Advertisementt

సినీజోష్‌ రివ్యూ: సూర్య వర్సెస్‌ సూర్య

Thu 05th Mar 2015 06:08 AM
surya vs surya,surya vs surya review,hero nikhil,karthik ghattamaneni,malkapuram sivakumar  సినీజోష్‌ రివ్యూ: సూర్య వర్సెస్‌ సూర్య
సినీజోష్‌ రివ్యూ: సూర్య వర్సెస్‌ సూర్య
Advertisement
Ads by CJ

సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌

సూర్య వర్సెస్‌ సూర్య

నటీనటులు: నిఖిల్‌, త్రిదా చౌదరి, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, 

సత్య, మస్త్‌ అలీ, వైవా హర్ష, తాగుబోతు రమేష్‌ తదితరులు

కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని

సంగీతం: సత్య మహావీర్‌

మాటలు: చందు మొండేటి

ఎడిటింగ్‌: గౌతమ్‌ నెరుసు

సమర్పణ: బేబి త్రిష

నిర్మాత: మల్కాపురం శివకుమార్‌

రచన, దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని

విడుదల తేదీ: 05.03.2015

‘హ్యాపీడేస్‌’, ‘యువత’ వంటి హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో నిఖిల్‌ ఆ తర్వాత చేసిన కొన్ని ఫ్లాప్‌ సినిమాలతో రియలైజ్‌ అయి తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. ఆ విధంగా వచ్చిన సినిమాలే ‘స్వామిరారా’, ‘కార్తికేయ’. ఈ రెండు సినిమాలు సూపర్‌హిట్‌ అవడంతో మరో కొత్త కాన్సెప్ట్‌తో కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ‘సూర్య వర్సెస్‌ సూర్య’తో హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా నిఖిల్‌కి హ్యాట్రిక్‌ అందించిందా? తెలుగులో ఇప్పటివరకు రాని ఒక కొత్త కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా ఏమేరకు ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యిందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: అతని పేరు సూర్య(నిఖిల్‌). అతను సూర్యుడ్ని చూడలేని ఓ వింత వ్యాధితో బాధపడుతుంటాడు. చీకటి పడ్డ తర్వాతే అతను బయటి ప్రపంచంలోకి రాగలడు. డిగ్రీ చదివేందుకు నైట్‌ కాలేజ్‌లో జాయిన్‌ అయి ప్రతిరోజూ ఆటోలో కాలేజ్‌కి వెళ్తుంటాడు. రోజూలాగే ఆటోలో కాలేజ్‌కి బయలుదేరిన సూర్య ఈ జర్నీలో నిద్రపోతాడు. ఆటో డైరెక్ట్‌గా ఓ ఐలెండ్‌కి చేరుతుంది. పాతబస్తీకి చెందిన జుబేర్‌(మస్త్‌ అలీ) తన మనుషులతో రెడీగా వుంటాడు. సూర్య తన పంచ్‌ పవర్‌ చూపించి ఆ రౌడీలు పారిపోయేలా చేస్తాడు. సూర్య, జుబేర్‌ తిరిగి సిటీకి వెళ్ళేందుకు బోట్‌ కూడా వుండదు. బోట్‌లో వచ్చిన ఆటోతోపాటు వాళ్ళిద్దరూ మిగిలిపోతారు. అప్పుడు జుబేర్‌కు తన లవ్‌స్టోరీ చెప్పడం మొదలెడతాడు సూర్య. ఒక టి.వి. ఛానల్‌లో పనిచేసే సంజన(త్రిదా చౌదరి)తో ప్రేమలో పడతాడు. రాత్రికి మాత్రమే పరిమితమైన సూర్య ప్రేమలో ఎలా పడ్డాడు? జుబేర్‌ అతన్ని ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? సూర్య తనకి వున్న డిసీజ్‌ గురించి సంజనతో చెప్పాడా? సూర్య, జుబేర్‌ ఆ ఐలెండ్‌ నుంచి ఎలా బయటపడ్డారు? సూర్య, సంజనల ప్రేమ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఇద్దరూ ఒకటయ్యారా? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే. 

ప్లస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోదగింది కాన్సెప్ట్‌. ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొని ప్రేక్షకులకు ఓ విభిన్నమైన సినిమాని అందించాలన్న ప్రయత్నం అభినందనీయం. ఈ కాన్సెప్ట్‌ని తెరకెక్కించడంలో డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని కొంత వరకు సక్సెస్‌ అయ్యాడు. కథని హ్యాండిల్‌ చెయ్యడంలో కొంత కన్‌ఫ్యూజ్‌ అయినా అద్భుతమైన ఫోటోగ్రఫీతో ఆద్యంతం అందంగా చూపించాడు. నైట్‌ ఎఫెక్ట్‌లో ప్రతి షాట్‌ని కళ్ళకి ఇంపుగా చూపించడం అంత ఈజీ కాదు. అలాంటిది సినిమా ఎక్కువ శాతం నైట్‌ ఎఫెక్ట్‌తోనే వుండడం, దాన్ని కలర్‌ఫుల్‌గా చూపించడంలో కార్తీక్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫోటోగ్రఫీ తర్వాత చెప్పుకోవాల్సింది మ్యూజిక్‌ గురించి. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన సత్య మహావీర్‌ తొలి చిత్రంతోనే విషయం వున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. కథకు ఇబ్బంది కలగకుండా మంచి మెలోడియస్‌ పాటల్ని చేశాడు. దాన్ని మించి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని ఎక్స్‌లెంట్‌గా చేసి హండ్రెడ్‌ పర్సెంట్‌ మార్కులు కొట్టేసాడు. ఆర్టిస్టుల విషయానికి వస్తే సూర్య క్యారెక్టర్‌లో నిఖిల్‌ ఒదిగిపోయాడని చెప్పాలి. ప్రతి ఎమోషన్‌ని పర్‌ఫెక్ట్‌గా చూపించగలిగాడు. హీరోయిన్‌ త్రిదా చౌదరి సంజన క్యారెక్టర్‌ను బాగా చేసింది. నిఖిల్‌కి తల్లిగా నటించిన మధుబాల కూడా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించింది. నిఖిల్‌కి ఫ్రెండ్స్‌గా నటించిన తనికెళ్ళ భరణి, సత్య తమకి వున్న పరిధిలో మంచి కామెడీ చేశారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి రాసిన డైలాగ్స్‌ బాగా పేలాయి. ముఖ్యంగా కామెడీ డైలాగ్స్‌ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ టైమ్‌ మెగా ఫోన్‌ పట్టుకున్న కార్తీక్‌ ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఓకే అనిపించుకోవడమే కాకుండా మంచి సినిమాటోగ్రాఫర్‌గా కూడా పేరు తెచ్చుకుంటాడు. 

మైనస్‌ పాయింట్స్‌: స్లో నేరేషన్‌తో సినిమా స్టార్ట్‌ అయి చాలా స్లోగా కథలోకి వెళ్తుంది. కొన్ని కామెడీ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా వెళ్తూ ఆడియన్స్‌ సినిమాలో సెటిల్‌ అవుతున్న టైమ్‌లో ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఓకే అనుకొని సెకండాఫ్‌ కోసం థియేటర్‌లోకి వెళ్ళిన ఆడియన్స్‌కి బోర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఎక్కడ ఆపిన కథ అక్కడే వుంటుంది తప్ప ముందుకి కదలదు. సినిమాని రన్‌ చేయడానికి కొన్ని అనవసరమైన సీన్స్‌, అర్థంలేని కామెడీతో సాగతీత మొదలవుతుంది. ఐలెండ్‌లో చిక్కుకున్న సూర్య, జుబేర్‌ సిటీకి వచ్చేందుకు ఆటోకి వాటర్‌ బాటిల్స్‌ కట్టి బోట్‌లా చేసే ప్రయత్నం, సంజన తండ్రి(షాయాజీ షిండే)కి తనకి వున్న డిసీజ్‌ గురించి చెప్పమని తనికెళ్ళ భరణి, సత్యని సూర్య పంపించే సీన్‌, తర్వాత తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తండ్రీ కూతుళ్ళతో మాట్లాడే సీన్‌, నైట్‌ కాలేజీలో కల్చరల్‌ ప్రోగ్రామ్‌..ఇలా చాలా సీన్స్‌ అసలు కథని పక్కన పెట్టేస్తాయి. ఇక క్లైమాక్స్‌ అయినా ఇంట్రెస్టింగ్‌గా వుందా అంటే అది కూడా కామెడీగా చూపించడానికి ట్రై చేశారు. పేలవమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. 

విశ్లేషణ: ఫస్ట్‌ హాఫ్‌లో కొంత స్లో నేరేషన్‌ వున్నప్పటికీ మధ్య మధ్య వచ్చే కామెడీ సీన్స్‌, కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తాయి. కథ ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న క్యూరియాసిటీతో వున్న ఆడియన్స్‌కి సెకండాఫ్‌ బోర్‌ కొట్టిస్తుంది. కార్తీక్‌ తన ఫోటోగ్రఫీతో విజువల్‌ బ్యూటీగా సినిమాని తీర్చిదిద్దడంతో ఆడియన్స్‌ థియేటర్‌లో కూర్చోగలుగుతారు. సెకండాఫ్‌లో కూడా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్‌, డైలాగ్స్‌ నవ్వించడంతో క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందోనన్న ఇంట్రెస్ట్‌తో ఎదురుచూడగలిగారు. అయితే క్లైమాక్స్‌ నిరాశపరచడంతో సినిమాకి సరైన కన్‌క్లూజన్‌ ఇవ్వలేకపోయారన్న అసంతృప్తితో థియేటర్‌ బయటికి వస్తారు. సినిమాలో కొన్ని మైనస్‌ పాయింట్స్‌ వున్నప్పటికీ ఓవరాల్‌గా ఒక మంచి ఎటెమ్ట్‌ చేశారని మాత్రం సినిమా చూసిన ఆడియన్స్‌ ఒప్పుకుంటారు. బి, సి సెంటర్‌ ఆడియన్స్‌కి ఈ కాన్సెప్ట్‌ అంతగా రుచించకపోయినా వాళ్ళు కూడా ఓవరాల్‌గా సినిమా ఓకే అని మాత్రం చెప్తారు. స్వామిరారా, కార్తికేయ వంటి డిఫరెంట్‌ మూవీస్‌తో కమర్షియల్‌ హిట్స్‌ అందుకున్న నిఖిల్‌కి ‘సూర్య వర్సెస్‌ సూర్య’ కూడా మరో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. డైరెక్టర్‌గా కార్తీక్‌ కొన్ని విషయాల్లో ఫెయిల్‌ అయినప్పటికీ కామెడీ పరంగా, టెక్నికల్‌గా ఆడియన్స్‌కి మంచి సినిమా అందించాడని చెప్పొచ్చు. నిర్మాత మల్కాపురం శివకుమార్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ సినిమాని రిచ్‌గా చూపించడంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది. నిఖిల్‌ గత హిట్‌ సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఓపెనింగ్స్‌ భారీగానే వస్తాయి. సినిమా టాక్‌ని బట్టి స్లోగా కలెక్షన్స్‌ పికప్‌ అయ్యే అవకాశాలు వున్నాయి. ఏది ఏమైనా నిఖిల్‌ కెరీర్‌లో ‘సూర్య వర్సెస్‌ సూర్య’ కమర్షియల్‌గా ఎబౌ ఏవరేజ్‌ సినిమాగా చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: మరో కొత్త కాన్సెప్ట్‌.. మరో మంచి ప్రయత్నం

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ