Advertisement
Google Ads BL

‘వైల్డ్‌ డాగ్‌’లో ఇరగ్గొట్టేశా: హీరోయిన్ సయామి ఖేర్‌


కింగ్‌ నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఏప్రిల్‌ 2 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సయామి ఖేర్‌ మీడియాకు సినిమా విశేషాలను తెలిపింది.

Advertisement
CJ Advs

 

‘‘ఈ సినిమాలో నేను ‘రా’(రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌ ఆర్యా పండిట్‌ పాత్రలో నటించాను. దర్శకుడు సాల్మన్‌ ద్వారా వైల్డ్‌డాగ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాగ్‌సార్‌ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ) ఏజెంట్‌ విజయ్‌ వర్మ పాత్రలో కనిపిస్తారు. ‘రా’ ఏంజెట్‌ అయిన నేను నాగ్‌సార్‌ లీడ్‌ చేస్తున్న ఎన్‌ఐఏ టీమ్‌తో ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

 

నాగ్‌సార్‌కి నేను పెద్ద అభిమానిని. ఆయన శివ సినిమా చూశాను. కానీ ఆయన సినిమాల్లో నా ఫేవరెట్‌ ‘గీతాంజలి’. ఈ సినిమాకు ముందు నాగ్‌సార్‌ని నేను కలవలేదు. ఈ సినిమా షూట్‌ కోసం కలిశాను. ఓ ఉగ్రవాదిని విచారంచే ఓ సన్నివేశం మా ఇద్దరి కాంబినేషన్‌లో ఉంటుంది. మొదట్లో నాగ్‌సార్‌ అనగానే నేను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నాగ్‌సార్‌ సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. అందరూ ఆయనతో కంఫర్ట్‌ ఫీల్‌ అవుతారు. ఓ సారి నాగ్‌సార్‌ ఇంటి నుంచి బిర్యానీ తెచ్చారు. ఆ ఫుడ్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. అలీ రెజా కూడా మంచి కో స్టార్‌. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు కూడా బాగా హెల్ప్‌ చేశారు.

 

ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర గురించి చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. సాధారణంగా హీరోయిన్‌ పాత్రలకు పెద్దగా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండవు. కానీ ఈ సినిమా నాకు చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. నాగ్‌సార్‌తో కూడా ఓ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యత ఉంది. స్పోర్ట్స్‌ అంటే చాలా ఫిట్‌నెస్‌తో ఉండాలి. ఆ ఫిట్‌నెస్‌ నాకు ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లలో ఇరగ్గొట్టేసేందుకు ఉపయోగపడింది. అంతేకాదు ఈ సినిమా కోసం నేను ముంబైలో మార్షల్స్‌ ఆర్ట్స్‌లో నెలరోజులు ప్రత్యేకశిక్షణ తీసుకున్నాను. వైల్డ్‌డాగ్‌ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి.

 

ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సెట్‌లోని కొందరు తెలుగులో మాట్లాడేవారు. అలా నాకు తెలుగు కొంచెం అర్ధమవుతుంది. ప్రతి యాక్టర్‌కు కొందరితో వర్క్‌ చేయాలని ఉంటుంది. హీరోస్‌లో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. వారితో పనిచేయాలని ఉంది. అలాగే దర్శకుల్లో రాజమౌళి, మణిరత్నం నా ఫేవరెట్‌. తరుణ్‌భాస్కర్‌ డైరెక్ట్‌ చేసిన పెళ్ళిచూపులు సినిమా బాగా నచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఓ వెబ్‌ షో, హాట్‌స్టార్‌లో ఓ వెబ్‌సిరీస్‌ ఒప్పుకున్నాను. నేను చేయబోయే హిందీ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. నేను సౌత్‌లో చేయబోయే ప్రాజెక్ట్స్‌ గురించి త్వరలో చెబుతాను’’ అని చెప్పుకొచ్చింది.

Heroine Saiyami Kher Interview About Wild Dog Movie:

Saiyami Kher talks About Wild Dog Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs