Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: పైసా పరమాత్మ దర్శకుడు విజయ్ కిరణ్


యువకులు, బ్రహ్మ తో క్రియేటివ్ స్టార్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కిరణ్ తిరుమల కొంతకాలం గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి రీసెంట్ గా పైసా పరమాత్మ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. మార్చి 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది.. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల పత్రికలవారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు.. 

Advertisement
CJ Advs

దర్శక నిర్మాత విజయ్ కిరణ్ తిరుమల  మాట్లాడుతూ.. పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది.  సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మేము అనుకున్న ధియేటర్స్ కన్నా ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నటీనటులు అందరూ సూపర్బ్ గా నటించారు. క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఈ సందర్బంగా మా టీం అందరికీ నా స్పెషల్ థాంక్స్. అలాగే నేను కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇద్దరు వ్యక్తులు వున్నారు. మా అమ్మా, నాన్న. ఇంకోటి మా గురువుగారు. వాళ్ళ వల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ఈ సినిమా నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్  స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చుసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి  వేశారు. అంటే నేను సక్సెస్ అయినట్టే అని నా ఫీలింగ్. ఫ్రెష్ విజువల్స్ తో కొత్త కంటెంట్ వున్నా మా పైసా పరమాత్మ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. పూరి జగన్నాద్, త్రివిక్రమ్, కృష్ణ వంశీ గారు వాళ్ళ మార్క్ ఏంటో క్రియేట్ చేసుకున్నారు. అలా నాకంటూ నా స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. క్యారెక్టర్స్ ఎలివేషన్ హైలెట్ గా చూపించడం జరిగింది. ఆర్టిస్టుల దెగ్గరనుండి పాత్రకు తగ్గట్లు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాను. అన్ని ప్రధాన పాత్రలు బాగా ఈ చిత్రంలో పండాయి. టైటిల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో సినిమాకి కూడా అంతే హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ఓటిటి లో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక నుండి నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి టయ్యప్ అయి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా వున్నాయి.. ప్రాపర్ గా అవి బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరపాలి. మా లక్ష్మి సుచిత్ర బ్యానర్ లో కొత్త కంటెంట్ వున్నా అన్ని జోనర్ మూవీస్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. నా జీవితం అంతా సినిమానే.. సినిమా అంటే నాకు విపరీతమైన ఇష్టం. మంచి స్టార్ కాస్ట్ తో బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేయాలనీ దర్శకుడిగా నా గోల్. త్వరలో డి యమ్ కే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ కాఫ్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాను.. అన్నారు.

Director Vijay Kiran Interview:

Paisa Paramatma&nbsp;Director Vijay Kiran Interview <h1></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs