Advertisement
Google Ads BL

అతిగా ప్రేమించ‌డం హానిక‌ర‌మే -హీరో శ్రీ


అతిగా ప్రేమించ‌డం కూడా హానిక‌ర‌మే అని చెప్పే `ప్రణవం` -హీరో శ్రీ మంగం

Advertisement
CJ Advs

ఈ రోజుల్లో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫ‌స్ట్ సినిమాతోనే బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నాడు శ్రీ మంగం. ఇక కొంత గ్యాప్ త‌ర్వాత ప్రణవం లాంటి  డిఫ‌రెంట్ కాన్సెప్ట్, టైటిల్ తో వ‌స్తున్నాడు. చరిత‌ అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా కుమార్. జి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌ను.ఎస్ నిర్మాత‌. ఈ చిత్రం ఈ నెల 5న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ మంగం సినేజోష్ తో మాట్లాడారు. ఆ విశిషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

చాలా గ్యాప్ త‌ర్వాత  సినిమా చేస్తున్నారు క‌దా ప్ర‌ణవం  క‌థ‌ను ఎన్నుకోవ‌డానికి రీజ‌న్‌?

అంటే నా తొలి సినిమాల్లో  కాలేజ్ గోయింగ్, బాయ్ నెక్ట్స్ డోర్ పాత్ర‌లు చేశాను. కానీ ఈ సినిమా అలా కాదు. చాలా మెచ్యూర్డ్ లుక్‌తో  మ్యారిడ్ క‌పుల్ గా న‌టిస్తున్నాను.   నాలో కానీ, బాడీ లాంగ్వేజ్ లో కానీ అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయి.  నా క్యార‌క్ట‌ర్ తో పాటు సినిమా కంటెంట్ కూడా న‌చ్చ‌డంతో ప్ర‌ణ‌వం సినిమా చేశాను.  క‌చ్చితంగా నాకు ఈ సినిమా ప్ల‌స్ అవుతుంద‌ని న‌మ్ముతున్నా.

ప్ర‌ణ‌వం క‌థ గురించి చెప్పండి?

భ‌గ‌వంతుడు మ‌న‌కు ఎన్నో వ‌రాలు ఇచ్చాడు. ఆడ‌వాళ్లు కూడా అందులో ఒక‌టి.  అటువంటి  ఆడ‌వారికి హాని త‌ల‌పెట్ట‌కుండా చూసుకున్నంత కాలం మ‌న జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే వారికి హాని త‌ల‌పెట్టాల‌ని భావిస్తామో   మ‌నంద‌రి జీవితాలు చిన్నాభిన్న‌మ‌వుతాయి అనేది మా చిత్రంలో చూపించాం.  ఆడ‌వారిని ప్ర‌కృతితో పోలుస్తాం కాబ‌ట్టి.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. ఎప్పుడైతే మ‌నం ప్ర‌కృతికి మ‌నం హాని త‌ల‌పెడ‌తామో అప్పుడు ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌విస్తుంటాయి.. అలాంటిదే మా సినిమా క‌ధాశం అని చెప్ప‌వ‌చ్చు.  

ప్ర‌ణవంలో మీ పాత్ర స్వ‌భావం ఎలా ఉంటుంది?

ఇందులో నేను  ప్లే బాయ్ పాత్ర‌లో న‌టించాను. ఒక అమ్మాయి న‌న్ను అతిగా ప్రేమించ‌డం వ‌ల‌న నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనేది నా పాత్ర‌. కొన్ని కొన్ని సార్లు సిట్యుయేష‌న్స్ ని బ‌ట్టి నా పాత్ర నెగిటివ్ గా కూడా అనిపిస్తుంది. అది ఎలా అన్న‌ది మాత్రం మీరు తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ద‌ర్శ‌క నిర్మాత‌ల  ప‌నితీరు ఎలా ఉంది?

ముఖ్యంగా మా డైర‌క్ట‌ర్ చెప్పిన స్ర్కీన్ ప్లే నాకు బాగా న‌చ్చింది. ఎందుకంటే ఇది చాలా డెలికేట్ పాయింట్.  డెలికేట్ పాయింట్ ని డీల్   చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.  ఈ విష‌యంలో  మా డైర‌క్ట‌ర్ స‌క్సెస్ అయ్యారని చెప్ప‌వ‌చ్చు.  త‌న‌కిది తొలి సినిమా అయినా ఎక్క‌డా ఆ ఫీలింగ్ ఉండ‌దు. ఎంతో ఎక్స్ పీరియ‌న్స్ డ్ డైర‌క్ట‌ర్ లా సినిమా  తీశారు. ప్ర‌తి విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అలాగే మా నిర్మాత త‌ను గారూ కూడా నిర్మాత‌లా కాకుండా ఒక వ‌ర్కర్ లా ఈ సినిమా కోసం శ్ర‌మించారు. సినిమా అంటే మా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు విప‌రీత‌మైన ప్యాష‌న్. వీరిద్ద‌రికీ ఈ సినిమా స‌క్సెస్ సాధించి మ‌రెన్నో సినిమాలు నిర్మించే అవ‌కాశం మా ప్ర‌ణవం చిత్రం ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా.

ప్ర‌ణ‌వం పై ఎలాంటి హోప్ తో ఉన్నారు?

క‌చ్చితంగా ఈ సినిమాతో ప‌ది సినిమాలు వ‌స్తాయన్న న‌మ్మ‌కం ఉంది. హీరోగా కాక‌పోయినా విల‌న్ గా అయినా అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. ఎందుకంటే ప్ర‌ణవంలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాను కాబ‌ట్టి. కథ‌కి ఇంపార్టెన్స్ ఉన్న ఏ క్యార‌క్ట‌ర్ అయినా నేను చేయ‌డానికి సిద్ధంగా ఉన్నా. 

స‌హ న‌టుల గురించి చెప్పండి?

శశాంక్, జెమిని సురేష్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. అలాగే నా వైఫ్ గా న‌టించిన అవంతిక‌, మ‌రో హీరోయిన్‌గా న‌టించిన గాయ‌త్రి కూడా మంచి ప‌ర్ఫార్మెన్స్  క‌న‌బ‌రిచారు.

ప్ర‌ణ‌వం ద్వారా ఏమైనా సందేశాన్ని ఇస్తున్నారా, దీనికి ఇనిస్పిరేష‌న్ ఏమైనా ఉందా?

నేను చేసే కాన్సెప్ట్ ఏదైనా స‌రే, స‌మాజానికి కానీ, ప్ర‌తి మ‌నిషి రిలేటెడ్ చేసుకునే విధంగా గానీ  ఉంటాయి. ప్ర‌ణ‌వం సినిమాలో కొన్ని సీన్స్ ఆల్ రెడీ పెళ్లైన జంట‌ల‌కు డైర‌క్ట్ గా త‌గిలే విధంగా ఉంటాయి.   ప్ర‌తి ఒక్క‌రూ రిలేట్ చేసుకునేలా మా సినిమాలోని పాత్ర‌లుంటాయి.  మ‌న చుట్టూ ఉన్న స‌మాజంలో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య  జ‌రిగే నిజ సంఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని రాసుకున్న క‌థ త‌ప్ప ఏ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ కాదు మా సినిమా. అతి ప్రేమ కూడా హానిక‌ర‌మే అనే సందేశాన్ని అంత‌ర్లీనంగా చెబుతున్నాం.

సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?

మా సినిమాకు పద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్ పాట‌లు, నేప‌థ్య సంగీతంతో పాటు మ‌ర్గ‌ల్ సినిమాటోగ్ర‌ఫీ హైలెట్ గా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పిక్చ‌రైజ్ ప‌రంగా కూడా బాగా కుదిరాయి పాట‌లు. ముఖ్యంగా ఆర్‌పి ప‌ట్నాయ‌క్ గారు, ఉష గారు పాడిన పాట సినిమాకు మెయిన్ ఎస్సెట్. 

Hero Sri Cinejosh Interview:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Pranavam Movie Released on 5th</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs