సమర్పణ: ఫుల్ మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ సతీష్‌రాజు వేగేశన
మారుతి టాకీస్
కాయ్ రాజా కాయ్
నటీనటులు: రామ్‌ఖన్నా, మానస్, జోష్ రవి,
శ్రావ్య, షామిలి, హరికృష్ణ, డి.ఎం.కె. తదితరులు
సినిమాటోగ్రఫీ: దేవ్
సంగీతం: జె.బి.
ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్
నిర్మాతలు: మాధవి చలసాని, సతీష్‌రాజు వేగేశన
రచన, దర్శకత్వం: శివగణేష్
విడుదల తేదీ: 23.04.2015
ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే కుర్రాళ్ళు ఆ ప్రాసెస్‌లో ఎదుర్కొనే సమస్యలు, వాటి నుంచి పుట్టే కామెడీ, మధ్య మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, లవ్ సీన్స్...ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్‌హిట్ అయితే కొన్ని అడ్రస్ లేకుండా పోయాయి. అలాంటి పాత కథాంశంతో కొత్తగా తియ్యాలని చేసిన ప్రయత్నమే ‘కాయ్ రాజా కాయ్’. రామ్‌ఖన్నా, మానస్, జోష్‌రవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ద్వారా శివగణేష్ దర్శకుడుగా పరిచయమయ్యాడు. మారుతి టాకీస్ బేనర్‌తో ఫుల్ మూన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ఈ పాత కథ ప్రేక్షకులకు కొత్తగా అనిపించిందా? డైరెక్టర్ ఈ సినిమాలో కొత్తగా చూపించిందేమిటి? ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఓపెన్ చేస్తే అది హైదరాబాద్ టు ముంబాయి హైవే. అర్థరాత్రి. బంగారు బిస్కెట్స్‌తో, తన అనుచరులతో కారులో వస్తున్న ఓ సేఠ్‌ని నలుగురు రౌడీలు అడ్డగించి అందర్నీ చంపేసి బంగారు బిస్కెట్ల పెట్టెను తమ కారులోకి షిఫ్ట్ చేసుకుంటారు. నలుగురు రౌడీలలో లీడర్‌గా వున్న వ్యక్తి ఇద్దర్ని చంపేస్తాడు. బంగారంతో సహా ఇద్దరూ మాయమవుతారు. కట్ చేస్తే హైదరాబాద్‌లో ఖన్నా(రామ్ ఖన్నా), ఆనంద్(మానస్) ఇద్దరూ ఫ్రెండ్స్. ఖన్నా బైక్ మెకానిక్, ఆనంద్ నిరుద్యోగి. వీరికి చిట్టిబాబు(జోష్ రవి) వచ్చి చేరతాడు. ఊళ్ళో గాలికి తిరుగుతూ అందరితో తన్నులు తినే చిట్టిబాబుది ఏదో ఒకటి చేసి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోవాలనుకునే క్యారెక్టర్. ఖన్నా, ఆనంద్ ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ద్వారా కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు. అప్‌సెట్ అయిన ఇద్దరు స్నేహితులు, ఏదోలా డబ్బు సంపాదించాలనుకునే చిట్టిబాబు కలిసి ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఓపెనింగ్ సీన్‌లో చూపించిన బంగారు బిస్కెట్లు ఎక్కడికి చేరాయి? అసలు ఆ ముగ్గురు స్నేహితులు కిడ్నాప్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది. చివరికి ఏమైంది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పాల్సి వస్తే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. రామ్‌ఖన్నా, మానస్, జోష్ రవి తమతమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. డైరెక్టర్ కోరుకున్న పెర్‌ఫార్మెన్స్‌ని ఇచ్చారని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక బిటెక్ అమ్మాయిని ప్రేమించే లవర్‌గా మంచి నటనను ప్రదర్శించాడు రామ్‌ఖన్నా. ఒక నిరుద్యోగిగా మానస్ చేసిన క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మానస్ పెర్‌ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఇంతకుముందు సినిమాల కంటే మెచ్యూర్డ్‌గా చేసాడని చెప్పాలి. డైలాగ్స్ కూడా వెరైటీగా చెప్పే ప్రయత్నం చేశాడు. డ్యూయెట్ సాంగ్‌లో మానస్ వేసిన నైస్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక అల్లరి చేసే చిట్టిబాబు క్యారెక్టర్‌లో జోష్ రవి మొదట్లో కాస్త అతిగా అనిపించినా పోను పోను అతని క్యారెక్టర్ కూడా బాగుందనిపిస్తుంది. తన కామెడీతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. డి.యం.కె. కనిపించేది కొన్ని సీన్స్‌లోనే అయినా కనిపించిన ప్రతిసారీ నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్‌గా నటించిన హరికృష్ణ పెర్‌ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చాలా సీన్స్‌లో క్రూయల్‌గా కనిపిస్తూ ఆడియన్స్‌కి తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. టెక్నికల్‌గా చెప్పాలంటే జె.బి. మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే విజువల్‌గా కూడా బాగా ప్రజెంట్ చేశారు. సినిమాకి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా చేశాడు జె.బి.
మైనస్ పాయింట్స్: సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ కథ. పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘మనీ’ తరహాలో వుంటూ కిడ్నాప్‌తోపాటు కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్‌ని కూడా జోడిరచి కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కథ పాతదే అయినా కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో సినిమా మీద స్టార్టింగ్ నుంచే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ అనిపించదు. రొటీన్ డైలాగ్స్, రొటీన్ సీన్స్‌తో నెక్స్‌ట్ ఏం జరగబోతోంది అనేది కూడా మనకి ముందే తెలిసిపోతూ వుంటుంది. ఎంతో ఇంట్రెస్టింగ్ చూపించాల్సిన ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సాదా సీదాగా సెకండాఫ్‌లో మనం ఏం చూడబోతున్నామో అర్థమయ్యేలా వుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో విలన్‌ని ఎంతో క్రూయల్‌గా చూపించి సెకండాఫ్‌కి వచ్చేసరికి అతని సీన్స్ కామెడీ అనిపించేలా చేశారు. తనకు కావాల్సింది బంగారు బిస్కెట్లు కాదనీ, రైస్ పుల్లర్ అని చెప్పడం, ఇరీడియమ్ అనే పదార్థం గురించి, ఇంటర్నేషనల్ దానికి వున్న మార్కెట్ గురించి విలన్ తన అనుచరులకి లెక్చర్ ఇవ్వడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. సినిమా నిడివి పెంచడం కోసం సెకండాఫ్‌లో చాలా అనవసరమైన సీన్స్ చేయడంతో ఆడియన్స్‌కి సినిమా మీద ఇంట్రెస్ట్ పోవడమే కాకుండా, నెక్స్‌ట్ ఏం జరగబోతోంది అనే దానిపై కూడా క్యూరియాసిటీ లేకుండా చేసింది. సెకండాఫ్‌లో కొన్ని ఛేజ్‌లు, కొన్ని ట్విస్ట్‌ల తర్వాత యధాతథంగా పాత ఫార్ములాలోనే సినిమా ముగించడంతో ఆడియన్స్ డీలా పడి థియేటర్ బయటికి వస్తారు.
విశ్లేషణ: సినిమా ఓపెనింగ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో స్టార్ట్ చేసి, ఆ సీన్‌ని కథలోని ముగ్గురు స్నేహితులకు లింక్ చెయ్యడం ద్వారా ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి మళ్ళీ రొటీన్ సీన్స్, రొటీన్ డైలాగ్స్ ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తుంది. హీరోయిన్లుగా నటించిన శ్రావ్య, షామిలీ గ్లామర్ సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. సినిమాలో జోష్ రవి మాత్రమే కామెడీ చెయ్యడానికి ట్రై చేశాడు. కొన్ని చోట్ల అనవసరమైన అరుపులు, మరికొన్ని చోట్ల ఓకే అనిపించే కామెడీతో జోష్ రవి చేసిన సీన్స్ కొంతలో కొంత చెప్పుకోదగినవి. స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు ఏ సీన్‌ని తీసుకున్నా అది అంతకుముందే చాలా సినిమాలలో చూసినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ పాతది కావడం, దానికి తగ్గట్టుగానే టేకింగ్ కూడా వుండడం వల్ల ఇది కొత్త సినిమా అనే ఫీలింగ్ మనకి ఎక్కడా కలగదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ‘కాయ్ రాజా కాయ్’ ఏ సెంటర్ ఆడియన్స్‌నీ అంతగా ఆకట్టుకునే సినిమా కాదు.
ఫినిషింగ్ టచ్: నైయ్ రాజా నైయ్
సినీజోష్ రేటింగ్: 2/5