Advertisement
Google Ads BL

మరీ ఇంత ఎగ్జయిట్‌మెంటా.. మహేష్..!!


'స్పైడర్‌' కోసం ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నాను - మహేష్‌ 

Advertisement
CJ Advs

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి పతాకంపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఈ సినిమా సెప్టెంబర్‌ 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు పాత్రికేయులతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు. 

ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను... 

- సినిమా విడుదల దగ్గరకొచ్చేసింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మురుగదాస్‌ వంటి డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను, నాటీమ్‌తో కలిసి ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం పనిచేశాను. 

పదేళ్లుగా అనుకుంటున్నాను... 

- మురుగదాస్‌గారితో పనిచేయాలని పదేళ్లుగా అనుకుంటూనే ఉన్నాను. కానీ ఇద్దరికీ డేట్స్‌ కుదరనేలేదు. పదేళ్లకు ఇప్పటికి కుదిరింది. ప్రాపర్‌ బైలింగ్వువల్‌ మూవీ. తెలుగు, తమిళంలో చేయడం ఆనందంగా ఉంది. మురుగదాస్‌ వంటి డైరెక్టర్‌తో పనిచేయడం కల నిజమైనట్లు అనిపించింది. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. 

కొత్త ఎక్స్‌పీరియెన్స్‌... 

- తెలుగులో ఆర్టిస్టులు వేరేగా ఉంటారు. తమిళ్ లో ఆర్టిస్టులు వేరేలా ఉంటారు. సన్నివేశాలను ఒకేరోజులో రెండు వేర్వేరు భాషల్లో చేయడం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. తెలుగు, తమిళంలో తేడా ఏముంటుంది. ఒక టేక్‌ ఎక్స్‌ట్రాగా ఉంటుందంతే కదా, చేసెయవచ్చులే అనుకుని ఫీల్డ్‌లోకి దిగాం. కానీ మూడు రోజుల తర్వాత బై లింగ్వువల్‌ మూవీ చేయడం అంత సులభం కాదని తెలిసొచ్చింది. తెలుగులో ఓ సన్నివేశాన్ని ఐదారు టేక్స్‌ చేసిన తర్వాత తమిళంలో కూడా ఐదారు టేక్స్‌ పట్టేది. తర్వాత క్లోజప్స్‌కు కూడా అలాగే సమయం పట్టింది. ఒక సినిమాను ఒకేరోజు రీమేక్‌ చేస్తున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు కొరటాలగారి సినిమా షూటింగ్‌కి వచ్చినప్పుడు డైలాగ్స్‌ ఇచ్చారు. ఇంతేనా అని అనిపించింది. 

యూనిక్‌ కాన్సెప్ట్‌... 

- టెక్నికల్‌గా స్పైడర్‌ మూవీ చాలా సూపర్బ్‌గా ఉంటుంది. అలాగే బడ్జెట్‌ విషయంలో కూడా నా కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ. ప్రోమోస్‌, టీజర్‌ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమాలో చాలా ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. యూనిక్‌ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. సినిమాను థియేటర్‌లో చూడాల్సిందే. 

ఎస్‌.జె.సూర్య గురించి... 

-ఎస్‌.జె.సూర్యగారు ఇందులో విలన్‌గా నటించారు. ఒక దర్శకుడిగా ఎస్‌.జె.సూర్యగారిని చాలాసార్లు కలిశాను. మురుగదాస్‌గారు సినిమా స్టార్ట్‌ చేసిన రెండు నెలల తర్వాత ఇందులో సూర్యగారు విలన్‌గా చేస్తున్నారని అన్నారు. నాకు ముందు అర్థం కాలేదు. రెండు రోజుల తర్వాత సూర్యగారైతేనే ఈ సినిమాలో విలన్‌గా పక్కాగా సరిపోతారనిపించింది. రేపు సినిమాలో ఆయన బ్రిలియంట్‌ పెర్ఫామెన్స్‌ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది తనెంత బాగా చేశారోనని. అలాగే భరత్‌ కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో కనపడతారు. మురుగదాస్‌గారిపై అభిమానంతో భరత్‌ ఈ సినిమాలో నటించారు. 

యాక్షన్‌ మూవీ విత్‌ మెసేజ్‌... 

- మురుగదాస్‌గారి సినిమాలు చూస్తే కత్తి, రమణ చిత్రాల్లో డైరెక్ట్‌ మెసేజ్‌ ఉంటుంది. అలాగే తుపాకీ, గజినీ సినిమాలు చూస్తే యాక్షన్‌ ప్యాట్రన్‌లో సాగుతాయి. అలాగే స్పైడర్‌ కూడా యాక్షన్‌ మూవీలా ఉంటుంది. ఇంటర్ననల్‌గా సినిమాలో మెసేజ్‌ కూడా ఉంటుంది. 

హేరిష్‌ గురించి... 

- హేరీష్‌గారి ట్యూన్స్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఇలా కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వొచ్చా అని సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. 

తదుపరి చిత్రం గురించి... 

- నా తదుపరి చిత్రం కొరటాలగారితో చేస్తున్నాను. దర్శక నిర్మాతలు మాట్లాడుకున్న తర్వాత సినిమా విడుదల గురించి మరో పది లేదా ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. 

రాజమౌళితో సినిమా ఉంది... 

- రాజమౌళిగారి దర్శకత్వంలో సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి కావాలి, అలాగే రాజమౌళిగారి కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాతే మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను...అని తెలిపారు. 

Mahesh Babu Spyder Interview:

Mahesh Babu Excitement on Spyder Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs