Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: ‘సుల్తాన్’‌ దర్శకుడు


కార్తి, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సుల్తాన్’‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్‌) కీల‌క పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న సినిమా రిలీజ్ అవుతుంది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ఇంటర్వ్యూ

Advertisement
CJ Advs

మీ గురించి చెప్పండి?

తొలుత సుందర్‌ .సి దగ్గర దర్శకత్వ శాఖలో చేరా. ‘కలగలప్పు’ సినిమా చేశా. ఆ తర్వాత అట్లీ దగ్గర ‘రాజా రాణి’కి పని చేశా. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ‘రెమో’తో దర్శకుడిగా పరిచయమయ్యా. ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. దర్శకుడిగా నా రెండో సినిమా ‘సుల్తాన్‌’

‘సుల్తాన్‌’ సినిమా కథేంటి?

తన స్వభావానికి ఏమాత్రం సంబంధం లేని వందమందితో హీరో ఎటువంటి ప్రయాణం చేశాడన్నది కథ. తనకు ఎదురైన పరిస్థితులను హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడనేది సినిమా. వందమందికి, హీరోకి మధ్య సంబంధం ఆసక్తికరంగా ఉంటుంది.

హీరో పాత్ర ఏమిటి?

రొబోటిక్స్‌ ఇంజినీర్‌ పాత్రలో కార్తి కనిపిస్తారు. ముంబయ్‌లో ఉండే హీరో పల్లెకు ఎందుకొచ్చాడు, ఏం చేశాడు, ఎటువంటి త్యాగం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విని కార్తి ఏమన్నారు?

ఆయన సూపర్‌ హ్యాపీ. లైన్‌ విని ఎగ్జైట్‌ అయ్యారు. ‘తన క్యారెక్టర్‌కి అపోజిట్‌ అయిన వందమందితో హీరో చేసే ప్రయాణమే’ అని స్టోరీలైన్‌ చెప్పిన వెంటనే ఓకే చెప్పారు. బౌండ్‌ స్ర్కిప్ట్‌ వినకుండా కార్తి సార్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోరు. కానీ, నేను చెప్పిన లైన్‌ విని ఓకే చేయడం నా ఫస్ట్‌ సక్సెస్‌ అనుకున్నా. ఇరవై నిమిషాలు నేరేషన్‌ ఇచ్చిన తర్వాత మరింత ఎగ్జైట్‌ అయ్యారు. ‘నేను చేస్తున్నా’ అని మాట ఇచ్చారు.

ఈ సినిమాతో కోలీవుడ్‌కి రష్మిక ఇంట్రడ్యూస్‌ అవుతున్నారు. ఆమెను సెలక్ట్‌ చేయడానికి రీజన్‌?

‘సుల్తాన్‌’కి ముందు తమిళ్‌లో రష్మిక సినిమాలు చేయలేదు. కానీ, ఆమె అక్కడ చాలా పాపులర్‌. కన్నడ సినిమా ‘కిరిక్‌ పార్టీ’లో సాంగ్స్‌ చూసి తమిళనాడులో ఆమెకు క్రేజీ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఫస్ట్‌ డెబ్యూ మా సినిమా కావడం హ్యాపీ. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో స్టోరి ఇది. హ్యాపీగా యాక్సెప్ట్‌ చేశారు.

ఆమె క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?

జస్ట్‌ సాంగ్స్‌, డ్యాన్స్‌ కోసం రష్మికను తీసుకోలేదు. ఆమెది మంచి రోల్‌. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఓ అమ్మాయి. బాగా చదువుకున్న అమ్మాయి. ఊరిలో అందరికీ సహాయం చేసే మంచి గుణం ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. వ్యవసాయం నేపథ్యంలో కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ వీడియో రష్మిక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వైరల్‌ అయ్యింది. కార్తి, రష్మిక మధ్య సీన్లు ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెష్‌గా, క్యూట్‌ రొమాంటిక్‌గా ఉంటాయి.

‘కె.జి.ఎఫ్‌’ విలన్‌ రామచంద్రరాజు రోల్‌ ఏంటి?

‘కె.జి.ఎఫ్‌’ చూసి ఆయన్ను సెలక్ట్‌ చేశాం. రూపంతో విలనిజం చూపించగల వ్యక్తి. అందుకని తీసుకున్నాం. ఇందులో ఆయన ఒక్కరే మెయిన్‌ విలన్‌ కాదు. మల్టిపుల్‌ విలన్స్‌ ఉంటారు. విలన్స్‌ ఎవరనేది ప్రేక్షకులకు పజిల్‌.

షూటింగ్‌ ఎక్కడ చేశారు?

చెన్నై, పొల్లాచ్చి, దిండికల్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. పాలక్కడ్‌లో మూడు రోజులు చేశాం.

ఏ ప్రాంతం నేపథ్యంలో కథ జరగుతుంది?

తెలుగులో అమరావతి నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ ఓ చిన్నఊరిలో జరుగుతుంది. తమిళంలో సేలంలో జరిగినట్టు చూపిస్తున్నాం.

కొవిడ్‌ వల్ల సినిమాలు మార్పులు చేశారా?

ఏం చేయలేదు. కొవిడ్‌ తర్వాత ప్యాచ్‌ వర్క్‌ షూటింగ్‌ చేశాం. బౌండ్‌ స్ర్కిప్ట్‌ రెడీగా ఉంటేనే కార్తి సార్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. నేను కూడా అంతే. కంప్లీట్‌ స్ర్కిప్ట్‌, ఫ్రేమ్స్‌ డిసైడ్‌ చేశాక షూటింగ్‌కి వెళ్తా.

ప్రొడ్యూసర్స్‌ గురించి?

మోస్ట్‌ కంఫర్టబుల్‌, సెన్సిబుల్‌ ప్రొడ్యూసర్స్‌. సినిమాకు ఏం కావాలన్నా వద్దని చెప్పరు. ఖర్చుకు వెనుకాడరు. ఇంకా బాగా చేయాలని చూస్తారు. ఫిల్మ్‌ మేకింగ్‌లో అన్ని క్రాఫ్ట్స్‌ గురించి నాలెజ్డ్‌ ఉంది.

తెలుగు సినిమాలు చూస్తారా?

రాజమౌళి సార్‌కి నేను పెద్ద ఫ్యాన్‌. ‘బాహుబలి’ అంటే ఎంతో ఇష్టం. ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. సాధారణంగా నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తా. తెలుగులో కమర్షియాలిటీ నాకెంతో నచ్చుతుంది.

sultan director bakkiyaraj kannan interview:

bakkiyaraj kannan talks about sulthan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs