Advertisement
Google Ads BL

అర్జున ఫల్గుణలో ఎమోషన్స్ ఉంటాయి -హీరో శ్రీ విష్ణు

అర్జున ఫల్గుణలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి -హీరో శ్రీ విష్ణు

Advertisement
CJ Advs

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు సినీజోష్ తో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఈ ఏడాది ఇది నా మూడో చిత్రం

ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. రైటింగ్ స్కిల్స్, రైటర్స్‌ని నేను ఎక్కువ ఎంచుకున్నాను. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.

ఈ టైటిల్ అలా వచ్చింది

అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ, ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.

చాలా ఫ్రెష్‌గా అనిపించింది

నన్ను తేజ కలిసినప్పుడు జోహార్ సినిమా ఇంకా రాలేదు. ఆర్టాస్ అనే కూల్ డ్రింక్ అనే పాయింట్ ఈస్ట్ వెస్ట్ వాళ్లకు మాత్రమే తెలుసు. నాకు ఇంకా అవి గుర్తున్నాయి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను.

ఐదుగురు కుర్రాళ్ల కథ

మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌తో ఆర్టాస్ అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్‌డ్రింక్‌ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు.

కరెక్ట్ స్లాంగ్

ఇది వరకు చాలా సినిమాల్లో ఈ యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే  ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది.

ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను

గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది. ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతీ సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటాను.

ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం

తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది.

నర్సీపట్నం ఘటనల ఆధారంగా..

యథార్థ సంఘటనలే కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.

ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయి.

మన దగ్గర పర్మిషన్ త్వరగా రాదని ట్రైన్ ఎపిసోడ్ కోసం ఒరిస్సా వెళ్లాం. రెండు రోజుల పర్మిషన్ అనుకుంటే ఇచ్చింది ఒక రోజే. అందులోనూ కరెక్ట్‌గా రెండున్నర గంటలే దొరికాయి. అందులోనూ మేం గట్టిగా వాడింది గంటన్నర మాత్రమే. చాలా కష్టపడి సీన్లు తీసేశాం. బ్రిడ్జ్ దగ్గర సీన్లు అద్భుతంగా వచ్చాయి. బ్రిడ్జ్ దగ్గర పరిగెత్తే సీన్లలో కిందకు మాత్రం చూడొద్దని అన్నారు. కానీ మధ్యలోకి వెళ్లాక చూశాను. నాకు ఒక్కసారిగా భయమేసింది.

తెలుసుకునే ప్రయత్నం చేస్తారు..

తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో పెట్టేందుకే నేను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఐదు నిమిషాల్లోనే..

అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు.

ప్రతీ ఒక్కరు హీరో..

రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ గారు, శివాజీ రాజాగారు, సుబ్బరాజు గారు అందరూ అద్భుతంగా నటించారు. తేజ అందరి దగ్గరికి వెళ్లి మీరే హీరో అని చెప్పినట్టున్నాడు. ప్రతీ ఒక్కరు హీరోలా ఇరగ్గొట్టేశారు.

అవే నా బలం..

రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్‌లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్‌ కథలే నా బలం.

కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను..

నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం.

రియలిస్టిక్‌గా అనిపిస్తాయి..

ప్రియదర్శన్ అనే కొత్త అబ్బాయి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సుధీర్ రాసిన డైలాగ్స్ ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్ రాసినట్టు ఎక్కడా అనిపించవు.

మంచి యాక్షన్ డ్రామా..

భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద స్పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.

పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు..

మనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. రాజ రాజ చోర కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే విడుదల చేశాం. ఒమిక్రాన్ వస్తుందంటే మనం ఏం చెప్పలేం. ఇక పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు. మాకు కనీసం ఓ వారం సోలోగా దొరికిందని సంతోషంగా ఉన్నాం. కొత్త ఏడాదిని ఇలా పాజిటివ్ సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇది కరెక్ట్ సీజన్. ముందు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అనుకున్నాం. కానీ చివరకు ఇలా డిసెంబర్ చివరన వస్తున్నాం.

నాకు చాలా సిగ్గు..

నాకు చాలా మొహమాటం. కానీ క్లోజ్ అయితే చాలా దూరం వెళ్తాను. నా డైరెక్షన్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా అందరి మీద చేతులు వేసుకుని మాట్లాడుతాను. కెమెరా ముందు పోజులు పెట్టాలంటే కూడా నాకు చాలా సిగ్గు. ఓ అరవై రోజులు ఒకే చోట ఉంటాం కాబట్టి అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తాను.

మమ్మల్ని చాలా నమ్మారు..

నిర్మాత నిరంజన్ రెడ్డి గారు వైల్డ్ డాగ్, ఆ తరువాత ఆచార్య మధ్యలో మేం. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఎప్పుడూ కూడా ఆయన మమ్మల్నీ ఏమీ అడగలేదు. ఆయన మమ్మల్ని చాలా నమ్మారు.

Sri vishnu Interview:

Sree Vishnu Arjuna Phalguna Releasing On December 31st
Show comments

LATEST TELUGU NEWS

Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3

LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs