చిత్రం తర్వాత ‘కాంచన’గా వచ్చిన ‘ముని 2’ ఓ సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఎండిరగ్‌లోనే త్వరలో ‘ముని 3’ రాబోతోందని టైటిల్‌ వెయ్యడంతో అప్పటి నుంచే ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఒక క్యూరియాసిటీ ఏర్పడిరది. తెలుగులో ‘గంగ’గా, తమిళ్‌లో ‘కాంచన2’గా రూపొందిన ఈ చిత్రం మొదట తమిళ్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ఈరోజు విడుదలైన ‘గంగ’ ఏమేర ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసింది. ‘కాంచన’తో భయపెట్టి, నవ్వించిన లారెన్స్‌ ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్‌ చేశాడు? తమిళ ప్రేక్షకుల నీరాజనాలందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించిందా? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: ముని సీక్వెల్స్‌ని గమనిస్తే ప్రతి సినిమాలోనూ రాఘవ(రాఘవ లారెన్స్‌)కి దెయ్యాలంటే విపరీతమైన భయంతో వణికిపోతుంటాడు. ఏ చిన్న పని చెయ్యాలన్నా అమ్మని తోడు తీసుకెళ్తాడు. అయితే ఈ సినిమాలో కథకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ మార్చాడు. ఇందులో రాఘవ గ్రీన్‌ టివి ఛానెల్‌ కెమెరామెన్‌. అదే ఛానల్‌లో నందిని(తాప్సీ) డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తుంటుంది. అప్పటివరకు నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో వున్న గ్రీన్‌ టివి ప్రత్యర్థి ఛానల్‌ 24 టివి చేసిన ఓ దేవుడి ప్రోగ్రామ్‌వల్ల రెండో స్థానానికి పడిపోతుంది. మళ్ళీ నెంబర్‌ వన్‌ ప్లేస్‌కి రావాలంటే అలాంటి ఒక థ్రిల్లింగ్‌ ప్రోగ్రామ్‌ మనం కూడా చెయ్యాలంటుంది నందిని. అందుకని దెయ్యం కాన్సెప్ట్‌ని తీసుకొని సముద్రం ఒడ్డున వున్న ఓ పాడుబడిన భవనంలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. అలా షూటింగ్‌ చేస్తున్న సమయంలో బీచ్‌లో నందినికి ఒక మంగళ సూత్రం దొరుకుతుంది. దాన్ని పవిత్రంగా గుడిలోని హుండీలో వెయ్యాలని డిసైడ్‌ తన వెంట గెస్ట్‌హౌస్‌కి తీసుకొస్తుంది. ఆ మంగళసూత్రం తెచ్చినప్పటి నుంచి ఆమెకు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. వింత వింత ఆకారాలు ఆమెకు కనిపిస్తుంటాయి. ఆ క్రమంలో ఓరోజు ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. రాఘవను చూసి శివ అని పిలుస్తుంది, తన పేరు గంగ అని చెప్తుంది. అసలు గంగ, శివ ఎవరు? నందిని శరీరంలోకి గంగ ఎందుకు ప్రవేశించింది? రాఘవ, నందిని నుంచి గంగ ఏం ఆశించింది? గంగకు, శివకు జరిగిన అన్యాయం ఏమిటి? పగతో రగిలిపోతున్న గంగ, శివలకు దెయ్యాలంటే భయపడే రాఘవ ఎలా సహాయ పడ్డాడు? వారి పగను ఎలా చల్లార్చగలిగాడు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ముని సీక్వెల్స్‌లో భాగంగా మూడో సినిమాగా వచ్చిన ‘గంగ’లో కూడా రాఘవ లారెన్స్‌ తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ భయపెట్టడమే కాకుండా, ఎంటర్‌టైన్‌ కూడా చేశాడు. నందినిగా తాప్సీ హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ని ఇవ్వగలిగింది. లారెన్స్‌తో కలిసి చేసిన డ్యూయెట్‌లో తన అందచందాలతో అలరించడమే కాకుండా చక్కని స్టెప్స్‌తో, మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఇక ఆత్మ ఆవహించిన తర్వాత ఆమె ఇచ్చిన రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌, చెప్పిన డైలాగ్స్‌ ఆడియన్స్‌ని భయభ్రాంతుల్ని చేసాయి. సెకండాఫ్‌లో గంగగా ఓ కొత్త తరహా పాత్ర పోషించిన నిత్యమీనన్‌ ఆ పాత్రలో జీవించిందని చెప్పాలి. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువైనప్పటికీ ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర. ఓ కాలు సరిగాలేని వికలాంగురాలిగా ఆమె ప్రదర్శించిన నటన అందర్నీ కలచివేస్తుంది. చాలా సింపతీ వున్న ఆ క్యారెక్టర్‌ని అద్భుతంగా చేసి పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇక రాఘవ తల్లిగా కోవై సరళకి కొట్టిన పిండైన కామెడీని ఎప్పటిలాగే పండిరచింది. ఈ సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రల్లో భానుచందర్‌, సుహాసిని నటించారు. సినిమా స్టార్టింగ్‌లో ఒకే ఒక్క సీన్‌లో కనిపిస్తాడు భానుచందర్‌. సుహాసిని రెండు, మూడు సీన్స్‌లో కనిపించినా ఒక శాతం కూడా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. కాంచనలో ఎంతో ఇంపార్టెంట్‌ అయిన క్యారెక్టర్‌ చేసిన శ్రీమాన్‌ ఈ సినిమాలో అతను చేసిన క్యారెక్టర్‌కి కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: టెక్నికల్‌ సైడ్‌ రాజవేల్‌ అందించిన ఫోటోగ్రఫీ బాగుందని చెప్పాలి. ఇక నలుగురు సంగీత దర్శకులు కలిసి చేసిన పాటల్లో రెండు పాటలు మాత్రమే ఆకట్టుకునేవిగా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన థమన్‌ ఫస్ట్‌ హాఫ్‌లో ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి లౌడ్‌నెస్‌ పెరిగిపోయి ఆడియన్స్‌ చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా లెంగ్త్‌ విషయానికి వస్తే ఎడిటర్‌కి ఇంకాస్త పని కల్పిస్తే మరికాస్త లెంగ్త్‌ తగ్గి సినిమా స్పీడ్‌ పెరిగి వుండేది. డైరెక్టర్‌గా రాఘవ లారెన్స్‌ తాను అనుకున్న సబ్జెక్ట్‌ని డీల్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు. అయితే ఇది పూర్తిగా తమిళ సినిమాలాగే అనిపిస్తుంది. కాంచన విషయానికి వస్తే తమిళ సినిమా అయినప్పటికీ కొన్ని సీన్స్‌, కొన్ని సిట్యుయేషన్స్‌ తెలుగు సినిమాలాగే అనిపిస్తాయి. ఈవిషయంలో లారెన్స్‌ సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. 

విశ్లేషణ: సినిమా స్టార్ట్‌ అవ్వగానే ఓపెనింగ్‌ సీన్‌ సూపర్బ్‌ అనిపిస్తుంది. రాఘవ లారెన్స్‌ ఏదో కొత్త కాన్సెప్ట్‌లో సినిమా చూపించబోతున్నాడని ఆడియన్‌ అనుకునే లోపే పాత కాన్సెప్ట్‌కి వెళ్ళిపోతుంది కథ. ఇక అక్కడి నుంచి ఎప్పటిలాగే భయపడుతూ అమ్మ సాయం లేకుండా ఎక్కడికీ వెళ్ళలేని రాఘవ తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా సినిమా రన్‌ అవుతూ పాత బిల్డింగ్‌లో షూటింగ్‌ చెయ్యడానికి వెళ్లే వరకు నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందోనన్న క్యూరియాసిటీ వుంటుంది. ఎప్పుడైతే తమకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునేందుకు శివ, గంగ ఎదురుచూస్తున్నారని రివీల్‌ అయిందో అక్కడితో ఆడియన్స్‌ క్యూరియాసిటీ తగ్గిపోతుంది. నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది, నెక్స్‌ట్‌ సీన్‌లో మనం ఏం చూడబోతున్నామనే విషయంలో ఆడియన్స్‌కి కొంచెం క్లారిటీ వస్తుంది. దానికి తగ్గట్టుగానే సెకండాఫ్‌ స్టార్ట్‌ అయిన పది నిముషాలకు ల్యాగ్‌ కూడా స్టార్ట్‌ అవుతుంది. దాదాపు అరగంట సేపు రిపీటెడ్‌ సీన్స్‌తో ఆడియన్స్‌కి విసుగు పుడుతుంది. ఎప్పుడైతే ఫ్లాష్‌బ్యాక్‌ స్టార్ట్‌ అవుతుందో అప్పుడు సినిమా కాస్త స్పీడ్‌ అయినట్టు అనిపించినా అక్కడ కూడా ల్యాగ్‌ వుండడంతో కథ ముందుకి వెళ్ళదు. కాంచనలో వున్న సెంటిమెంట్‌గానీ, ఎమోషన్స్‌గానీ, ఫీల్‌గానీ ఈ సినిమాలో మనకు కనిపించవు. ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణమైన సినిమాగా అనిపిస్తుంది. మొత్తానికి సినిమాని క్లైమాక్స్‌కి తీసుకొచ్చి ఆడియన్స్‌ని నిరాశ పరచకుండా వాళ్ళు ఏం జరుగుతుందని ఊహిస్తారో అలాగే సినిమాని పూర్తి చేశాడు లారెన్స్‌. ఇది పూర్తిగా మాస్‌ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే సినిమా. బి, సి సెంటర్స్‌లో విపరీతంగా కలెక్షన్స్‌ రాబట్టే అవకాశాలు వున్న సినిమా. భయపెడుతూనే నవ్వించే విషయంలో లారెన్స్‌ ఇంటెలిజెంట్‌ కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా అందులో సక్సెస్‌ అయ్యాడు. ఈ సినిమాకి వెళ్ళినవారు భయపడాల్సినంత భయపడతారు, నవ్వాల్సినంత నవ్వుతారు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆడియన్స్‌ ఊహకు అతీతంగా లేని ‘గంగ’ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ