Advertisement
Google Ads BL

హీరో ఆదిత్ అరుణ్ ఇంటర్వ్యూ


కథ, తుంగభద్ర, 24 కిస్సెస్, 11 అవర్ లాంటి చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు  అదిత్ అరుణ్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా డియర్ మేఘ సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన డియర్ మేఘ. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అరుణ్ ఆదిత్ తన కెరీర్ తో పాటు సినిమా విశేషాలనుమీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ....

Advertisement
CJ Advs

మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్. నాకు రైటింగ్ అంటే ఎంతో ఇష్టం వున్నా కూడా నటుడు కావాలనే కోరిక మాత్రం బాగా ఉండేది. తరువాత నాకు చెన్నైలో పెద్ద కాలేజ్ లో జర్నలిజం లో సీట్ వచ్చింది. అలా చదువుతున్న టైంలోనే నాకు నటుడుగా అవకాశం వచ్చింది. 2009లో కెరియర్ స్టార్ట్ చేసిన నేను గత 12 సంవత్సరాలు గా ఎన్నో సినిమాలు చేసినా గరుడ వేగ, 24 కిస్సెస్, చీకటి

గదిలో చితక్కొట్టుడు నాకు కమర్షియల్ గా మంచి హిట్ సాధించింది. 24 కిస్సెస్ కూడా ఐదు లాంగ్వేజ్ లో డబ్ చేసిన ఈ సినిమా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది

కోవిడ్ టైం లో నేను తమన్నా గారితో 11th అవర్ సినిమా చేశాను. కోవిడ్ చాలామందికి కొన్ని విషయాలు తెలిసేలా చేసింది. దాని వల్ల ఎంతోమంది చాలా నేర్చుకున్నారు. ఈ టైం లో నాకు డియర్ మేఘ స్క్రిప్ట్ వచ్చింది. లక్కీగా మేము విడుదల చేసే టైం కు పెద్ద సినిమాలు లేవు. ప్రేక్షకులు మా సినిమా చూసే అవకాశం ఉంది.

చీకటి గదిలో.. సినిమా ద్వారా అడల్ట్ కంటెంట్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్ట్ అయ్యారు అంటున్నారు. కానీ మేము ఏ సినిమా కూడా మేము ఒక వర్గానికిసంబంధించిన ఆడియన్స్ కొరకు  సినిమా చేయను. నేనొక నటుడుని మాత్రమే ఏ కథ పాత్ర అయినా అది బిచ్చగాడు, ప్రెసిడెంట్ ఇలా ఏ పాత్ర వస్తే అది చేస్తాను. ఇపుడు వచ్చే డియర్ మేఘ" తో నాకున్న ట్యాగ్ పోతుందని అనుకుంటున్నాను. అలాగే  నెక్స్ట్ వచ్చే WWW కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తే ఏమనుకుంటుంది అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి  చూస్తే ఎలా ఉంటుంది. అబ్బాయి సైడ్ నుంచి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మాయి సైడ్ నుంచి కూడా కల వస్తూ ఉంటుంది. ఈ కథ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. లవ్ స్టోరీస్ లను పెద్ద గ్రాండ్ గా  చేయాల్సిన అవసరం లేదు ఫీలయ్యే లా చూపిస్తే చాలు .

దర్శకుడు సుశాంత్  నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. మా మధ్య మంచి రిలేషన్. తను చేసిన సినిమా కూడా చూశాను. తరువాత బిజీ వల్ల కలవ లేకపోయాను. అయితే టు ఇయర్స్ బ్యాక్ మళ్లీ నన్ను కలిసి తను రాసుకున్న రెండు కథల్లో ఒక కథ చెప్పాడు.  తను రాసిన కథ కాకుండా ఆపోజిట్ గా ఉండే కథ నచ్చడంతో మంచి నిర్మాతలు దొరికారు దాంతో సినిమా షూట్ మొదలుపెట్టాం. సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో షూట్ చేశాము ఆరు నెలల్లో సినిమా పూర్తి అయి ఈ రోజు డియర్ మేఘ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా నా కెరీర్ లోచాలా ఇంపార్టెంట్ మూవీ.

నేను ఇప్పటి వరకు నేను ఎక్స్ట్ ట్రీమ్ లవ్ స్టోరీస్ చేశాను. ఈ సినిమాతో చాలా పాజిటివ్ లవ్ స్టోరీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కంటే ఇది పాజిటివ్ సినిమా. డియర్ మేఘ టైటిల్ పెట్టేటప్పుడు అమ్మాయి పేరు పెడతాము నీకు ఒకే నా అని అడిగాడు దర్శకుడు. అయితే నేను నాకు కథ ఇంపార్టెంట్ టైటిల్ కాదు అని చెప్పడంతో హీరోయిన్ పేరు మీద ఈ టైటిల్పె ట్టడం జరిగింది. డియర్ మేఘ అని తనకు తను రాసుకొదు కదా అలా నేను రాస్తే బాగుంటుంది. అందుకే నాకు ఈ టైటిల్ నచ్చి ఒకే చేశాము.

ప్రస్తుతం WWW, కథ కంచికి మనం ఇంటికివంటి నాలుగు, ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Hero Arun Adith Interview:

Arun Adith Dear Megha Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs