Advertisement
Google Ads BL

షూటింగ్ చేసింది 70 రోజులే -దర్శకుడు శ్రీ సరిపల్లి


రాజా విక్రమార్క లో యాక్షన్, సిట్యువేషనల్ కామెడీ.. రెండూ ఉంటాయి! -దర్శకుడు శ్రీ సరిపల్లి 

Advertisement
CJ Advs

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించిన సినిమా రాజా విక్రమార్క. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లితో సినీజోష్ ఇంటర్వ్యూ..

>శ్రీ సారిపల్లి గారూ.. మీ  గురించి చెప్పండి?

మాది విజయవాడ పుట్టిందీ, పెరిగిందీ అక్కడే. విజయవాడలో 22 ఏళ్లు ఉన్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. యూనివర్సల్ స్టూడియోస్ లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేశా. నాలుగేళ్లు అక్కడి ఇండిపెండెంట్ సినిమాలకు పని చేశా. తర్వాత ఇండియా వచ్చి వీవీ వినాయక్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో జాయినయ్యా. మా బంధువు ఒకాయనకి థియేటర్ ఉంది. ఆయనకు వినాయక్ గారు తెలుసు. అలా వెళ్లి కలిశా. నాయక్, అల్లుడు శీను తదితర సినిమాలకు పని చేశా. ఇప్పుడు రాజా విక్రమార్క తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను.

>రాజా విక్రమార్క కథేంటి?

ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. క్రమశిక్షణ లేకపోవడం వలన ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. ఎంటర్టైన్మెంట్, యాక్షన్.. అన్నీ ఉంటాయి. యాక్షన్ అంటే ఇరవైమందిని కొట్టడం టైప్ కాకుండా కొత్తగా, కథలో భాగంగా ఉంటుంది. మిషన్ ఇంపాజిబుల్ స్ఫూర్తిగా తీశా.

>ఎన్ఐఏ నేపథ్యంలో సినిమా అంటే యాక్షన్ ఎక్కువ ఉంటుంది. అందులో కామెడీ ట్రాక్ రాయడానికి భయపడ్డారా?

బేసిగ్గా.. హ్యూమర్ ఫ్యాక్టర్ ఉండేలా చూసుకున్నాను. నేను సిబిఐ కాలనీ పక్కన ఉండేవాడిని. కిటికీలోంచి చూస్తే ఓ కుర్రాడు కనిపించేవాడు. నేను అతను డ్రైవర్  లేదా చిన్న పోస్టులో పనిచేసే వ్యక్తి అయ్యి ఉంటాడని అనుకున్నాను. తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణగారి బృందంలో కీలక సభ్యుడు అని తెలిసింది. నేను అనుకున్నట్టు చాలామంది అనుకుని ఉంటారు కదా! ఆ కోణంలో సన్నివేశాలు రాశా. కామెడీ అంటే సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది. క్యారెక్టర్లు జోకులు వేయవు. ఆ సందర్భాలు చూస్తే ప్రేక్షకులకు నవ్వు వస్తుంది.

>కరోనా టైమ్ లో సెకండాఫ్ మార్చారని..

అలా ఏమీ చేయలేదండీ. కథలో కొంచెం బెటర్ మెంట్ చేశాం.   

>కథ రాసేటప్పుడు కార్తికేయను హీరోగా అనుకున్నారా?

యంగ్ హీరో ఎవరినైనా తీసుకుంటే బావుంటుందని అనుకున్నాను. రెండు మూడు ప్రయత్నాలు చేశా. ఆర్ఎక్స్ 100 టైమ్ లో కార్తికేయను చూశా. లుక్ సెట్ అవుతుందని అనుకున్నాను. తర్వాత మేం అనుకున్న క్యారెక్టర్ లో ఉన్న టైమింగ్ అతనిలో ఉందని తెలిసింది. కథ చెప్పాను. తనకి నచ్చింది. ముందు కార్తికేయ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాడు. క్రియేటివ్ గా, కమర్షియల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది.  సినిమా తీయడానికి రెండేళ్లు పట్టినా.. షూటింగ్ చేసింది 70 రోజులే.

>సెకండాఫ్ 36 గంటల్లో జరుగుతుందని విన్నాం!

అవునండీ! సెకండాఫ్ 36 గంటల్లో జరుగుతుంది. రేసీగా ఉంటుంది.

>ఆర్ఎక్స్ 100 టైమ్ అంటే.. మీరు కథ రాసినప్పుడు ఎన్ఐఏ నేపథ్యంలో ఎక్కువ కథలు రాలేదు. తర్వాత వచ్చాయి కదా!

అవును. అయితే, ఆయా సినిమాల్లో చూపించిన పెద్ద పెద్ద సమస్యలు నేను చూపించలేదు. చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగని, ఏదో చెవిలో పువ్వు పెట్టినట్టు ఏమీ చేయలేదు. ఎన్ఐఏ ఏజెంట్లు తీవ్రవాదులు మీద మాత్రమే కాదు, లోకల్ గానూ వర్క్ చేస్తారు. మా సినిమాలో దేశంలో సమస్య మీద ఎన్ఐఏ పోరాడుతుంది.

>రాజా విక్రమార్క కంటే ముందు వేరే టైటిల్ అనుకున్నారట!

మా దగ్గర ఉన్న టైటిళ్లలో ఇదే బెస్ట్ ఆప్షన్. అందులో నో డౌట్. చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకోవడం కాదు కదా! దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలి కదా! అందుకని, ఆలోచించా. హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ కు రాజా విక్రమార్క సూటవుతుందని పెట్టేశాం.

>తాన్యా రవిచంద్రన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

హోమ్ మినిస్టర్ కుమార్తెగా కనిపిస్తారు. క్లాసికల్ డాన్సర్ కూడా! ఇండిపెండెంట్ అమ్మాయిలా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఆమె క్లాసికల్ డాన్సర్. పశుపతి, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సుధాకర్ కోమాకుల.. ప్రతి ఒక్కరి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది.

>ప్రశాంత్ ఆర్. విహారిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడానికి కారణం?

న్యూ ఏజ్ మ్యూజిక్ కోసమే! ఆయన ఇప్పటివరకూ ఇటువంటి జానర్ సినిమా చేయలేదు. అందుకని, అడిగా.. ఈ జానర్ కు సెట్ అయ్యేలా చేస్తారా? అని! ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. రీ రికార్డింగ్ కూడా బాగా చేశారు.

>వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు?

ఏ జానర్ సినిమా చేసినా.. అందులో ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. నెక్ట్ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది. లాక్ డౌన్ లో రాశా.

Director Sri Saripalli Interview:

Raja Vikramarka Release Nov12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs