Advertisement

సినీజోష్‌ రివ్యూ: ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌

Thu 01st Jan 2015 09:29 AM
telugu movie a shyam gopal varma film,a shyam gopal varma film movie review,a shyam gopal varma film movie released,a shyam gopal varma film director rakesh srinivas,shafi in a shyam gopal varma film,a shyam gopal varma film stills  సినీజోష్‌ రివ్యూ: ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌
సినీజోష్‌ రివ్యూ: ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌
Advertisement

సమిష్టి క్రియేషన్స్‌ 

ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌

నటీనటులు: షఫి, జోయా ఖాన్‌, 

జయప్రకాష్‌రెడ్డి, జీవా, చంటి, వాసు ఇంటూరి, 

సౌమ్య, సూర్య తదితరులు

కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్‌

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌

సంగీతం: ఆనంద్‌

నిర్మాతలు: విజయ్‌కుమార్‌రాజు, రాకేష్‌ శ్రీనివాస్‌

కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రాకేష్‌ శ్రీనివాస్‌

విడుదల తేదీ: 1.1.2015

సినిమా పుట్టిన దగ్గర్నుంచి ఇప్పటివరకు ఎందరో దర్శకులు తమ తమ శైలిలో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. కొందరు ఫ్యామిలీ సినిమాల్లో స్పెషలిస్టులైతే, కొంతమంది ప్రేమకథా చిత్రాలు తీసి మెప్పించడంలో ఆరితేరినవారు. 80 సంవత్సరాల తెలుగు సినిమా ట్రెండ్‌ రకరకాలుగా మారుతూ వస్తోంది. అలా తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చిన ఓ దర్శకుడి కథే ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌’(నా సినిమా నా ఇష్టం). దర్శకత్వ శాఖలో ఎలాంటి అనుభవం లేని రాకేష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు కూడా. సెటైరికల్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎవరి మీద సెటైర్స్‌ వేశారు? అవి ఎంతవరకు ప్రేక్షకుల్ని రీచ్‌ అయ్యాయో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ: ప్రేక్షకుల అభిరుచితో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తూ వెళ్ళే శ్యామ్‌గోపాల్‌వర్మ అనే దర్శకుడి కథ ఇది. అప్పటివరకు ఒక మూసలో వెళ్తున్న తెలుగు సినిమా గతిని తన మొదటి సినిమాతోనే మార్చిన ఈ దర్శకుడు ఆ తర్వాత దెయ్యం సినిమాలు, ఫ్యాక్షన్‌ సినిమాలు చేసి విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఓరోజు శ్యామ్‌గోపాల్‌వర్మని కిడ్నాప్‌ చేస్తారు. అతన్ని సిటీకి ఎంతో దూరం వున్న అడవిలో ఓ ఇంటిలో తప్పించుకోవడానికి వీలులేని విధంగా గొలుసుతో బంధిస్తారు. అతనికి అందుబాటులో వారానికి సరిపడే మంచి నీళ్ళు, స్టౌవ్‌, బియ్యం, వంట సరుకులు వుంచుతారు. వాటితోపాటు అతన్ని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి రికార్డ్‌ చేసిన క్యాసెట్‌, టేప్‌ రికార్డర్‌ కూడా వుంటుంది. అసలు శ్యామ్‌గోపాల్‌వర్మను ఎవరు, ఎందుకు కిడ్నాప్‌ చేశారు? అక్కడి నుంచి వర్మ తప్పించుకోగలిగాడా? అతన్ని కిడ్నాప్‌ చేసింది ఎవరో తెలుసుకోగలిగాడా? బందీగా వున్న వర్మ మానసికంగా ఎలాంటి క్షోభను అనుభవించాడు? చివరికి శ్యామ్‌గోపాల్‌వర్మ కెరీర్‌ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: శ్యామ్‌గోపాల్‌వర్మగా షఫి హండ్రెడ్‌ పర్సెంట్‌ తన పెర్‌ఫార్మెన్స్‌ని అందించాడు. అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ బాగున్నప్పటికీ అతని డైలాగ్‌ మాడ్యులేషన్‌, డైలాగ్‌ టైమింగ్‌ మాత్రం ప్రేక్షకులకు విసుగును పుట్టించింది. అతనితో చాలా స్లోగా డైలాగ్స్‌ చెప్పించడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అప్పటివరకు వున్న  క్యూరియాసిటీని చంపేసిందని చెప్పాలి. ఆర్టిస్ట్‌గా షఫి  ఈ క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. హీరోయిన్‌ జోయాఖాన్‌ తన పాత్ర పరిధిలో బాగానే చేసింది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే తీస్కో కోకాకోలా పాటలో మంచి అభినయాన్ని కనబరిచింది. ఇక తనకు కొట్టిన పిండిలాంటి రాయలసీమ యాసలో జయప్రకాష్‌రెడ్డి కూడా తన పాత్రను పండిరచాడు. మిగతా క్యారెక్టర్స్‌లో చేసిన సూర్య, ప్రభాస్‌ శ్రీను, చంటి తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: ఈ సినిమా మెయిన్‌ ఎస్సెట్‌గా చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ గురించి రాహుల్‌ శ్రీవాత్సవ అద్భుతమైన కెమెరా పనితనాన్ని చూపించాడు. లైటింగ్‌ విషయంలోగానీ, షాట్స్‌ విషయంలో గానీ చాల కేర్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి సీన్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలోని పాటలకు అంత ప్రాముఖ్యత లేనప్పటికీ ‘తీస్తో కోకాకోలా..’ పాట మాత్రం ఆకట్టుకునేలా వుంది. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని బాగా చేశాడు ఆనంద్‌. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. డైరెక్టర్‌ విషయానికి వస్తే రాకేష్‌ శ్రీనివాస్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ టేకింగ్‌ బాగానే అనిపిస్తుంది. అయితే ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేసే అంశాలేవీ లేకపోవడంతో సినిమా చాలా చప్పగా సాగుతుంది.

ప్లస్‌ పాయింట్స్‌: 

షఫి పెర్‌ఫార్మెన్స్‌

సినిమాటోగ్రఫీ

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌

స్లో నేరేషన్‌

ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం

డైరెక్టర్‌ ఏం చెప్పదలుచుకున్నదీ క్లారిటీ లేకపోవడం

పాటలు

విశ్లేషణ: రాకేష్‌ శ్రీనివాస్‌ సెలెక్ట్‌ చేసుకున్న టైటిలే ఇంట్రెస్టింగ్‌గా వుండడంతో రామ్‌గోపాల్‌వర్మ మీద సెటైర్లు వేస్తూ తీసిన సినిమా అని అందరికీ అర్థమైపోతుంది. సినిమా రిలీజ్‌కి ముందు జరిగిన అన్ని ప్రెస్‌మీట్స్‌లో ఇది రామ్‌గోపాల్‌వర్మపై తీసిన సినిమా కాదని డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీనివాస్‌ పదే పదే చెప్తూ వచ్చాడు. అయితే ఈ సినిమాని చిన్న పిల్లాడికి చూపించినా అది రామ్‌గోపాల్‌వర్మని దృష్టిలో పెట్టుకొని తీశారని చెప్తాడు. పైగా సినిమాలో రామ్‌గోపాల్‌వర్మ చేసిన సినిమాల టైటల్స్‌నే అటూ ఇటూ మార్చి పెట్టారు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ కాస్త ఇంట్రెస్ట్‌గా అనిపించినప్పటికీ షఫీ స్లోగా చెప్పే డైలాగ్స్‌ ఆడియన్స్‌కి విసుగును పుట్టిస్తాయి. ఇలాంటి సెటైరికల్‌ మూవీలో కామెడీ అనేది లేకపోతే ఆ సినిమా ఎంత బాగా తీసినా ఆడియన్స్‌ని మెప్పించలేదు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేయదగ్గ కామెడీ ఇందులో లేదు. సీరియస్‌గా నడుస్తున్న కథలో చంటి, అతని ఫ్రెండ్‌ చేసే కామెడీ అతికించినట్టు, అర్థం పర్థం లేకుండా వుంది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కరెక్ట్‌గా వుంటే ఒక వర్గం ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు నచ్చే అవకాశం వుంది. ఈ సినిమాలో అలాంటివేవీ లేకపోవడంవల్ల ఆడియన్స్‌ని ఆకట్టుకునే అవకాశం తక్కువ. అయితే రామ్‌గోపాల్‌వర్మని, అతని సినిమాల్ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. ఎలాంటి అనుభవం లేకుండా మొదటి సినిమా తీసిన రాకేష్‌ శ్రీనివాస్‌కి దర్శకుడుగా మంచి భవిష్యత్తు వుంటుందని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌:  కాన్సెప్ట్‌ బాగుంది. కానీ, కష్టమే

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement