Advertisement
Google Ads BL

'హలో'తో..తృప్తిగా, సంతోషంగా వుంది: నాగ్!


'హలో' చూశాక.. చాలా చాలా తృప్తిగా, చాలా సంతోషంగా వుంది - నిర్మాత అక్కినేని నాగార్జున 

Advertisement
CJ Advs

యూత్‌ కింగ్‌ అఖిల్‌ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌కి తగ్గ యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందిన చిత్రం 'హలో'. ఈ చిత్రం క్లీన్‌ యు సర్టిఫికెట్‌ సాధించి క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

అభిమానులందరికీ చాలా థాంక్స్‌!! 

నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..ఈ సినిమాకి సంబంధించి అన్నీ ప్రెస్‌మీట్స్‌లోనూ నేనే మాట్లాడుతున్నా. లాస్ట్‌ 3 ఫిలింస్‌కి నేనే మాట్లాడాను. లక్కీగా అవన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం వుంది. ముందుగా నేను విక్రమ్‌కి ఫస్ట్‌ థాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే నాన్నగారి లాస్ట్‌ సినిమా 'మనం'. అలాంటి గొప్ప చిత్రాన్ని మాకు ఇచ్చారు. మళ్ళీ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరితో 'హలో' చిత్రాన్ని ఫెంటాస్టిక్‌గా తెరకెక్కించారు. పి.ఎస్‌.వినోద్‌ కెమెరా విజువల్స్‌, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ టీమ్‌, సుప్రియ ఇలా ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ప్రేమతో చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. అందరూ అఖిల్‌కి మంచి సినిమా ఇవ్వాలి అని ప్రెస్టీజియస్‌గా తీసుకుని పని చేశారు. బేసిగ్గా నాకు సినిమాలు అంటే ఇష్టం. అఖిల్‌ సినిమా కాబట్టి ఆ ప్రేమ ఇంకాస్త పెరిగింది. బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరితో అఖిల్‌కి 'హలో' వంటి ఫీల్‌గుడ్‌ ఫిల్మ్‌ని నిర్మించినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. అఖిల్‌ సంవత్సరం పాటు కష్టపడి సిన్సియర్‌గా ఈ సినిమా చేశాడు. తను బేసిగ్గా అధ్లెట్‌ కాబట్టి విక్రమ్‌ అఖిల్‌తో జంపింగ్‌, డైవ్‌ అన్నీ చక్కగా చేయించుకున్నాడు. మంచి హిట్‌ కొట్టాలి అన్న కసితో అఖిల్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రం చేశాడు. వన్స్‌ స్క్రిప్ట్‌ ఫైనల్‌ అయ్యాక నా జోక్యం ఏమీ వుండదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అవుతాను. అదంటే నాకు ఇష్టం. సినిమా కలర్‌ఫుల్‌గా, క్వాలిటీగా రావాలని చూస్తాను. అందుకోసం టెక్నీషియన్స్‌కి ఎక్కువ టైమ్‌ ఇస్తాను. వారిని గైడెన్స్‌ చేస్తూ టైమ్‌ సెన్స్‌ చెప్తూ చేశాం. అప్పుడే మంచి సినిమా వస్తుంది. విక్రమ్‌ టీమ్‌ అంతా ఈ చిత్రాన్ని క్రియేటివిటీతో బాగా చేశారు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా విక్రమ్‌కే చెందుతుంది.

'హలో' సినిమా చూశాను. నేను అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా ఈ చిత్రంలో చూశాను. ఈ సినిమా డెస్టినీ మీద నడుస్తోంది. అలాగే చిన్న మ్యాజిక్‌ వుంటుంది. అదేంటి అనేది సినిమా చూడాలి. విక్రమ్‌ సినిమాల్లో ఆ మ్యాజిక్‌ ప్రతిసారి వుంటుంది. ప్రియదర్శన్‌ లిజి కూతురు కళ్యాణి ప్రియదర్శన్‌ని స్క్రీన్‌ టెస్ట్‌ చేసి మూడు నెలలు ట్రైనింగ్‌ ఇచ్చి ఈ సినిమాలో సెలెక్ట్‌ చేశాం. ఫెంటాస్టిక్‌గా చేసింది. ఈ సినిమా తర్వాత మంచి ఫ్యూచర్‌ వుంటుంది. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చిరంజీవిగారు, రామ్‌చరణ్‌ వచ్చి అఖిల్‌ని బ్లెస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. మెగా అభిమానులు, అక్కినేని అభిమానులు అందరూ ఫంక్షన్‌ని సక్సెస్‌ చేశారు. ఇది చాలా హెల్తీ వాతావరణం. చిరంజీవిగారిని సినిమా చూసి ఆ తర్వాత ఫంక్షన్‌కి వచ్చి తన అభిప్రాయం చెప్పమన్నాను. ఆయన సినిమా చూశాక అఖిల్‌ని గట్టిగా హగ్‌ చేసుకుని రెండు నిమిషాలు మౌనంగా వుండిపోయారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతగా సినిమాకి కనెక్ట్‌ అయ్యారు. ఆయన రియాక్షన్‌ చూశాక టెన్షన్‌ అంతా పోయి రిలాక్స్‌గా వున్నాను. చరణ్‌, అఖిల్‌ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. ఒక బ్యూటిఫుల్‌ బేబిని ప్రేక్షకుల్లో వదిలాం. ఫైనల్‌ రిజల్ట్‌ వారి చేతిలో వుంది. 

'మనం' ఫినిష్‌ అవగానే అన్నపూర్ణలో అఖిల్‌తో సినిమా చెయ్యాలి అని విక్రమ్‌ని అడగ్గానే వెంటనే అతను 'మనం'లాంటి గొప్ప సినిమా నాకు ఇచ్చారు. డెఫినెట్‌గా అఖిల్‌తో ఒక సినిమా చేస్తాను అన్నాడు. అప్పటికే అతను '24' సినిమా కమిట్‌ అయ్యాడు. అది ఫినిష్‌ చేసి ఈ సినిమా చేశాడు. 'మనం', 'హలో' రెండు అద్భుతమైన చిత్రాలు చేసిన విక్రమ్‌కి నా థాంక్స్‌. 

'గీతాంజలి', 'శివ' కంటే ముందు నేను చాలా సూపర్‌హిట్‌ సినిమాలు చేశాను. కానీ నాగార్జున బాగా చేశాడు అని ఎవరూ అనలేదు. 'గీతాంజలి'లో నా లుక్‌, నా స్టైల్‌ పర్‌ఫెక్ట్‌గా ఆ క్యారెక్టర్‌ నాకు సెట్‌ అయ్యింది. అందరూ నాగ్‌ బాగా చేశాడు అన్నారు. 'హలో'తో అఖిల్‌ ఏజ్‌కి సూట్‌ అయ్యే క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు. ఇప్పుడు అఖిల్‌ న్యూ ఏజ్‌ బోయ్‌. సాంగ్స్‌, సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లలో అఖిల్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేశాడు విక్రమ్‌. ఈ చిత్రంలో అఖిల్‌ ఫస్ట్‌టైమ్‌ ఒక పాట పాడి సర్‌ప్రైజ్‌ చేశాడు. నేను షాక్‌ అయ్యాను. అనూప్‌కి ఫోన్‌ చేసి థాంక్స్‌ చెప్పాను. బ్యూటిఫుల్‌ సాంగ్స్‌ కంపోజ్‌ చేశాడు. 'హలో' టైటిల్‌ సాంగ్‌ చాలా పెద్ద హిట్‌ అయ్యింది... అన్నారు. 

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్‌ నుండి బాబ్‌ బ్రౌన్‌ స్టంట్‌ డైరెక్టర్‌ని తీసుకొచ్చాం. ఆయన హాలీవుడ్‌ టెర్మినేటర్ సిరీస్‌ సినిమాలు చేశాడు. చైనీస్‌, కొరియా చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు. అతని కోరిక ఇండియన్‌ ఫిలిం చేయాలని. ఒక ఫ్రెండ్‌ ద్వారా అతనికి స్క్రిప్ట్‌ మెయిల్‌ చేశాం. అతనికి నచ్చి వెంటనే ఇండియాకి వచ్చి ఈ సినిమా ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు. సెపరేట్‌ ఫైట్స్‌లా కాకుండా చాలా ఎగ్జైటింగ్‌గా వుంటాయి. లవ్‌స్టోరిలో యాక్షన్‌ పెట్టడం చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రం సిట్యుయేషన్కి తగ్గట్లుగా యాక్షన్‌ సీన్స్‌ కుదిరాయి. 

'నిన్నే పెళ్లాడతా', 'సత్యం', 'సీతారాముల కళ్యాణం చూతమురారండీ', 'ఉయ్యాలా జంపాలా' చిత్రాలకి నిర్మాతగా ఎంత ప్యాషన్‌తో వర్క్‌ చేశానో ఈ సినిమాకి కూడా అలాగే చేశాను. నాకు సినిమాలు తీయడం చాలా ఇష్టం. ఇంకా కంటిన్యూగా సినిమాలు తీస్తాను. హీరో అఖిల్‌ కాబట్టి ఇంకొంచెం ప్రేమగా చేశాను. 'రాజన్న' సినిమాని 18 కోట్లు పెట్టి తీశాను. కొత్త డైరెక్టర్స్‌ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశాను. ఎవరూ బడ్జెట్‌ ఎక్కువైందని అడగలేదు. మా అబ్బాయి హీరో కాబట్టి.. ఎక్కువ ఖర్చు పెట్టి తీశాం. సినిమా బ్యూటిఫుల్‌గా వచ్చింది. 'శివ', 'గీతాంజలి'లో వున్నంత ఎంటర్‌టైన్‌మెంట్‌ 'హలో'లో వుంది. 

చైతు, విక్రమ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వుంటుంది. అలాగే నేను, నాని కలిసి శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాం. గంటన్నర సేపు స్క్రిప్ట్‌ చెప్పాడు. చాలా బాగుంది. వెరీ ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌ వున్నాయి. ఇట్స్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌. 

అమల ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా వుంది. ఇంటికి రాగానే నా చుట్టూ డ్యాన్స్‌ చేస్తుంది. ఈ హ్యాపీ మూమెంట్స్‌ అన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. అమల వారి అమ్మగారికి తెలుగు రాదు. అయినా మూడుసార్లు చూసింది. మళ్ళీ చూస్తానంటోంది. మనవడు మీద ప్రేమ చాలా ఎక్కువ వుంది. ఇప్పటికే నాకు ఫోన్లు వస్తున్నాయి. మనం హిట్ కొట్టాలని.. వారి అభిమానం అలాంటిది... తప్పకుండా మా బేబీ మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాము.. అంటూ ముగించారు. 

Nagarjuna Hello Movie Interview:

King Nagarjuna Special Interview for Hello Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs