Advertisement
Google Ads BL

పెద్ద హీరోను అనే గర్వం ప్రభాస్ లో లేదు


సల్మాన్ ఖాన్ రొమాంటిక్ హిందీ మూవీ మైనే ప్యార్‌ కియా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి భాగ్యశ్రీ. ప్రేమపావురాలు సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఉర్రూతలూగించింది. ఆ తరువాత  బాలకృష్ణ హీరోగా నటించిన యువరత్న రాణా సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా, రాజశేఖర్ హీరోగా నటించిన ఓంకారం సినిమాలోను నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ఆదరణ సంపాదించుకున్న నటి భాగ్యశ్రీ .ఆ తరువాత పలు హిందీ, మరాఠి, కన్నడ, భోజ్‌పురి సినిమాల్లో భాగ్యశ్రీ నటించారు. సుమారు రెండు దశాబ్దాల తరవాత తాజాగా  ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రంతో తన సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతోంది.

Advertisement
CJ Advs

నేను సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు మొదటి సారిగా

తలైవి ,రాదే శ్యామ్ సినిమాలో యంగ్ మదర్ క్యారెక్టర్ చేయమని రెండు సినిమాల దర్శకులు వేరు వేరు గా కథలు చెప్పడం జరిగింది. రెండు సినిమాలు ప్యార్లల్ గా ఒకే సారి స్టార్ట్ అయినా కూడా ప్యాండమిక్ స్విచ్వేషన్ వలన రాధే శ్యామ్ డిలే అయ్యింది. ఫ్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కు ఫ్యాన్ ఇండియా సినిమా వంటి రాధే శ్యామ్ సినిమాలో నేను తల్లి గా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ చాలా గొప్ప నటుడు తనకు ఫ్యాన్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ తోటి వ్యక్తులతో తో కలిసి మెలిసి ఉంటాడు.తనతో సెట్ లో నటించేటప్పుడు ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ ఉండేది.పెద్ద హీరోను అనే గర్వం లేకుండా డౌన్ టూ ఎర్త్ ఉండటం ఈ మధ్య కాలంలో ప్రభాస్ నే చూస్తున్నాను.  యు.వి.క్రియేషన్స్ వాళ్ళు మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో సినిమా తీశారు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా గొప్పగా చిత్రీకరించారు. జార్జియా లో గడ్డ కట్టే చలి వున్నా కూడా నిర్మాతలు మమ్మల్ని బాగా చూసుకున్నారు.

మైనే ప్యార్‌ కియా తరువాత నేను కొన్ని సినిమాలు చేశాను. ఆ టైం లో పెళ్లి చేసుకొంటే ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుందని నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఫ్యామిలీ తో బిజీ గా ఉన్నందున నేను సినిమాలకు దూరం అయ్యాను. ఇప్పుడు మా పిల్లలు పెద్ద అయినందున మా హస్బెండ్ గాని గాని మా పిల్లలు గాని సినిమాలలో నటించమని ప్రోత్సాహించడంతో  సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాను

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. ఇవాళ బాలీవుడ్ తో ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగు నుండు చాలా మంచి చిత్రాలు తీస్తున్నారు. తెలుగులో ఒక్క మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా  నటనకు మంచి స్కోప్ వుండే పర్ఫార్మెన్స్ పాత్రలు ఎమున్నా చేయడానికి సిద్ధంగా వున్నాను అన్నారు.

Bhagyashree Interview:

Bhagyashree Interview about Radhe Shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs