Advertisement
Google Ads BL

PR : అవును.. రామోజీకి గురు దక్షిణే..!


గ్రేట్ కాదు.. గే అనిపించుకున్నావ్‌!

Advertisement
CJ Advs

చెరుకూరి రామోజీ రావు.. ఆయనొక అక్షర యోధుడు, అక్షర శిల్పి..! కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి..! రైతు కుటుంబం నుంచి వచ్చి.. వ్యాపార, మీడియా, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి..! బతికినన్నాళ్లు ప్రజా శ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పరితపించిన వ్యక్తి.. కాదు కాదు ఒక శక్తి..! ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా నేనున్నానీ.. అంటూ కలం కదిలించి బాధితుల పక్షం వహించేవారు.! లక్షలాది జర్నలిస్టులను తయారుచేసి సమాజ సేవ కోసం వదిలిన మంచి మనసున్న మనిషి..! ఇప్పుడున్న మీడియా ప్రపంచంలో రాణిస్తున్న పెద్ద తలకాలయల నుంచి సబ్ ఎడిటర్ల వరకూ ఎక్కడో ఒక చోట ఈనాడు సంస్థల మూలాలు తప్పకుండా ఉంటాయ్. ఇక సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసి.. సమాజాన్ని జాగృతం చేసే చిత్రాలు దగ్గరుండి మరీ తీయించిన సమాజోద్ధారకుడు. ఎందరో చిన్న నటులకు అవకాశాలు ఇచ్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా మేము సైతం అంటూ ఆదుకునేందుకు సిద్ధపడేవారు. రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు మాటల్లో చెప్పలేం.. పెదపారుపూడి అనే గ్రామానికి వెళ్తే ఇట్టే అర్థమవుతుంది. కొన్ని రంగాలు ఆయన్ను ఇప్పటికీ, ఎప్పటీకీ మరిచిపోవు శాశ్వతంగా ఉండిపోతారంతే..! ఎందుకంటే రామోజీ అందించిన విశిష్ట సేవలు అలాంటివి మరి. అందుకే పెద్దాయనను మీడియా మొఘల్ అని పిలుస్తుంటారు. చూశారుగా.. ఇదీ రామోజీ ట్రాక్ రికార్డ్.. ఇలాంటి వ్యక్తిపైన బురద జల్లి, ఇష్టానుసారం రాస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

ఎందుకింత పైత్యం..!

మీడియా అనే సమాజంలో చీడపురుగులా తయారైన ఓ వెబ్‌సైట్ నిత్యం చెత్త రాతలు రాస్తూ.. యూట్యూబ్ చానెల్‌‌లో కారు కూతలు కూయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకూ తన తప్పుడు రాతలతో రాజకీయ, సినీ ప్రముఖులు ఎంతోమందిని రోడ్డుకు ఈడ్చిన పరిస్థితి. ఈ పాటికే అర్థమైందిగా ఆ కుహనా రాతలు రాసే సైట్ ఏదనేది..! ఇక అసలు విషయానికొస్తే.. సమాజానికి మీడియా, సినిమాలు, వ్యాపార పరంగా విశిష్ట సేవలు అందించిన రామోజీరావు అకాల మరణం చెందితే ఆయన సంస్మరణ సభను విజయవాడలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. దీనికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించారు. ఇందులో తప్పేంటి..? సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తికి ఇలాంటి సభలు పెట్టి ఆయన సేవలను కొనియాడి, ఈ జనరేషన్ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిస్తే తప్పెక్కడుంది..? అలాంటిది గురుభక్తి, రాజ గురు దక్షిణ అంటే నోటికొచ్చినట్లు రాసేయడం ఎంతవరకు సబబు..? పోనీ ఇలా రాసిన సో కాల్డ్ యదవలకు.. రామోజీ గురించి ఏం తెలుసు..? పోనీ ఆయన జీవితం గురించి ఎంతవరకు తెలుసు..? ఎంతసేపూ మీడియా పర్సన్, సినిమాలు నిర్మించారు.. వ్యాపారాలు చేశారని రాసుకొస్తున్నారు.. సరే ఆయన పుట్టినప్పట్నుంచి చనిపోయే వరకూ ఆయన జర్నీలో జరిగిన.. సమాజానికి ఆయన చేసిన సేవల గురించి కూడా తెలుసుకుని రాస్తే మహా మంచిది సుమీ. ఆయన జీవితం ఎక్కడ మెదలై.. ఇంకెక్కడ ఆగిందనేది తెలుసుకుని రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకానీ మిడి మిడి జ్ఞానంతో రాసేస్తే అచ్చు తప్పు కదా. పోనీ తమరు రాసిన ఈ సంస్థ హెడ్ కానీ.. అందులో పనిచేసే ఏదో ఒకరికి కచ్చితంగా ఈనాడు బ్యాగ్రౌండ్ అనేది ఉండి ఉంటుంది.. అసలు రామోజీ అంటే ఏంటనేది తెలుసకుంటే ఇంకా మంచిది.. అంతేకానీ పైత్యం ప్రదర్శిస్తే ఫలితమేముంది..!

ఆకాశంపై ఉమ్మితే..!

ఆకాశంపై ఉమ్మితే ఎవరి మీద పడుతుంది..? అదే కొండను చూసి కుక్క మొరిగితే నష్టమెవరికి..? ఇది కూడా అంతే.. ఈ వార్త రాసిన ఎడిటరో, సబ్ ఎడిటర్‌కు రామోజీకి ఉన్న అనుభవం అంత వయసు అయినా ఉంటుందా..? అసలు ఏ రకంగా ఈ వార్త రాసేందుకు అర్హులో గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకుంటే మంచిది. ఇక జనం డబ్బు.. జనం డబ్బు అని కొట్టుకుంటున్న చెత్త యదవలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజానికి తనవంతుగా మీడియా, సినిమాల పరంగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తికి సంస్మరణ సభ పెడితే తప్పెలా అవుతుందో కూడా చెప్పాలి. ఇక భారతరత్న ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్‌ను కూడా తప్పుబడుతున్నారు.. అవును తమరికొచ్చిన నష్టమేంటి..? ఎక్కడో పెదపారుపూడిలో పుట్టిన మనిషి గురించి మనం ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నామంటే అర్థం.. ఆయనొక వ్యవస్థ, తెలుగు సమాజాన్ని ఉద్ధరించిన వ్యక్తి. చచ్చిపోతున్న తెలుగును బతికించి, సమాజానికి ఎన్నో విధాలుగా తోడ్పడిన శక్తి గునుక. అలాంటి వ్యక్తికోసం భారతరత్న డిమాండ్ చేస్తే తప్పేంటి..? దీనికి వ్యాపారరత్న అని సెటైర్లు వేయడం సిగ్గుచేటు. రాత రాస్తే నలుగురికి నచ్చి మెచ్చుకునేలా మగాడిలా ఉండాలే కానీ.. గే లాగా రాస్తే ఏమనుకుంటారో చెప్పక్కర్లేదు రా గ్రేట్! ఏదైమైనా నీ సైట్ పేరులోని గ్రేట్‌లో ర వత్తు, ట్ తీసేసి.. గే అని మాత్రమే పెట్టుకుంటే బాగుంటుందనుకుంటాను..!

ఏమిటి.. ఎందుకిలా..!?

అవును.. చంద్రబాబు యూనివర్శిటీలో చదువుతున్న రోజుల్లో నుంచి ఆయన పోరాట పటిమ, రాజకీయ లక్షణాలను వెలికితీసి పాలిటిక్స్‌లోకి అడుగులు వేయించి.. ఇప్పుడు ఈ స్థాయికి చేర్చడంలో ఈనాడు సంస్థల పాత్ర అమోఘం. ఇందుకు గురు భక్తి, గుర దక్షిణ కాదు అంతకుమించే చేస్తారనుకోండి తమరికి వచ్చిన నష్టమేంటి..?. అంతేకాదు.. ఊతకర్ర అని పెద్ద పెద్ద మాటలు రాసేసిన సదరు వ్యక్తికి సిగ్గు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే.. బాబు అంచెలంచెలుగా ఎదగడానికి, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారంటే రామోజీరావు కొంతమేర కారణం అయ్యి ఉండొచ్చు.. తప్పేంటి. ఇక నాటి పత్రికల పోటీ ప్రపంచంలో ఎన్నో దినపత్రికలు ఒడిదుడుకులకు తట్టుకోలేకపోయాయ్. అలాంటిది.. ఇది కూడా రామోజీరావు నిందిస్తే ఒరిగేదేమిటి..? అయినా చనిపోయిన మనిషిపై ఇలాంటి రాతలు ఎంతవరకు కరెక్ట్..?. మీడియా మొఘల్‌ను జూదగాడితో పోల్చి రాయడాన్ని చూస్తుంటే.. ముఖాన ఉమ్మేయాలనిపిస్తోంది. అసలు ఈనాడు, సాక్షికి పోలికలు ఏంటి..? ఈనాడు పుట్టిందే ప్రజలకోసం, ప్రజల పక్షాన నిలబడటానికి.. ఇక సాక్షి అంటారా పార్టీ కోసం పెట్టుకున్న పత్రిక, టీవీ అని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. ఈ రెండింటికీ, రామోజీని మరికొందరు వ్యక్తులతో పోల్చడం సిగ్గో.. సిగ్గు. భారతరత్న.. భారతరత్న అని పదే తన రాతల్లో రాసిన వ్యక్తికి.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని 28 ఏళ్లుగా సమయం, సందర్భం వచ్చినప్పుడు డిమాండ్ చేసిన విషయం కూడా తెలుసుకుంటే మంచిది. అయినా ఇదంతా చంద్రబాబు చేతల్లో కాదు.. కేంద్రం చేతుల్లో ఉంటుందన్న విషయం మరిచిపోయి మతిలేకుండా రాసేస్తే ఎలా..? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది గనుక.. ఏమో ఈ ఐదేళ్లలో రావొచ్చు.. అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో ఈ చెత్త రాతలు రాసిన మేథావి.

త్వరగా పుణ్యం కట్టుకోవాలబ్బా!

ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను రాస్తూ.. అవసరమైతే నిలదీసి ప్రజల పక్షాన నిలబడితే ఎవరూ అడగరు. కానీ ఇలా నిత్యం విషపు రాతలు రాస్తే సభ్య సమాజం సహిస్తుందా..? అంటే వందకు వెయ్యి శాతం అస్సలు కాదు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసే మెయిన్‌స్ట్రీమ్ మీడియా పై చర్యలు తీసుకున్నట్లుగానే.. ఇదిగో ఇలా చెత్త రాతలు రాసే వెబ్ సైట్లు, యూట్యూబ్‌ చానెళ్లపైనా అంతకుమించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. తక్షణమే ఇలాంటి గే రాతలచర్యలు తీసుకుంటే మంచిది. అది కూడా ఎలా ఉండాలంటే మరోసారి ఇలాంటి చెత్త రాతలు రాయాలంటే చేయి ముందుకు కదలకూడదంతే.. అలా..! . సమాజానికి మనం మంచి చేయకపోయినా సరే కానీ.. మంచి చేద్దామన్న ఆలోచనను, మనిషిని తొక్కేస్తే పరమ తప్పు కదా. పేరులోనే గ్రేట్ అని ఉంటే సరిపోతే రాసే రాతలు కూడా అంతకుమించి ఉండాలి.. అంతేకానీ చీ అని చీదరించుకుని, చెప్పుతో కొట్టించుకునేలా ఉంటే పరిస్థితులు ఎక్కడివరకూ వెళ్తాయో అది కూడా తెలుసుకుని మెలిగితే మంచిది..!

- పర్వతనేని రాంబాబు

We have to give great respect to Ramoji Rao :

Every one giving great respect to Ramoji Rao
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs