Advertisement
Google Ads BL

నానితో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా: ‘హిట్’ దర్శకుడు


‘హిట్’ సినిమా చూసి హానెస్ట్ థ్రిల్లర్ చేశానని ప్రేక్ష‌కులు న‌మ్మారు.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా నా బాధ్య‌త‌గా మ‌రింత పెరిగింది:  డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను

Advertisement
CJ Advs

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ఇంట‌ర్వ్యూ...

‘హిట్’ పెద్ద హిట్ కావ‌డం ఎలా అనిపిస్తుంది?

- చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను దేన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాను డైరెక్ట్ చేశానో అది ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. డిఫ‌రెంట్‌గా తీశాడు అని, హానెస్ట్ థ్రిల్ల‌ర్ తీశాడ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు వ‌చ్చిన క‌థ‌ను నిజాయ‌తీగానే చేశాన‌ని అనుకున్నాను. 

సినిమా ఎలా స్టార్ట‌య్యింది?

- మంచి క‌థ‌లు చెప్పాల‌నే ఆలోచ‌న నాకు చిన్న‌ప్ప‌ట్నుండి ఉండేది. 2011లో పి.హెచ్‌.డి చ‌ద‌వ‌డానికి ఆస్ట్రేలియా వెళ్లిన త‌ర్వాత స్క్రిప్ట్ ఎలా రాయాలనే దాన్ని నేర్చుకోవ‌డానికి స‌మ‌యం దొరికింది. నేర్చుకున్న త‌ర్వాత తొలి ఫీచ‌ల్ ఫిల్మ్ స్క్రిప్ట్‌ను 2016లో రాశాను. నేను నానిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న డిఫ‌రెంట్ మూవీస్ చేస్తుండ‌టాన్ని గ‌మ‌నించాను. ఆయ‌న్ని క‌లిస్తే త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చేస్తార‌నిపించింది. కామ‌న్ ఫ్రెండ్ ద్వారా నానిగారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వాట్స‌ప్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఓ రోజు ఆయ‌న వ‌చ్చి క‌థ చెప్ప‌మ‌ని అన్నారు. నేను ముందు రెండు క‌థ‌లు చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చినా కూడా కొన్ని కార‌ణాల‌తో అవి ప‌క్క‌కు వెళ్లిపోయాయి. మూడో క‌థ‌గా హిట్ క‌థ‌ను చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో పాటు అన్ని చ‌క్క‌గా అమ‌ర‌డంతో సినిమా స్టార్ట్ అయ్యింది. 

ప‌నిచేస్తూ సినిమాల‌పై వ‌ర్క్ చేయ‌డం..ఎలా మేనేజ్ చేశారు?

- సాధార‌ణంగా నేను ప‌నిచేసేట‌ప్పుడు సాయంత్రం ఐదు వ‌ర‌కే ప‌ని ఉండేది. శుక్ర‌వారం వ‌ర‌కు మాత్ర‌మే ప‌ని చేసేవాళ్లం. శ‌నివారం, ఆదివారం ఖాళీగానే ఉండేవాడిని. ప్ర‌తిరోజూ సాయంత్రం స్క్రీన్ రైటింగ్‌, డైరెక్ష‌న్ క్లాసుల‌కు వెళ్లేవాడిని. 8 సంవ‌త్స‌రాలు ప్ర‌తివారం మూడు రోజుల పాటు సినిమాకు సంబంధించి క‌ష్ట‌ప‌డేవాడిని. 

హీరో నాని..మీ సినిమాకు నిర్మాత ఆయ‌నేమైన స‌ల‌హాలు ఇచ్చారా?

- లేదండి.. చిన్న చిన్న స‌ల‌హాలు చెప్పారు. అస‌లు నేను స‌న్నివేశాల‌ను ఎందుక‌లా రాసుకున్నాన‌నే ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. 98 శాతం నేనెదైతే రాసుకున్నానో దాన్నే సినిమాగా తీశాం. 

విశ్వ‌క్‌ను హీరోగా తీసుకోవాల‌ని ఎందుకు అనుకున్నారు?

- ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమా చూసినప్పుడే నేను ఈ హీరోతో ప‌నిచేయాల‌ని అనుకున్నాను. త‌న‌లో మంచి ఇన్‌టెన్స్ ఉంద‌నిపించింది. నేను కథలు రాసే సమయంలో ఎవ‌రినీ మ‌న‌సులో పెట్టుకుని క‌థ రాయ‌ను. ‘హిట్‌’ క‌థ రాసుకునే స‌మ‌యంలో 20-30 శాతం క‌థ పూర్త‌వ‌గానే నాకు విశ్వ‌క్‌సేన్ మైండ్‌లోకి వ‌చ్చాడు. నానిగారితో, ప్ర‌శాంతిగారితో కూడా విశ్వ‌క్ అయితే బావుంటాడ‌ని అనుకున్నాం. అంద‌రూ డిస్క‌స్ చేసుకుని చివ‌ర‌కు విశ్వ‌క్‌ను ఓకే చేశాం. త‌న‌ని క‌లిసేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అనిపించింది. కానీ.. క‌థ విన్న త‌ర్వాత ప్ర‌శ్న‌లు అడుగుతున్నాడు. త‌న‌కు అర్థ‌మ‌వుతుందా? లేదా? అనిపించింది. కానీ క‌థంతా విన్న త‌ర్వాత నానిగారికి ఫోన్ చేసి సినిమా చేస్తాన‌ని చెప్పాడు. త‌న‌లో ఓ డైరెక్ట‌ర్ ఉన్న‌ప్ప‌టికీ మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా ఇన్‌వాల్వ్ కాలేదు. నాకు పూర్తిగా స‌రెండ‌ర్ అయ్యి సినిమా చేశాడు. 

మీ నాన్న‌గారి ఫీలింగ్ ఏంటి?

- నాన్న‌గారు ముందు సినిమా చేస్తానంటే తంతా! అని అన్నాడు. కానీ ఆయ‌న‌కు నా ప్ర‌య‌త్నాలు గురించి చెప్ప‌కుండా ఇక్క‌డ‌కు వ‌చ్చి వెళ్లేవాడిని. త‌ర్వాత నాని స‌పోర్ట్ చేశారో అప్పుడు ఆయ‌న ద్వారా తెలిసింది. ఆయ‌న సినిమా చూసి షాక‌య్యారు. ఎలా నేర్చుకున్నావురా? సినిమా ఎలా తీసేశావ్? ఆడుతూ పాడుతూ చేసేశావ్‌ అన్నారు. నేను సినిమా గురించి చేసిన వ‌ర్క్ ఆయ‌న‌కు తెలియ‌దు. 

ఈ క‌థ‌కు ఇన్‌స్పిరేష‌న్ ఏమైనా ఉందా?

- ఈ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ ఏమీ లేదు. నేనొక థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ రాయాల‌ని అనుకున్న త‌ర్వాత ప్ర‌పంచంలో జ‌రిగిన క్రైమ్స్ గురించి వార్తాప‌త్రిక‌ల్లో చ‌దివాను. ఆస‌క్తిక‌ర‌మైన కేసులన్నింటినీ నా డైరీలో రాసుకుంటూ వ‌చ్చాను. నిజ ఘ‌ట‌నల‌ను క‌లిపి రాసుకున్న క‌థే హిట్‌. క‌మ‌ల్‌హాస‌న్‌గారి హేరామ్ సినిమా వ‌ల్ల‌నే నేను సినిమాల్లోకి రావాల‌ని అనుకున్నాను. ఆ సినిమాను ఇప్ప‌టి వ‌ర‌కు 50 కంటే ఎక్కువ‌సార్లు చూశాను. ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ సినిమాలో క‌నిపించింద‌నుకుంటాను. 

ఇండ‌స్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది?

- ల‌క్ష్మీ మంచుగారు నాకు మంచి ఫ్రెండ్. ఆమె సినిమా చూసి ఫోన్ చేసి అభినందించారు. రానాగారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక దిల్‌రాజుగారు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. యంగ్ డైరెక్ట‌ర్స్ అంద‌రూ అప్రిషియేట్ చేశారు. 

రెండో సినిమా గురించి భ‌య‌ముందా?

- త‌ప్ప‌కుండా భ‌యం కంటే బాధ్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే తొలి సినిమానే ఇంత బాగా చేశాడురా! అని అంద‌రూ అనుకున్నారు. దాన్ని నిల‌బెట్టుకోవాల‌నుకునే బాధ్య‌త ఉంది. ప్రేక్ష‌కుల‌ను డిసప్పాయింట్ చేయ‌న‌నే న‌మ్మ‌కం ఉంది. 

ద‌ర్శ‌కుడిగా మీకు ఇష్ట‌మైన జోన‌ర్ ఏంటి?

- నేను ప‌ర్టికుల‌ర్ జోన‌ర్ సినిమాలు చూడాల‌నుకోను..సినిమాలు చేయాల‌నుకోను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర నాలుగు క‌థ‌లు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో ఉన్నాయి. అన్నీ వేర్వేరు జోన‌ర్ మూవీస్‌. ఒక సినిమా అయితే మ్యూజిక‌ల్ స్టోరి. అందులో 17 పాటలున్నాయి. దాన్ని అలాగే చెప్పాలి. 

వెబ్‌సిరీస్‌లేమైనా చేసే ఆలోచ‌న ఉందా?

- నేను సినిమా ఫార్మేట్‌ను ఎక్కువ‌గా న‌మ్ముతాను. అయితే కొన్ని క‌థ‌ల‌ను వెబ్ సిరీస్‌ల ఫార్మేట్‌లో చెబితే ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతాయ‌ని బాగా న‌మ్ముతాను. అలాంటి ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా చేస్తాను. 

‘హిట్‌’ కేస్‌2 ఎప్పుడు తెర‌కెక్కిస్తారు?

- వెంట‌నే తెర‌కెక్కిస్తాను. ప్ర‌స్తుతం దానిపైనే వ‌ర్క్ చేస్తున్నాం. సేట్ టీమ్‌తో వ‌ర్క్ చేయ‌బోతున్నాను. మ‌రికొన్ని పాత్ర‌లు యాడ్ అవుతాయి. 2021లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మే చివ‌ర లేదా జూన్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాం. నానిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న‌కు స‌రిపోయే క‌థ నాకు ఐడియాకు వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆయ‌న‌తో సినిమా చేస్తాను.

director sailesh kolanu interview about Hit Success:

director sailesh kolanu Talks about Hit Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs