జానూ, బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ - ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్స్ గా నూతన దర్శకుడు వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఈ సినిమా నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ వర్ష బొల్లమ్మతో సినీజోష్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ..
నమస్తే వర్షగారు..
మీరు కన్నడ అమ్మాయి అంటున్నారు.. కానీ మీరు చూస్తే అచ్చమైన తెలుగమ్మాయిలా ఉన్నారు.
నేను కూర్గ్ లో పుట్టాను.. కానీ నేను సౌత్ ఇండియా అమ్మాయిలానే ఉంటాను.. తెలుగులో సినిమాలు చేస్తే తెలుగమ్మాయి అంటారు. తమిళంలో సినిమాలు చేస్తే తమిళమ్మాయిగా ట్రీట్ చేస్తారు. నేను సౌత్ అమ్మాయి మొహాన్ని కలిగి ఉండడమే దీనికి కారణం.
మీరు తెలుగులో రెండు మూడు సినిమాలు చేసారు.... తెలుగు సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి?
నాకు తెలుగు ఇండస్ట్రీ ఇచ్చే గౌవరం, ప్రేమ, ప్రేక్షకుల అభిమానం నచ్చింది. ఇంకా ఇక్కడ చాలా సినిమాలు చెయ్యాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యాలని ఉంది.
ఆనంద్ దేవరకొండ తో పని చెయ్యడం ఎలా అనిపించింది.
ఆనంద్ సెకండ్ మూవీ అయినా.. ఆనంద్ తో కలిసి నటించేటప్పుడు చాలా నేర్చుకున్నాను.. ఆనంద్ దేవరకొండ చాలా స్వీట్ పర్సన్. అతనితో పని చెయ్యడం కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఆనంద్ చాలా టాలెంటెడ్ పర్సన్.. ఆ విషయం మీకు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది.
తమిళంలో విజయ్ తో చేసారు.. ఇక్కడ విజయ్ తమ్ముడితో చేసారు.. ఎలా అనిపిస్తుంది.
అక్కడ తమిళంలో విజయ్ సేతుపతి తో చేశాను.. కానీ ఇక్కడ ఆనంద్ విజయ్ తమ్ముడు అని నాకెప్పుడూ అనిపించలేదు. నేను విజయ్ దేవరకొండ తమ్ముడితో నటిస్తున్నట్టుగా ఫీలవ్వలేదు. నేను ఆనంద్ తో పని చేస్తున్నాను అనుకున్నాను.
గుంటూరు స్లాంగ్ ఎమన్నా నేర్చుకున్నారా? ఓన్ డబ్బింగ్ చెప్పారని అన్నారు.
అవునండి నేను ఈ సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నా డైలాగ్స్ అన్ని గుంటూరు స్లాంగ్ లోనే చెప్పడానికి ట్రై చేశాను.
డైరెక్టర్ వినోద్ గారితో పని చెయ్యడం ఎలా ఉంది.. అసలు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది.
నా ఫస్ట్ మూవీ ఎడిటర్.. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎడిటర్ ఒకరే కావడంతో.. అలా ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక డైరెక్టర్ వినోద్ గురించి చెప్పాలంటే.. నేను మూవీ చెయ్యడానికి వన్ అఫ్ ద మెయిన్ రీజన్. డైరెక్టర్ కి ఉన్న కాన్ఫిడెన్స్, స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ. అది నాకు బాగా నచ్చింది. తన ఫస్ట్ మూవీ అయినా ఎప్పుడు నాకు ఆలా అనిపించలేదు. సెట్స్ లో వినోద్ కి ఇది అయిదో మూవీ నో ఆరో మూవీ నో అన్నట్టుగా ఉంటారు. చాలా క్లారిటీతో ఉంటారు. అది నాకు నచ్చింది.
మీరు ఎటువంటి పాత్రలను ఇష్టపడతారు.. మీ తదుపరి ప్రాజెక్ట్స్ ఎమన్నా..
ఇప్పుడు నేను తెలుగులో రాజ్ తరుణ్ తో కలిసి ఒక మూవీ లో నటిస్తున్నాను.
మీకు ఎటువంటి పాత్రలంటే ఇష్టం.
నేను ఇది వరకు చేసిన మూవీస్, కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలంటే చాలా ఇష్టం. ఏ హీరోయిన్ కయినా అది మెయిన్ రిక్వైర్మెంట్. యాక్టింగ్ స్పేస్ ఉన్న పాత్రలంటే ఇష్టం.
డ్రీం రోల్స్ అంటే అరుంధతి.. అనుష్క లాంటి డ్రీం రోల్స్ ఎమన్నా ఉన్నాయా.
డ్రీం రోల్స్ అంటూ మొదటి నుండి ఏమి లేవు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ లో మంచి రోల్ చెయ్యాలని ఉంది.
మీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అంటే ఓటిటిలో విడుదలవుతుంది. థియేటర్ ఎక్సపీరియెన్స్ మిస్ అవుతున్నారా..
మేము సినిమా మొదలు పెట్టినప్పుడు థియేటర్స్ మూవీ అనే అనుకుని చేసాము. కానీ ఇప్పుడు ఈ సిట్యువేషన్ లో ప్రేక్షకులకు సేఫ్ గా రీచ్ అవ్వాలంటే.. ఓటిటి నే బెస్ట్ ప్లాట్ ఫామ్. మేము చేసిన హార్డ్ వర్క్ ఇలా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది.
ఫైనల్ గా ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు సారీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఏం చెబుతారు.
కరోనా తో ఏడెనిమిది నెలలు చాలా ఇబ్బంది పడ్డాం... ఈ బ్రేక్ లో ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ ని పూర్తిగా ఆనందించండి.. మీకు ఈ మూవీ కంప్లీట్ గా నచ్చుతుంది.