Advertisement
Google Ads BL

రాజమౌళి విలనిజాన్ని హైలైట్ చేస్తారు: సూర్య


విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసిందని ఇ.టి. కథానాయకుడు సూర్య తెలియజేస్తున్నారు. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు.  ఇ.టి. (ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియా సమావేశంలో చిత్రం గురించి మాట్లాడుతూ..

Advertisement
CJ Advs

- పాండమిక్ ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి. ఫ్యామిలీతో ఎలా గడపాలనేది తెలిపింది. 

- అదేవిధంగా నా మిత్రుడు మాధవన్ కూడా విదేశాలకు వెళ్ళి వుంటే అక్కడ తన కొడుక్కి స్విమ్మింగ్ నేర్పించాడు. కుటుంబానికి చాలా సమయం కేటాయించాడు. 

- పాండమిక్ బిజినెస్ పరంగా పర్యాటక రంగాన్ని, ఆసుపత్రులను పూర్తిగా మార్చేసింది.  డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో జరగలేదు ఏడాదిన్నర కాలం చాలా ఇబ్బందులు పడ్డారు

- అదేవిధంగా సినిమా రంగంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకాశం నీ హద్దురా,  జై భీమ్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ఆదరణ పొందాయి. కలకత్తా నుంచి కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు.

- డిజిటల్ లో అల్లు అరవింద్ గారికి చెందిన ఆహా! ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చేలా చేసింది. రాజమౌళి సినిమాలు అన్నిచోట్ల బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది. మలయాళ పరిశ్రమలో కొత్త కంటెంట్లు అందరూ చూసి ఆనందిస్తున్నారు. దాంతో పరిశ్రమ మొత్తం మారిపోయింది.

- ఒక్కొక్కరు ఆర్టిస్టుగా ఏం చేయాలనేది గ్రహించారు. పైరసీ అరికట్టి ఓటీటీ కొత్త ఆడియన్స్ను తీసుకువచ్చింది. తమిళనాడులో 8కోట్ల జనాభా వుంటే 80 లక్షల మంది ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ చిత్రాలు పాండమిక్ తర్వాత బూస్ట్ ఇచ్చాయి. రేపు రాబోయే ఇ.టి. కూడా అంత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను.

 - ఇటి.లో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని  దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఇ.టి సినిమా.

- మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో మంచి నీళ్ళు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు వుండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.

- రాజమౌళి, ఆయన ఫాదర్ విలనిజాన్ని హైలైట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. ఇ.టి.లోనూ విలన్ సరికొత్తగా వుంటాడు. ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ దర్శకుడు బాగా చూపించాడు. ఇ

- కొత్త సినిమాలు లైన్ లో వున్నాయి. దర్శకుడు బాలతో ఏ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్ తో వాడి వాసల్ సినిమా చేయాలి. అందులో ప్రతి షాట్ కి కనీసం 500 మంది ఆర్టిస్టులు వుండాలి. అందుకే  కరోనా టైంలో అది సాధ్యపడలేదు. జూన్లో ప్రారంభించాలని అనుకుంటున్నాం అని ముగించారు.

Suriya Interview:

Suriya Interview about ET
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs