Advertisementt

సినీజోష్‌ రివ్యూ: పటాస్‌

Fri 23rd Jan 2015 07:14 AM
telugu movie patas review,kalyan ram new movie patas  సినీజోష్‌ రివ్యూ: పటాస్‌
సినీజోష్‌ రివ్యూ: పటాస్‌
Advertisement

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌

పటాస్‌

నటీనటులు: కళ్యాణ్‌రామ్‌, శృతి సోది, సాయికుమార్‌,

అశుతోష్‌ రాణా, ఎం.ఎస్‌.నారాయణ, 

జె.పి., పోసాని, శ్రీనివాసరెడ్డి తదితరులు

కెమెరా: సర్వేష్‌ మురారి, 

ఎడిటింగ్‌: తమ్మిరాజు

సంగీతం: సాయికార్తీక్‌

నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

విడుదల తేదీ: 23.1.2015

‘తొలిచూపులోనే’ చిత్రంతో హీరోగా పరిచయమై నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి ఆ బేనర్‌లో మొదటి చిత్రంగా ‘అతనొక్కడే’ చిత్రాన్ని నిర్మించాడు నందమూరి కళ్యాణ్‌రామ్‌. ఆ చిత్రంతో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా ఏమిటో ప్రూవ్‌ చేసుకున్న కళ్యాణ్‌రామ్‌ ఆ తర్వాత అదే బేనర్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అతని కెరీర్‌ని టర్న్‌ చేయలేకపోయాయి. ‘హరేరామ్‌’ మాత్రం కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించింది. అయితే ఈసారి డెఫినెట్‌గా హిట్‌ కొట్టాలన్న కసితో ‘పటాస్‌’ చిత్రాన్ని ప్రారంభించాడు. నిర్మాణంలో వుండగానే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. అనిల్‌ రావిపూడిని దర్శకుడుగా పరిచయం చేస్తూ కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన ‘పటాస్‌’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కళ్యాణ్‌రామ్‌ని ఎప్పటి నుంచో ఊరిస్తున్న సూపర్‌హిట్‌ ఈ చిత్రం అందించిందా? కళ్యాణ్‌రామ్‌ని పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చూపించడంలో అనిల్‌ రావిపూడి ఎంత వరకు సక్సెస్‌ అయ్యాడో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

కథ: ఎం.పి. జి.కె. అంటే సిటీలో హడల్‌. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలన్నా, అతనికి ఎదురుగా నిలబడాలన్నా పోలీసులు కూడా భయపడతారు. అతనికి పోలీసులంటే కోపం. అతని ఎదురుగా ధైర్యంగా నిలబడి మీసం మెలేసే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఎవరూ లేరు. అలాంటిది వేరే రాష్ట్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కళ్యాణ్‌ సిన్హా(కళ్యాణ్‌రామ్‌) కావాలని హైదరాబాద్‌కి ట్రాన్సఫర్‌ చేయించుకుంటాడు. వచ్చీ రావడంతోనే కళ్యాణ్‌ తన కింది పోలీస్‌ ఆఫీసర్లను అవినీతిలోకి దించుతాడు. అందినంత దండుకోమని వారికి సలహా ఇస్తాడు. ఇదంతా డిజిపి(సాయికుమార్‌)కి తలనొప్పిగా మారుతుంది. కళ్యాణ్‌ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని డిజిపికి కళ్యాణ్‌కి సంబంధించి ఒక నిజం తెలుస్తుంది. దాంతో షాక్‌ అవుతాడు. డిజిపి తెలుసుకున్న నిజం ఏమిటి? కళ్యాణ్‌ ప్రవర్తనకు కారణం ఏమై వుంటుంది? కళ్యాణ్‌ని డిజిపి మార్చగలిగాడా? అసలు డిజిపికి, కళ్యాణ్‌కి వున్న సంబంధం ఏమిటి? అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జి.కె.ని కళ్యాణ్‌ ఏవిధంగా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: మొదట చెప్పుకోవాల్సిన ప్లస్‌ పాయింట్‌ డైరెక్టర్‌. ఇది డైరెక్టర్‌ సినిమా అని చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచి ఎండ్‌ అయ్యే వరకు ఎక్కడా స్పీడ్‌ మిస్‌ అవకుండా యాక్షన్‌, కామెడీ, లవ్‌ దేనికదే అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళాడు డైరెక్టర్‌. రొటీన్‌ కథ అయినప్పటికీ దాని చుట్టూ అల్లిన బిల్డప్‌, రాసిన మాటలు, కామెడీ టైమింగ్‌, ఎడిటింగ్‌, రీరికార్డింగ్‌ ఇవన్నీ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి. వీటికితోడు కళ్యాణ్‌రామ్‌ ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాని హై రేంజ్‌కి తీసుకెళ్ళింది. ఎం.ఎస్‌.నారాయణ, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను, పోసాని, జె.పి. ఇలా ప్రతి ఒక్కరికీ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ ఇవ్వడం వల్ల వారి వారి క్యారెక్టర్స్‌ని ఆర్టిస్టులు దున్నేశారని చెప్పాలి. సినిమాలో స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ ఎక్కడా బోరింగ్‌ సీన్‌ అనేది లేకపోవడం ఎడిటర్‌ తమ్మిరాజు పనితనాన్ని తెలియజేస్తుంది. ఇక సర్వేష్‌ మురారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించాడు. 

మైనస్‌ పాయింట్స్‌: కథలో కొత్తదనం లేదు. ఇలాంటి కథతో గతంలో లెక్కకు మించిన సినిమాలు వచ్చాయి. దాదాపు అందరు ప్రముఖ హీరోలు ఇలాంటి కథతో సినిమాలు చేసేశారు. నెక్స్‌ట్‌ జరగబోయే సీన్‌ ఏమిటో ఆడియన్స్‌ ఈజీగా ఊహించగలరు. ఆడియో కూడా ఈ సినిమాకి మైనస్‌ అనే చెప్పాలి. పాటలు ఆడియో పరంగా అంతగా ఆకట్టుకోకపోయినా విజువల్‌గా బాగున్నాయనిపిస్తుంది. పాటల విషయంలో ఆకట్టుకోలేకపోయిన సాయికార్తీక్‌ రీ`రికార్డింగ్‌లో తన పనితనం చూపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ శృతి సోది విషయానికి వస్తే ఏమాత్రం ప్రాధాన్యత లేని క్యారెక్టర్‌ ఆమెది. పాటలకు మాత్రమే పరిమితమైన శృతి లుక్స్‌ పరంగా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాకి మరో పెద్ద మైనస్‌ సినిమాలో దాదాపు ఓ ముప్పై సార్లు మనం టి.విలో న్యూస్‌ చూస్తాం. హీరోగానీ, విలన్‌గాని టి.వి. ఆన్‌ చేసిన ప్రతి సారీ వారికి సంబంధించిన న్యూసే వస్తుంది. టి.వి. విషయంలో డైరెక్టర్‌ కాస్త విసిగించాడనే చెప్పాలి. 

విశ్లేషణ: ఇది రొటీన్‌ కథ అయినప్పటికీ కథనం, మంచి పంచ్‌ డైలాగ్స్‌, డిఫరెంట్‌గా వుండే ఫైట్స్‌, హీరో కళ్యాణ్‌రామ్‌ క్యారెక్టరైజేషన్‌, అతని పెర్‌ఫార్మెన్స్‌ సినిమాని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలబెడతాయనడంలో సందేహం లేదు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా కామెడీతో అదరగొట్టేసి, సెకండాఫ్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌లకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చారు. ఒక కమర్షియల్‌ హిట్‌ సినిమాకు వుండాల్సిన హంగులన్నీ ‘పటాస్‌’లో వున్నాయి. ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చిత్రంగా రూపొందించడంలో డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సక్సెస్‌ అయ్యాడు. నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా నిర్మించాడు. ఈ సినిమా తప్పకుండా అన్ని సెంటర్స్‌లోనూ సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ‘పటాస్‌’ బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పుకోవచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: కళ్యాణ్‌రామ్‌ ప‘టాస్‌’ గెలిచాడు

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement