Advertisementt

సినీజోష్‌ రివ్యూ: పడ్డానండి ప్రేమలో మరి

Sat 14th Feb 2015 11:09 AM
paddanandi premalo mari movie,varun sandesh,vithika sheru,bharani k. dharan,mahesh upputuri,a.r.khuddus  సినీజోష్‌ రివ్యూ: పడ్డానండి ప్రేమలో మరి
సినీజోష్‌ రివ్యూ: పడ్డానండి ప్రేమలో మరి
Advertisement
Ads by CJ

పాంచజన్య మీడియా ప్రై. లిమిటెడ్‌

పడ్డానండి ప్రేమలో మరి

నటీనటులు: వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు, అరవింద్‌, 

పీలా గంగాధర్‌, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు

కెమెరా: భరణి కె. ధరన్‌

సంగీతం: ఎ.ఆర్‌.ఖుద్దూస్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

సమర్పణ: నల్లపాటి వంశీమోహన్‌

నిర్మాత: నల్లపాటి రామచంద్రప్రసాద్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉప్పుటూరి మహేష్‌

విడుదల తేదీ: 14.2.2015

ప్రేమకథా చిత్రాలతో సక్సెస్‌లు సాధించి ఆ ప్రేమకథా చిత్రాలతోనే ఫెయిల్యూర్స్‌ కూడా అందుకున్న వరుణ్‌ సందేశ్‌కి ఈమధ్యకాలంలో సరైన హిట్‌ లేదు. లేటెస్ట్‌గా పాంచజన్య మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటి రామచంద్రప్రసాద్‌ నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్‌ సందేశ్‌కి జంటగా వితిక షేరు నటించింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి వరుణ్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: ఓపెన్‌ చేస్తే విలన్‌ లంకపతి(అరవింద్‌), అతని అనుచరులు హీరో రామ్‌(వరుణ్‌ సందేశ్‌)ని, అతని ఫ్రెండ్స్‌ని వెంబడిస్తుంటారు. దాని వెనుక కథ ఏమిటో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం. రామ్‌ తల్లిదండ్రులు ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. అందువల్ల ప్రేమించుకున్నవారిని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి నచ్చజెప్పి ప్రేమ జంటలకు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. అలా రామ్‌ స్నేహితుడు యాదవ్‌(పోసాని) కూతుర్ని ప్రేమిస్తాడు. కానీ, వారి పెళ్ళికి యాదవ్‌ ఒప్పుకోడు. దాంతో ఒక పథకం ప్రకారం యాదవ్‌ కూతుర్ని కిడ్నాప్‌ చేస్తారు రామ్‌ బృందం. వారికి విజయవాడలో పెళ్ళి చెయ్యాలని డిసైడ్‌ అవుతారు. అయితే విజయవాడ రావడానికి రామ్‌ ఒప్పుకోడు. ఎందుకంటే దానికీ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ వుంది. విజయవాడలో శ్రావణి(వితిక షేరు)ని ఫస్ట్‌ సైట్‌లోనే లవ్‌ చేస్తాడు రామ్‌. ఎన్నో ట్విస్టుల తర్వాత వారిద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడతారు. విలన్‌ లంకపతి కూడా ఫస్ట్‌సైట్‌లోనే శ్రావణిని లవ్‌ చేస్తాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. ఆమెను కిడ్నాప్‌ చెయ్యాలని ట్రై చేస్తాడు. లంకపతి బారినుంచి శ్రావణిని కాపాడతాడు రామ్‌. ఇదిలా వుంటే ఓ సందర్భంలో ఒక అమ్మాయితో రామ్‌ని చూసిన శ్రావణి అతన్ని అపార్థం చేసుకొని అతనికి దూరం అవుతుంది. ఆ టైమ్‌లో అమెరికాలో వుంటున్న డాక్టర్‌ బావతో ఆమెకు పెళ్ళి నిశ్చయమవుతుంది. ప్రజెంట్‌లోకి వస్తే విజయవాడ వెళ్తున్న రామ్‌ బృందానికి ఒక వ్యక్తి తారసపడతాడు. తనని దగ్గరలో వున్న ఓ పల్లెటూరిలో డ్రాప్‌ చెయ్యమని, తెల్లవారితే తన పెళ్ళి అని చెప్తాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది శ్రావణి పెళ్ళి చేసుకోబోయే అమెరికా డాక్టర్‌ అతనేనని. సడన్‌గా ఆ ఊళ్ళో రామ్‌ని చూసిన శ్రావణి ఎలా రియాక్ట్‌ అయింది? ఆ టైమ్‌లో రామ్‌ రియాక్షన్‌ ఏమిటి? రామ్‌ని శ్రావణి ఎందుకు అపార్థం చేసుకుంది? చివరికి ఆ అపార్థాలు తొలగిపోయాయా? శ్రావణికి, ఆమె బావకి పెళ్ళి జరిగిందా? శ్రావణిని దక్కించుకోవడానికి లంకపతి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి సంబంధించి, హీరో వరుణ్‌ సందేశ్‌కి సంబంధించి ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే అతనికి ఇది కొత్త తరహా సినిమా. ఇప్పటివరకు ఈ తరహా సినిమా అతను చెయ్యలేదు. లవ్‌తోపాటు యాక్షన్‌ కూడా మిక్స్‌ అయి, కొన్ని ట్విస్టులు మిక్స్‌ అయిన సినిమా. డైరెక్టర్‌ ఈ కథని డీల్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. ఈ కథకి భరణి కె. ధరన్‌ ఫోటోగ్రఫీ చాలా హెల్ప్‌ అయిందని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్‌ని డిఫరెంట్‌ తీసే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్‌ విషయానికి వస్తే పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం పెద్ద సినిమాల రేంజ్‌లోనే వుంది. వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు వారి వారి క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. వరుణ్‌కి ఫ్రెండ్‌గా నటించిన పీలా గంగాధర్‌ కూడా తనకి వున్న పరిధిలో బాగానే చేశాడు. డైరెక్టర్‌ మహేష్‌ టేకింగ్‌ కూడా ఫర్వాలేదు అనిపించింది. కథలో వచ్చే ట్విస్ట్‌లనుగానీ, సస్పెన్స్‌నిగానీ బాగానే మెయిన్‌ టెయిన్‌ చేశాడు. ఫైట్‌మాస్టర్‌ రవి కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ కూడా బాగున్నాయి. గతంలో చిన్న చిన్న క్యారెక్టర్స్‌ చేసినప్పటికీ ఈ చిత్రంతో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ విలన్‌గా మారిన అరవింద్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. అజయ్‌, సుప్రీత్‌, శ్రావణ్‌, సుబ్బరాజు తరహాలో భవిష్యత్తులో విలన్‌గా పెద్ద రేంజ్‌కి వెళ్ళే అవకాశాలు అరవింద్‌కి వున్నాయి.

మైనస్‌ పాయింట్స్‌: సినిమాకి పెద్ద మైనస్‌ కామెడీ. ఇలాంటి యూత్‌ఫుల్‌ మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్‌ కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అయితే ఇందులో అక్కడక్కడా కామెడీ సీన్స్‌ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకునేలా లేదు. ఇంటర్వెల్‌ వరకు సినిమాని ఎలాగోలా లాక్కొచ్చిన డైరెక్టర్‌. సెకండాఫ్‌లో కథని అరగంటలో ఎండ్‌ చెయ్యవచ్చు. కానీ, సెకండాఫ్‌లో ఆడియన్స్‌ని గంట సేపు కూర్చోపెట్టడం కోసం ల్యాగ్‌ మెయిన్‌టెయిన్‌ చేశాడు. కథాగమనంలోకి వెళ్ళకుండా అక్కడక్కడే తిప్పే ప్రయత్నం చేశాడు. దాంతో ఆడియన్స్‌కి బోర్‌ అనిపిస్తుంది. తాగుబోతు రమేష్‌ కామెడీ ఎపిసోడ్‌ తెగ బోర్‌ కొట్టిస్తుంది. అలాగే నల్లవేణుతో కూడా కామెడీ చేయించాలని ట్రై చేశారు. కానీ, వర్కవుట్‌ అవ్వలేదు. అలాగే పోసాని క్యారెక్టర్‌కి కూడా అంత ప్రాధాన్యత లేదు. అతని క్యారెక్టర్‌తో కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. ఆడియోపరంగా పాటలు అంతగా ఆకట్టుకోలేదు. విజువల్‌గా కూడా ఏదో పాత పాటలు చూస్తున్న ఫీలింగే కలిగింది తప్ప కొత్తదనం కనిపించలేదు. 

విశ్లేషణ: ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్‌ స్టార్ట్‌ అయ్యాక అరగంట సేపు ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవుతారు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ మాత్రం సినిమాని ఒక దారికి తీసుకొస్తుంది. రెగ్యులర్‌గా విలన్‌ని ఓడిరచి హీరోయిన్‌ దక్కించుకోవడం కాకుండా, విలన్‌ని ఓడిరచి, అతని మనసు కూడా గెలుచుకోవడం అనేది అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ తరహా ప్రేమకథా చిత్రాలు గతంలో చాలా వచ్చినప్పటికీ కొన్ని  సీన్స్‌ ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తాయి. కథ, స్క్రీన్‌ప్లే, ఫ్లో గురించి పక్కన పెడితే టేకింగ్‌ పరంగా మహేష్‌ మంచి మార్కులు కొట్టేసాడు. నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించారు. ఇప్పటివరకు వరుణ్‌ చేసిన సినిమాలకు భిన్నంగా వుండే సినిమా ఇది. యాక్టింగ్‌పరంగా, డాన్స్‌ పరంగా, ఫైట్స్‌ పరంగా వరుణ్‌ చాలా ఇంప్రూవ్‌ అయ్యాడని చెప్పొచ్చు. యూత్‌ని, ఫ్యామిలీస్‌ని టార్గెట్‌ చేస్తూ తీసిన ఈ సినిమా కొన్ని వర్గాలకు నచ్చే అవకాశం వుంది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందనేది వెయిట్‌ అండ్‌ సీ. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్రేమలో పడ్డవారికి మంచి టైమ్‌ పాస్‌.

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ