Advertisement
Google Ads BL

అతను మరో ఆర్జీవీ: ‘గతం’ టీమ్‌తో ఇంటర్వ్యూ


ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్. ఒరిజినల్స్ సంయుక్తంగా.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా లేక్ టాహో నేపథ్యంలో అంతా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నవంబర్ 6న ఓటీటీ రంగంలో అగ్రగామి సంస్థగా దూసుకుపోతోన్న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కాబోతోంది. భార్గవ్ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత ప్రదాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కిరణ్ కొండమాడుగుల. చిత్రం 6న విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్ర తారాగణం అయిన భార్గవ్, రాకేశ్, పూజితలు సినీజోష్‌తో ముచ్చటించారు.

Advertisement
CJ Advs

సినీజోష్: హాయ్ అండి.. ఎలా ఉన్నారు? 

‘గతం’ టీమ్: హాయ్ అండి.. అంతా బాగున్నాం. 

సినీజోష్: సినిమా 6న విడుదల కాబోతోంది. బాగా ఎగ్జయిట్‌ అవుతున్నట్లున్నారు? 

‘గతం’ టీమ్: అవునండి.. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. 

సినీజోష్: ‘గతం’ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమా? లేక అంతకు ముందు ఏదైనా సినిమాలో నటించడం జరిగిందా? 

భార్గవ్, రాకేష్, పూజిత: ‘గతం’ చిత్రంతోనే పరిచయం అవుతున్నామండి. ఇదే మా మొదటి చిత్రం. 

సినీజోష్: ‘గతం’ సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చింది? 

భార్గవ్- నేను ఈ చిత్ర డైరెక్టర్ కిరణ్‌తో 5 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశాము. నేను యాక్టర్‌గా కిరణ్‌కి తెలుసు. అతను డైరెక్టర్‌గా నాకు తెలుసు. మా ఇద్దరిలో ఏమేం టాలెంట్స్ ఉన్నాయో మాకు తెలుసు. మాతో పాటు హర్ష అనే అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. మేము ముగ్గురం కలిసి ఆఫ్ బీట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించి.. ఈ సినిమా తీయడం జరిగింది. నేను కూడా ఈ సినిమాకి సహనిర్మాతనే. కిరణ్ ఒకరోజు కాల్ చేసి.. మంచి కథ రాశాను.. అని చెప్పి నా పాత్రని చెప్పారు. నా పాత్రలో మంచి ఫైరింగ్ ఉంది. వెంటనే ఓకే చెప్పేశాను. అలా ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. 

రాకేశ్- నేను ఎంబిఏ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్ ద్వారా కిరణ్ పరిచయం అయ్యారు. అప్పటికే ఆయన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేశారు. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దామని స్ర్కిఫ్ట్ రెడీ చేసుకున్నారు. నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కిరణ్ నాకొక స్ర్కిఫ్ట్ పంపించారు. ఆ స్ర్కిఫ్ట్ చదివిన తర్వాత.. అసలు ఈ పాత్ర నేను చేయగలుగుతానా? లేదా? అని ముందు నాకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత వర్క్ షాప్స్, డెమో షూట్స్ చేశాము. ఇవన్నీ పూర్తయ్యే సరికి నాలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక సినిమా చేసేశాను. నాకు ఇలా ఆఫర్ వచ్చింది. 

పూజిత- నాకు మూవీస్‌లో నటించడంపై చాలా ఇంట్రెస్ట్ ఉంది. లాస్ ఏంజిల్స్ వెళ్లి హాలీవుడ్‌లో యాక్టింగ్ కోర్స్ చేశాను. యుఎస్‌లో చాలా పెద్ద ఫిల్మ్ కమ్యూనిటీ ఉంది. తెలుగువాళ్లే చాలా ఇంట్రెస్ట్, ఫ్యాషన్ ఉన్నవాళ్లు ఉన్నారు. నాకు మా ఫ్రెండ్ చెప్పింది. రాకేశ్ అని చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అతనికి యాక్టింగ్, ఛాన్స్‌ల వంటి విషయాల గురించి అన్నీ తెలుసని చెప్పింది. ఈ సినిమాలో రాకేశ్ సెలక్ట్ అయిన తర్వాత.. క్యాస్టింగ్ జరుగుతుంది.. ఇంట్రస్ట్ ఉంటే ఆడిషన్ పంపించు అని చెప్పాడు. ఆడిషన్ చేసి కిరణ్‌గారికి పంపంచాను. ఆయనకి కూడా నచ్చి.. ఆ తర్వాత స్క్రిఫ్ట్ చెప్పారు. స్ర్కిప్ట్ విన్నాక.. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర అని వెంటనే ఓకే చేశాను. అలా నాకీ అవకాశం వచ్చింది. 

సినీజోష్: కొత్తగా పరిచయం అయ్యే వారు ఎక్కువగా లవ్ స్టోరీస్, యాక్షన్ లేదా నటనకు మంచి స్కోప్ ఉన్న చిత్రాలను ఎన్నుకుంటారు? మీరు మొదటి చిత్రమే థ్రిల్లర్ బేస్డ్ చిత్రం చేశారు. థ్రిల్లర్‌తోనే ఎంట్రీకి కారణం?

భార్గవ్- మాకు స్టోరీ బాగా నచ్చింది. స్టోరీ అనే కాదు.. మా పాత్రలు చాలా ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇటువంటి ఛాలెంజింగ్ పాత్రలు చేస్తే వచ్చే గుర్తింపే వేరు. మనం మనసు పెట్టి పాత్రను చేస్తే.. తద్వారా ముందు ముందు మంచి అవకాశాలు అవే వస్తాయ్. నేను ఇవన్నీ ఏమీ ఆలోచించలేదండి.. ఇందులో ఉన్న ఛాలెంజ్‌ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. అంతే. 

రాకేశ్- ఇందులో నేను చేసిన రిషిలాంటి పాత్ర చాలా అరుదుగా వస్తుంది. ఇప్పటి వరకు తెలుగు చిత్రాలలో ఇటువంటి పాత్రను చూడలేదు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇది అరుదుగా వచ్చే అవకాశం. 

పూజిత- నేను పలానా జోనరే చేయాలని అనుకోలేదండి. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అయితే చాలని అనుకున్నాను. ఇది చాలా మంచి అవకాశం అని అనుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమాలో ఇంత మంచి ఛాలెంజింగ్ పాత్రని చేయడం నా అదృష్టం అనుకుంటున్నాను. డైరెక్టర్ నన్ను నమ్మి ఇంత మంచి పాత్రని ఇవ్వడం చాలా పెద్ద విషయం. 

సినీజోష్: ఈ సినిమా టైమ్‌లో మీకున్న అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా?

భార్గవ్: చాలా అనుభవాలు ఉన్నాయండి. చాలా కథలు చెప్పుకోవచ్చు. మా క్రూ వచ్చేసి సెట్‌లో 8 నుంచి 10 మంది మాత్రమే ఉంటాం. మేం కెమెరా ముందు ఉంటే సినిమాలో నటించే క్యాస్ట్. కెమెరా ముందు లేకుంటే.. క్రూ. సెట్‌లో అన్ని పనులూ చేసే వాళ్లం. 17 రోజులు ఒక కాటేజ్ తీసుకుని సినిమా షూట్ చేశాం. ఈ 17 రోజులు ఒకే చోట ఉండటం వల్ల అంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లా చాలా క్లోజ్ అయ్యాం. ఒక ఫ్యామిలీలా ఉన్నాము. సినిమా షూటింగ్ అయిపోయి వెనక్కి వస్తుంటే.. చాలా బాధేసింది. అప్పుడే అయిపోయిందా?. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదే అనిపించింది.

రాకేష్ మరియు పూజిత: మాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. 

సినీజోష్: ఏ సెలబ్రిటీ అయినా.. తమని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని అనుకుంటారు? మీరు పరిచయం అవుతున్న చిత్రం ఓటీటీ.. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? 

భార్గవ్: మేము అసలు ఇటువంటి సర్‌ప్రైజ్ ఊహించలేదు. అమెజాన్‌ ప్రైమ్‌కి మేము ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతాయి. మేము సినిమా అనుకుని, షూట్ చేసేటప్పుడు థియేటర్ రిలీజే అనుకున్నాం. ముందు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో విడుదలవుతుంది.. అనే అనుకున్నాం. కానీ కోవిడ్‌తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇంతకన్నా మంచి అవకాశం లేదు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఇంతగా తహతహ లాడుతున్న సమయంలో ఒక మంచి సినిమాను తీసుకువస్తే.. దానికి ఆదరణ కూడా చాలా బాగుంటుందని నా నమ్మకం. 

రాకేశ్: ముందు మేము థియేటర్ రిలీజ్ అనే అనుకున్నాం. కానీ కరోనా వచ్చి అందరికీ బ్రేక్ ఇచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వారు అప్రోచ్ అవ్వడం, నిర్మాతలు వారితో డిస్కస్ చేసిన తర్వాత.. ఓటీటీలో సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే ఓటీటీ ద్వారా.. ఎన్నో దేశాలలోని ప్రేక్షకులకు సినిమా రీచ్ అవుతుంది. మా అందరికీ ఇదే తొలి చిత్రం. మా ముఖాలు ఎవరికీ తెలియదు. ఓన్లీ కంటెంట్‌ని నమ్మే అమెజాన్ వారు మా మూవీని తీసుకున్నారు. ఇది నిజంగా పెద్ద అచీవ్‌మెంట్ అని నేను నమ్ముతున్నాను.

భార్గవ్- ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అవుతుందండి.. అందులో నో డౌట్.  

పూజిత- మనం చెబుతున్న కథ ఎంత మందికి రీచ్ అవుతుందనేదే కదండి మొదటి నుంచి అంటే నాటకాల నుంచి సినిమా వరకు పరిగణించేది. కోవిడ్ వల్ల ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా యాడ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వారికి 200కి పైగా దేశాలలో సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. మా కష్టం వల్ల వచ్చిన అవుట్‌పుట్‌ని ఇప్పుడు వారంతా చూస్తారు. ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది. 

సినీజోష్: ఈ సినిమా డైరెక్టర్ కిరణ్ కొత్తగా పరిచయం అవుతున్నారు. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

పూజిత: కిరణ్‌గారి గురించి చెప్పాలంటే.. ఆయనొక పర్ఫెక్షనిస్ట్ అండి. ఆయనకొక విజన్ ఉంటుంది. ఏదైనా కావాలి అంటే.. అలా రావాల్సిందే. దానికి చాలా కష్టపడాలి. అలా ఉంటే అందరికీ మంచే జరుగుతుంది. చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. ఫస్ట్ అతనితో మాటాడినప్పుడే స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ చదివాను. కిరణ్ అంతకు ముందు చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను. అతను నాతో షేర్ చేసుకున్న విషయాలను బట్టి.. అతని విజన్ ఏంటో నాకు అర్థమైంది. అన్ని కలిసికట్టుగా ఈ సినిమాకి అలా సెట్ అయ్యాయి.

రాకేశ్: నేను కిరణ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చూశాను. ఆయన ఫిల్మ్ మేకింగ్‌లో ఢిఫరెంట్ స్టైల్ ఉంది. అతనిలో తన ఐడింటిటీని చూపించాలనే తాపత్రయం ఉంది. తనకంటూ ఒక మార్క్ ఉంది. స్క్రిప్ట్ పంపిన తర్వాత నేను చేయగలుగుతానా? అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ తర్వాత చేసిన వర్క్‌షాప్స్ తర్వాత అంతా ఓకే అనుకున్నాం. కిరణ్‌తో ఇదే నా జర్నీ. రేపు సినిమా చూసిన తర్వాత కిరణ్‌ని అందరూ ఖచ్చితంగా ఇంకో ఆర్.జి.వి అనుకుంటారు.

భార్గవ్: నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి కిరణ్‌తో ట్రావెల్ అవుతున్నాను. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ వంటివి తీశాం. షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు నేను, కిరణ్, హర్ష ముగ్గురిమే ఉండేవాళ్లం. షూటింగ్ టైమ్‌లో కెమెరా, ఆ తర్వాత ఎడిటింగ్, మ్యూజిక్.. అన్ని వాళ్లిద్దరూ చూసుకునేవారు. కిరణ్‌కి అన్ని డిపార్ట్‌మెంట్స్‌లోనూ మంచి గ్రిప్ ఉంది. కంప్లీట్ ప్రొడక్ట్‌ని తయారుచేయడం కిరణ్‌కి వచ్చు. ఒక రా ప్రొడక్ట్ నుంచి ఒక చెక్కుచెదరని ప్రొడక్ట్ ఎలా తయారు చేశాడో చాలా దగ్గర నుంచి చూశా. అతని మీద నాకు మొదటి నుంచి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే మేం బ్యానర్ స్థాపించాం. కో-ప్రొడ్యూసర్‌గా కూడా చేశాను. ఎండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ అదిరిపోతుందనే కాన్ఫిడెంట్ మాత్రం 250 పర్సంట్ మాలో ఉంది. 

సినీజోష్: అమెరికాలో మంచి జాబ్ చేసుకుంటున్న మీరు.. సినిమాల వైపు రావడానికి కారణం?

భార్గవ్: సినిమా అంటే ఇష్టమండి. మంచి జాబ్ చేసుకుంటూ.. హాయిగా ఉండొచ్చు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ సినిమా అంటే మాకు ఉన్న పిచ్చి, ఫ్యాషన్ అలాంటిది మరి. 

సినీజోష్: సినిమాలలో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లిక్ అయితేనే మళ్లీ అవకాశాలొస్తున్నాయ్. మరి ఈ సినిమాతో బిజీ అవుతామనే నమ్మకం ఉందా? 

రాకేశ్- తప్పకుండా ఉందండి. 

భార్గవ్-రాబోయే కాలానికి ఒక తెలుగు సినిమా హీరోని, హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నామండి.

సినీజోష్: డైరెక్టర్ కిరణ్‌గారు ఈ సినిమాకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే నిర్మాతలం అని చెప్పారు. ఇందులో మీరు (నటీనటులు) కూడా నిర్మాణ భాగమయ్యారా?

భార్గవ్: నేను ఉన్నానండి. సృజన్ అని ఎస్. ఒరిజినల్స్ బ్యానర్ అతనిది. హర్ష, కిరణ్.. మెయిన్ మేము నలుగురం. ఆ తర్వాత నా ఫ్రెండ్స్, కిరణ్ ఫ్రెండ్స్ కలిపి.. దాదాపు వందమంది వరకు హెల్ప్ చేశారు. వాళ్లందరి హెల్ప్ తోనూ, వాళ్లిచ్చిన ధైర్యంతో ఫస్ట్ షూట్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ఇక ఆగలేదు. 

సినీజోష్: కిరణ్‌గారు 13 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఏది ఎలా చేయకూడదో నేర్చుకున్నాను.. అన్నారు.. మరి మీరు ఈ సినిమాతో ఏం తెలుసుకున్నారు? 

భార్గవ్: సంకల్పబలం. అది ధృడంగా ఉంటే.. మీరనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది నా నమ్మకం. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ప్రతి ఐదు రోజులకి ఒకసారి సినిమా ఆగిపోయే పరిస్థితులు వచ్చాయ్. కానీ ధృడంగా, మొండిగా ముందుకు వెళితే.. దారులు తెరుచుకుని.. ఇంకా ముందుకు సాగడానికి అవకాశాలు వచ్చాయి. సెట్స్‌లో చాలా విషయాలు జరిగాయి. వాటన్నింటిని జయించి.. చివరికి సినిమా పూర్తి చేశాం.

సినీజోష్: భార్గవ్‌గారు.. మీ పాత్రకు కిరణ్ గారు జగపతిబాబు, అమితాబచ్చన్ వంటి వారిని ఊహించుకున్నానని చెప్పారు. మీ నుంచి ఆ రేంజ్ నటనని ఈ సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చా? టాలీవుడ్‌కి సరికొత్త విలన్ దొరికాడని అనుకోవచ్చా?

భార్గవ్- ఇప్పుడు నేను చేయవచ్చు.. అంటే నా వైపు నుంచి అది ఓవరాక్షన్ అవుతుంది. కొత్త విలన్ ఇంట్రడ్యూస్ అయ్యారు అంటే.. దాని మీద మాత్రం నా కాన్ఫిడెన్స్ నాకుంది. కిరణ్ డైరెక్షన్ మీద కూడా. ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఫర్ తెలుగు మూవీ ఇండస్ట్రీ. తెలుగు ఒక్కటే కాదు.. ఏ భాష అయినా ఓకే. 

సినీజోష్: ఇంతకీ ఈ సినిమాలో విలన్ మీరా? లేక రాకేశ్ గారా?

భార్గవ్- అదెలా చెబుతామండి.. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అదే కదా సస్పెన్స్. 

సినీజోష్: ఓకే.. ఈ సినిమా మంచి విజయం సాధించి.. టాలీవుడ్‌లో మీకు మంచి అవకాశం వస్తే.. అమెరికా వదిలి వచ్చేస్తారా?

రాకేశ్: తప్పకుండా వస్తానండి. కానీ.. ఇక్కడ కూడా చాలా మంచి కథలు, లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచే మంచి కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను కూడా. ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత కొన్ని స్టోరీస్ వచ్చాయి. ఎలా ఉంటుందనేది చూడాలి. 

పూజిత- ప్రస్తుతానికి నేను ఇండియా వచ్చేశానండి. తర్వాత ఎక్కడుంటానో తెలియదు కానీ.. ప్రస్తుతం డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను. రెండు స్ర్కిప్ట్స్ కూడా రాసుకున్నాను. 

భార్గవ్: వచ్చిన అవకాశాన్ని బట్టి ఉంటుందండి. రాకేశ్ అన్నట్లుగా ఇక్కడ కూడా మంచి కథలు వస్తున్నాయి. కొంతమంది స్ర్కిప్ట్‌లు పంపించి.. కాల్ చేసి అడుగుతున్నారు. తప్పకుండా నువ్ చేయాలి అని అడగడం వంటివన్నీ జరిగాయ్. ఈ సినిమా మీద దృష్టి పెట్టడంతో.. ఇంకా ఏమీ చెప్పలేదు. కాకపోతే ఇక్కడ బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇండియా వచ్చి చేయాలంటే.. వచ్చే అవకాశాన్ని బట్టి ఉంటుందండి. మంచి రోల్ వస్తే.. ఖచ్చితంగా వచ్చి చేస్తాను.

సినీజోష్: ట్రైలర్ విషయానికి వస్తే.. కెమెరా, విజువల్స్, మ్యూజిక్.. దేనికదే పోటీ అనేలా ఉంది. ట్రైలర్ మీద మీ అభిప్రాయం?

రాకేశ్- సినిమాకి మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల గారు. ఆయన గురించి చెప్పేదేముంది. మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఆయన గురించి అందరికీ తెలుసు. కెమెరా వచ్చి మనోజ్. గతం సినిమాకి ముందు అతనితో నేను డెమో షూట్ కూడా చేశాను. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఆ విషయం విజువల్స్ చూస్తే.. అర్థమవుతుంది. ట్రైలర్ కటింగ్ వచ్చేసి ఎడిటర్ సతీష్‌గారు, కిరణ్‌గారిదే ఆ క్రెడిట్.

భార్గవ్: మనోజ్‌గారు ఫస్ట్ మాకు పరిచయం అయ్యారు. చాలా కష్టపడ్డాడు. విజువల్స్ చూసే ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్ సినిమా ఇంకో లెవల్‌లో ఉండాలంటే దానికి సరైన మ్యూజిక్ పడాలి. శ్రీచరణ్ పాకాల థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు. మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. అతనితో మాట్లాడి, అతను యాడ్ అవ్వడం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ట్రైలర్ కటింగ్ అంటే ఆ విజన్ 100 పర్సంట్ కిరణ్‌దే. ఆ విజన్‌కి వెరీ టాలెంటెట్ ఎడిటర్ తోడయితే.. ఎలా ఉంటుందో.. చూశారు. ఒక హాలీవుడ్ ఫిల్మ్‌లా అవుట్‌పుట్ ఇచ్చారు. 

పూజిత: ట్రైలర్ గురించి వారు చెప్పారు కాబట్టి.. నేను ఇంకో విషయం చెబుతాను. రాకేశ్, నేను ఫస్ట్ ఫస్ట్ సీన్ చూసినప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. దీనికి గూఢచారి సినిమాలో శ్రీచరణ్‌గారు ఇచ్చిన బిజీయం పడితేనా.. అనుకున్నాం. కట్ చేస్తే.. ఆన్ బోర్డ్‌లో ఉన్నారాయన. హి డిడ్ అమేజింగ్ జాబ్. మనోజ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్.

Exclisive Interview with Gatham Movie Cast :

Movie Team Talks about Gatham Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs