Advertisement
Google Ads BL

మెహరీన్ ఇంటర్వ్యూ


సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో వస్తున్న  సినిమా మంచి రోజులు వచ్చాయి. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు వస్తున్న ఈ  సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధమైన సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్  మీడియాతో మాట్లాడారు

Advertisement
CJ Advs

యువి క్రియేషన్స్, యస్.కె.యన్, మారుతీ గార్ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది చాలా మంచి సబ్జెక్టు మారుతి గారు కాన్సెప్ట్  చాలా బాగుంటాయి .నా లైఫ్ లో  కనెక్ట్ అయిన ఫస్ట్ మూవీ ఇది.ఇంత మంచి టీం తో  చాలా ఎంజాయ్ చేస్తూ..వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాలో  పద్దు క్యారెక్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పాత్ర చేస్తున్నాను.ఈ సినిమాన మారుతి గారు స్టైల్ లో ఫుల్ ఎంటర్టైనర్ జోనర్లో ఉంటుంది.

ఇది ఒక కాలనీలో జరిగే కథ ఇది.ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి.అలాంటి స్టోరీని కథగా తీసుకొని ఎంటర్టైన్మెంట్ రూపకంగా ప్రేక్షకులకు చూపించడం జరుగుతుంది.ఈ సినిమాలో మేము చూయించిన సీన్స్, స్విచ్వేషన్స్ కోవిడ్ టైం లో చాలా మందికి జరిగాయి. .

నేను చేసిన F2, F3 సినిమాలలో చేసిన పాత్రలకంటే ఇందులో నేను చేస్తున్న పాత్ర డిఫరెంట్. నేను నార్మల్గానే చాలా ఫన్నీగా ఉంటాను. అందువల్ల నేను చేసే క్యారెక్టర్స్ లలో అల్లరి అయినా, కామెడీ అయినా చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది.ఇందులో కూడా నా క్యారెక్టర్ మంచి ఎమోషన్స్ తో ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్యాకేజ్డ్ గా  ఉంటుంది.

సంతోష్ నటన పరంగా చాలా బాగా పెర్ఫార్మన్స్  చేశాడు. అజయ్ ఘోష్ గారు ఫాదర్ గా నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ లో అజయ్ గారు ఇలా అందరూ కూడా చాలా  బాగా పెర్ఫార్మ్ చేశారు.క్యారెక్టర్ పరంగా నాకే డౌట్ ఉన్న మారుతి గారి దగ్గరికెళ్లి  సలహాలు తీసుకున్నాను. అందువల్ల నేను చాలా ఈజీ చేయగలిగేదాన్ని

కథ మీద నమ్మకంతో  యు.వి.క్రియేషన్స్ మారుతి గారి మీద నమ్మకంతో ఈ కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ లాంటి సినిమా తర్వాత ఇందులో నాకు ఇది మంచి రోల్ ఇచ్చారు. నేను చేసే ప్రతి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలుగానే భావిస్తాను.

కోవిడ్ టైంలో కూడా కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తూ మేము సినిమా షూట్ చేయడం జరిగింది. అలాగే

కోవిడ్ కారణంగా చాలా మంది హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా వున్నాను.నాకు మా మదర్ కి కోవిడ్ వచ్చింది. వన్ మంత్ తర్వాత మేము రికవరీ అయ్యాము. ఈ సినిమా కోసం మేమంతా కష్టపడి చేశాము సినిమా బాగా వచ్చింది.నా గురించి సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ ను పాజిటివ్ అయినా నెగటివ్ అయినా  ఈక్వల్ గా తీసుకుంటాను.

మహానటి లో చేసిన కీర్తి సురేష్ క్యారెక్టర్ ,ఓ బేబీ సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నాకు చేయాలని ఉంది. కన్నడలో శివరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.ఆ సినిమా అయిన తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని స్టోరీస్ వింటున్నాను. వాటిని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని అన్నారు.

Mehreen Kaur Interview:

Mehreen Kaur Interview about Manchi Rojulu Vachayi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs