Advertisement
Google Ads BL

సాయి ప‌ల్ల‌వి ఇంటర్వ్యూ


న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న శ్యామ్ సింగ రాయ్  చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్  సాయి ప‌ల్ల‌వి మీడియాతో ముచ్చ‌టించింది.

Advertisement
CJ Advs

ప్ర‌తి మూవీ నాకు న‌మ్మ‌కం క‌లిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు అని  ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చ‌దువుతున్న‌ప్పుడు ఈ క్యారెక్ట‌ర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో  స్క్రిప్ట్ చ‌దివేటప్పుడు దేవదాసి క్యారెక్ట‌ర్ ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్ప‌డం నచ్చింది. వేరే సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ ప‌రంగా చేశాను.

చాలా స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ అయితేనే సాయి ప‌ల్ల‌వి ఓకే చేస్తుందా అంటే అలా ఏం లేదండి!  అవ‌న్ని నేను న‌మ్మి చేశాను..మీకు కూడా న‌చ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.

నేను డాన్స్ ఎక్కువ చేసింది లవ్ స్టోరీలోనే అనుకుంటా..ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో... అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వాళ్లు. ఆ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను.

దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నాయి. తర్వాత తర్వాత దాన్ని మార్చేశారు. వాళ్ల గురించి పూర్తిగా చూపించ‌లేదు మా సినిమాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాం. శ్యామ్ సింగ రాయ్ పాత్రతో పాటు దేవ‌దాసి పాత్ర‌ ఎంత చూపించాలో, అంతే చూపించారు. ఇది పూర్తిగా దేవదాసి వ్యవస్థపై తీసిన సినిమా కాదు.

స్క్రిప్ట్ చదివే సంతకం పెడతాం కదా... సంతకం చేసిన తర్వాత  పాత్ర పరంగా ఏమైనా పరిమితులు  అంటే బావుండదు.

శ్యామ్ సింగ రాయ్ ప్రీ రిలీజ్  వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వ‌చ్చాయి. అది మాత్రమే కాదు...ఆ పాట అనురాగ్ కులకర్ణి పాడారు. డాన్స్ చేశారు. మనం ఒక కళను ఎంజాయ్ చేయడమే పెద్ద ఇది. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే...నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నేను రుణపడ్డాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను.

అన్ని మూవీస్‌కి క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అయితేనే స్క్రీన్ మీద యాక్టింగ్ బావుంటుంది అనిపిస్తుంది. లేదంటే డిఫరెన్స్ తెలుస్తుంది.  ఈ సినిమాలో సాయి పల్లవి క‌నిపించ‌దు..దేవదాసి పాత్రే కనపడుతుంది.

ఎంసీఏ టైమ్‌లో నాకు, నానిగారికి సన్నివేశాలు తక్కువ. సినిమాలో 20-30 ప‌ర్సెంట్ మాత్ర‌మే ఉంటాయి.  అందుక‌ని నేను ఎలా ఉంటానో...అందులో అలాగే ఉన్నాను. నానిగారు కూడా అంతే!  డిఫ‌రెంట్‌గా ఏమీ ట్రై చేయ‌లేదు. శ్యామ్ సింగ రాయ్ లో మా క్యారెక్టర్స్ వేరేలా ఉన్నాయి. మా ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఇంకా కొంచెం డీప్‌గా ఉన్నాయి. అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్. ఈ క్యారెక్టర్స్ కోసం మా మధ్య ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి.

నాకు ఎందులో ప్యాషన్ ఉంది అంటే నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మ‌రింత తెలుసుకోవాలి అనుకుంటున్నా..

రాహుల్ చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఈ క‌థ‌కి ఏం కావాలి ఏం వ‌ద్దు అనేది ఆయ‌న‌కు పూర్తిగా తెలుసు.  నాని, నేను షూటింగ్ చేసిన ఫస్ట్ సీన్... సినిమాలో మా ఇద్దరి  క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య  లాస్ట్ సీన్. ఎలా చేయాలో మాకు తెలియలేదు. తను ఇలా చేయండి అని చెప్పారు మేం ఆయ‌న్ని ఫాలో అయ్యాం అంతే...

నెక్స్ట్ప్ విరాట పర్వం షూటింగ్ పూర్త‌య్యింది.. నా పాత్ర డ‌బ్బింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. తమిళంలో ఓ సినిమా చేశా. అది కూడా త్వరలో విడుదల అవుతుంది. ప్ర‌స్తుతం వెబ్ కంటెంట్  చ‌దువుతున్నా...న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తా..

Sai Pallavi Interview:

Sai Pallavi Interview about Shyam Singha Roy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs