Advertisement
Google Ads BL

బంగార్రాజు లో ఎవ్వరూ తగ్గకూడదు -కళ్యాణ్ కృష్ణ


బంగార్రాజు లో ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉంటాయి - డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ

Advertisement
CJ Advs

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సినీజోష్ తో ముచ్చటించారు.

>2014లో మొదటగా నాగార్జున గారికి సోగ్గాడే కథను నెరేట్ చేశాను.. 2016లో సోగ్గాడే రిలీజ్ అయింది. ఆ రోజే బంగార్రాజు సినిమా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. మధ్యలో చైతన్యతో ఓ సినిమాను తీస్తే నాగార్జున గారే నిర్మించారు. మొదటి నుంచి కూడా మా మధ్య ర్యాపో ఉంది. ప్రతీ విషయంలో ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదు.

>సోగ్గాడే చిన్న నాయన లైన్ నాది కాదు. రామ్ మోహన్ గారి పాయింట్ అది. వేరే దర్శకుడిని ముందుగా అనుకున్నారు. నేను వేరే సినిమా కోసం నాగార్జున గారికి ఓ కథ వినిపించాను. అయితే ఆ కథ నా వద్దకు వచ్చింది. ఓ పదిహేను రోజులు ఆ కథ మీద కూర్చున్నాను. ఆ తరువాత కథను నాగార్జున గారికి వినిపించాను. ఫస్ట్ నెరేషన్‌లోనే ఒకే అయింది.

>సోగ్గాడే చిన్ని నాయన సినిమా విడుదలైన రోజే బంగార్రాజు సినిమా చేయాలని అనుకున్నాం. కానీ చైతన్యతో ముందు ఓ సినిమా చేయమని నాగార్జున గారు అన్నారు. కానీ అప్పటికే నాగ చైతన్య గారు సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు కమిట్మెంట్‌లతో ఉన్నారు. ఆ గ్యాప్‌లో నేను నేల టికెట్ సినిమాను చేశాను. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా లేట్ అయింది.

>సోగ్గాడే సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు రాబోతోంది. ప్రీ క్వెల్ కాదు. రెండు సినిమాలను కలిపి చూస్తే ఐదు గంటలు అవుతుంది. సోగ్గాడే ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు అక్కడ మొదలవుతుంది.

>జనరేషన్ తేడా ఉంటుంది తప్పా బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపిస్తారు. పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలానే ఉంటుంది.

>జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఓ సినిమా అనుకున్నాను. అందులో యంగ్ పాత్రలో నాగ చైతన్య, మిగిలిన పాత్రలో నాగార్జున గారు అని అనుకున్నాను. ఆ కథ అయితే ఉంది. ఎప్పుడు చేస్తాను అని తెలీదు.

>అనుకున్న సమయానికి ఈ సినిమాను రెడీ చేయడమే పెద్ద సవాల్‌గా అనిపించింది. వేరే సినిమాలతో కాకుండా సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అందరూ పోల్చుతారు.. వీఎఫ్ఎక్స్‌ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అలా కాలంతో పాటుగా పరిగెత్తాల్సి వచ్చింది.

>సినిమాను ప్రారంభించడమే సంక్రాంతి టార్గెట్‌తో స్టార్ట్ చేశాం. ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నాం. కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

>టీం అంతా కలిసి పని చేశాం. అందరూ ఒకే సింక్‌లో ఉండేవాళ్లం. అందుకే ఈజీగా చేశాం. ఎక్కడా కూడా మిస్ అండర్‌స్టాండిగ్ రాలేదు. మొన్నే సెన్సార్ అయింది. జీరో కట్స్‌తో  యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా పండుగలా ఉందని అన్నారు.

>ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకూడదు.. అందుకే స్క్రిప్ట్‌కు ఇంత సమయం పట్టింది. మొదట్లో కొంత మంది నాగ చైతన్యది గెస్ట్ కారెక్టర్ అని రాశారు. రెండు పాత్రలు సమానంగా ఉంటాయి. ఇద్దరూ హీరోలకు ప్రతీ ఎమోషన్ సమానంగా ఉంటుంది.

>పాటలో ఫన్ ఉంటే నాగార్జున గారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందులో కళ్లు మీద పాట పాడారు. ఇందులో కబడ్డీ మీద పాట పాడారు. ఈ పాట ఎవరు పాడినా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆయన పాడితే ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే నాగార్జున గారితో పాడించాం. సెంటిమెంట్ కోసం కాదు.

>అఖిల్‌తో బంగార్రాజుకు సీక్వెల్ అంటే కష్టం. ముందు కథ రాసిన నేను సంతృప్తి చెందాలి. ఆ తరువాత వారిని మెప్పించాలి.  ఎగ్జైట్ చేసే పాయింట్ దొరికితే ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆలోచన అయితే లేదు.

>ఈ సినిమాకు సంగీతమే ప్రధాన బలం. ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. ఇంకా మూడు పాటలు రానున్నాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియో ఎంత బాగుంటుందో.. మేకింగ్ పరంగా కూడా అంతే బాగుంటుంది. ఆర్ఆర్ అద్బుతంగా ఉంటుంది. మాకే కంట్లో నీళ్లు తిరిగాయి. జనవరి 9న మ్యూజికల్ ఈవెంట్ ఉంది. అందులోనే పాటలు విడుదల చేస్తాం.

>నేటివిటీ ఉండాలి.. దర్జాగా ఉండాలి అనే ఆలోచనల్లోంచే బంగార్రాజు గెటప్‌ను అనుకున్నాం. సూట్, బూట్ వేసుకుంటే బయట అందరూ ఫాలో అవ్వలేరు. అందుకే అందరికీ సింపుల్‌గా అనిపించాలనే పంచెకట్టుని పెట్టాం.

>సినిమాలో ఐదు యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. అందులో నాలుగు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. ఇంకోటి ఆర్కే చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇద్దరు హీరోలకు సమానంగా ఉంటాయి.

>చాలా తెలివైనదాన్ని అని అనుకునే అమాయకురాలి పాత్రలో కృతి శెట్టి కనిపిస్తుంది. విలేజ్‌లో ఉండి. బీటెక్ చదివి తనలాంటి తెలివైన అమ్మాయిలు ఊర్లో లేరని అనుకునే పాత్రలో నటించింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఉన్నట్టుగా రమ్యకృష్ణ గారి పాత్ర కంటిన్యూ అవుతుంది.

>ప్రతీ దర్శకుడి అన్ని రకాల సినిమాలను చేయాలని ఉంటుంది. నేను నెక్స్ట్ చేసే సినిమా మాత్రం ఈ జానర్‌లో ఉండదు. ఏ సినిమా చేసినా కూడా ఎమోషన్ మాత్రం ఉండాలి. ఎమోషన్ కనెక్ట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది. కామెడీ సినిమా అయినా కూడా ఎమోషనట్ టచ్ అవ్వాల్సిందే. ఈవీవీ గారి సినిమాల్లో కామెడీ ఉన్నా కూడా ఎమోషన్ ఉంటుంది.

>జ్ఞానవేల్ రాజా గారితో ఓ సినిమా ఉంటుంది. కథ, హీరో అనేది ఇంకా నిర్ణయించలేదు. హీరోను బట్టి ద్విభాష చిత్రంగా ఉండొచ్చు. కానీ నేను మాత్రం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమాను తీస్తాను. నాకు పాన్ ఇండియన్ ఆలోచనలు లేవు. ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ పెట్టాను. వెబ్ సిరీస్‌ల గురించి ఆలోచించడం లేదు.

Bangaraju Movie Director Kalyan Krishna Interview:

The roles of the two heroes in Bangaraju are similar -Director Kalyan Krishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs