Advertisement
Google Ads BL

ఎక్స్‌ప్రెస్ తెచ్చే తీరుతుంది సక్సెస్


A1 ఎక్స్‌ప్రెస్ అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి: హీరో  సందీప్ కిషన్ 

Advertisement
CJ Advs

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం A1 ఎక్స్ ప్రెస్. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం మార్చి 5న అత్యధిక థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ, కెమెరామెన్ కమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.. 

చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను మాట్లాడుతూ.. డే వన్ నుండి మా టీమ్ అంతా 200% పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన సినిమా ఇది. 14 మంది న్యూ టెక్నీషియన్స్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. బిగ్ స్కేల్ లో తెరకెక్కిన న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ఇది. ఇలాంటి మూవీ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతలకు, హీరో సందీప్ కిషన్ కు థాంక్స్. ఒక గేమ్ ఆడేటప్పుడు వాళ్లలో టాలెంట్ వున్న వారిని ఎంకరేజ్ చేయాలి తప్పితే.. డబ్బు ఉన్నోడి పాకెట్ లో కాదు.. అనే విష‌యాన్ని ఈ చిత్రంలో చూపించాం. అన్ని ఎమోషన్స్ వున్న చిత్రమిది. ప్రతిదీ ఆర్గానిక్ గా సెట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా వున్నాయి అన్నారు. 

కెమెరామెన్ కమ్రాన్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిలిం. నిజమైన పాజిటివ్ ఎనర్జిటిక్ మూవీ. సినిమా స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేశారు. ది బెస్ట్ మూవీకి వర్క్ చేశాం. సందీప్ కిషన్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. తన బాడీ లాంగ్వేజ్, స్టయిల్ అంతా కొత్తలుక్ లో కనిపిస్తారు. సినిమా కోసం చాలా ఎక్సయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాను అన్నారు. 

ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ శివ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి మూవీలో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా భాగమైనందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్ గారికి జీవితాంతం రుణపడి వుంటాను. కథని, సందీప్ కిషన్ ని నమ్మి వివేక్, అభిషేక్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలో ఈ చిత్రం ఒక ప్రెస్టీజియస్ ఫిలిం గా నిలుస్తుంది. మిడిల్ క్లాస్ స్పోర్ట్స్ ఫ్యామిలీస్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. 

నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా నంబరాఫ్ ధియేటర్స్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విజువల్ గా ఈ చిత్రం చాలా గ్రాండియర్ గా ఉంటుంది అన్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబోట్ల మాట్లాడుతూ.. కథపై నమ్మకంతో అందరం కలిసి ఒక మంచి ప్రయత్నం చేశాం. ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. 

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ మాట్లాడుతూ.. యంగ్ టాలెంటెడ్ టీమ్ అంతా కలిసి ది బెస్ట్ సినిమా చేశారు.. రేపు లాట్ ఆఫ్ స్క్రీన్స్ లలో రిలీజ్ చేస్తున్నాం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. పదకొండు, పండేండు ఏళ్ళ నా ఈ సినీ ప్రయాణంలో నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు, దర్శకులకు నా ధన్యవాదాలు. ఇది నా ఇరవై ఐదవ చిత్రం. చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి కథని నమ్మి తీసిన మాతోటి నిర్మాతలకు కృతఙ్ఞతలు. వాళ్ళే నాకు దేవుళ్ళు. హాకీ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మాసివ్ ఎంటర్టైనర్ ఇది. పేట్రియాటిజం వుండే హాకీ గేమ్ ని ఇండియన్స్ అందరూ బాగా చూస్తారు. అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఏవన్ ఎక్స్ ప్రెస్ మూవీ చేయడం నా అదృష్టం. అందరూ ఇది మా చివరి సినిమా అనుకొని చేశాం. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేమంతా శాటిస్ పై అయ్యాం. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాం.  వరంగల్ లో వుండే రాకేష్ కొంత మందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు.. వాళ్లకి సరైన సదుపాయాలు లేవు. మా వంతు వాళ్లందరికీ ఆర్థిక సహాయం చేసి తోడుంటాం. అలాగే ఈ చిత్రం ద్వారా నాకు వచ్చే లాభాల్లో  పిల్లల చదువులకు వినియోగిస్తాను అన్నారు

A1 Express to be released on 05th march:

A1 Express release press meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs