Advertisement
Google Ads BL

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌... 100% కరెక్ట్..!


'లై' సినిమాలో న‌టించ‌డం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ - యాక్ష‌న్ కింగ్ అర్జున్‌

Advertisement
CJ Advs

యూత్‌స్టార్‌ నితిన్‌ నటించిన చిత్రం 'లై'. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'లై'. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. ఈ సినిమాలో విల‌న్ ప‌ద్మ‌నాభం పాత్ర‌లో మెప్పించిన సీనియ‌ర్ హీరో యాక్ష‌న్ కింగ్‌ అర్జున్‌తో ఇంట‌ర్వ్యూ...

కొత్తగా చేయాలనిపించి 

- 150 సినిమాల్లో నటించిన హీరోగా నాకే ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. ఆ కొత్తదనం కూడా నేను ఇప్పుడే చేయగలను అనిపించింది. హీరోగా సినిమాలు వస్తున్నాయి. చేస్తున్నాను. ఏదైనా కొత్తగా పాత్రలో నటించినప్పుడే ఏదైనా కొత్తగా చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్‌ సినిమాలో కూడా డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నాను. ఇన్ని వేరియేషన్స్‌లో చేయడం బావుంది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదనిపించింది. 

కొత్త ఎక్స్‌పీరియెన్స్‌... 

- లై సినిమాలో నటించడం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. హను రాఘవపూడి వచ్చి కథ చెప్పగానే నచ్చింది. కానీ విలన్‌గా చేయడం అంటే నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు సంబంధించి చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. సినిమాను బిజినెస్‌ యాంగిల్‌లో కూడా ఆలోచించాలి. కథ వినగానే నటుడిగా మంచి డైమన్షన్‌ ఉందనిపించింది. అలాంటప్పుడు ఎందుకు విలన్‌గా నటించకూడదనిపించింది. నితిన్‌తో అల్రెడి నటించాను. నటుడుగా తను మంచి హార్డ్‌వర్కర్‌. తనంటే చాలా ఇష్టం. అందుకే లై సినిమా చేశాను. 

రెస్పాన్స్‌ బావుంది.. 

- హీరోగా నటించినప్పుడు అందరి నుండి ఎలాంటి స్పందన వచ్చిందో లై క్యారెక్టర్‌ చేయడం వల్ల అంత మంచి స్పందన వచ్చింది. 

సినిమా అనేది వన్‌ మేన్‌ షో కాదు... 

- సినిమా సక్సెస్‌ అనేది వన్‌ మ్యాన్‌ షో అనే మాటను నేను నమ్మను. అలా ఎవరైనా అన్నారంటే వాళ్లు పిచ్చివాళ్లకిందే లెక్క. ఎందుకంటే సినిమా అనేది ఏ ఒక్కరి కష్టం కాదు. డైరెక్టర్‌, కెమెరామెన్‌ సహా ఎందరో టెక్నిషియన్స్‌ పనిచేయాల్సి ఉంటుంది. అందరి కష్టమే సినిమా. 

సినిమా స్టైల్‌ మారుతుంది... 

- సినిమా మేకింగ్‌ స్టైల్‌ మారుతుంది. హాలీవుడ్‌లో ఓ సినిమాలో హీరోగా నటించినవాడు మరో సినిమాలో విలన్‌గా నటిస్తాడు. మరో సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేస్తాడు. మన ఇండియన్‌ సినిమాలోనే ఆ వేరియేషన్‌ కనపడేది. కానీ ఇప్పుడు ఆ వేరియేషన్‌ మారుతుంది. అందరూ భిన్నమైన రోల్స్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కూడా అంతే, 150 సినిమాల్లో యాక్ట్‌ చేసిన నేను భిన్నమైన పాత్రలు చేయాలి. నాతో ఎవరూ సినిమా చేయకపోయినా, నేనే నిర్మాతగా, దర్శకుడిగా సినిమా చేసుకుంటాను. 

అంత నాలెడ్జ్‌ నాకు లేదు... 

- మంచి రాజకీయ నాయకుడైనా, చెడ్డ రాజకీయ నాయకుడైనా, ఎవరైనా సరే, రాజకీయాలంటే పూర్తి అవగాహన ఉండాలి. నాకు రాజకీయాలపై అంత నాలెడ్జ్‌ లేదు. సినిమాలో ఉన్నాం కదా, పాపులారిటీ ఉంది కదా, అని రాజకీయాల్లోకి వచ్చేస్తాం అని రాకూడదు. సినిమాల్లో కూడా ఉండి మంచి చేయవచ్చు. నా గత చిత్రం జైహింద్‌2 సినిమాను తెలుగు, తమిళం, కన్నడంలో విడుదల చేశాం. కన్నడంలో నా సినిమా స్టేట్‌ అవార్డ్‌ కూడా వచ్చింది. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై సామాన్యుడి పోరాటమే ఆ చిత్రం. అలాంటి సినిమాలు చేయడం కూడా మంచి పరిణామమే. దేశభక్తి అంటే సరిహద్దుల్లో కాపలా కాయడమొక్కటే కాదు దేశానికి ఉపయోగపడే మంచి పని ఏది చేసిన అది దేశభక్తే అవుతుంది. అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటివన్నీ దేశభక్తి కిందికే వస్తాయి. 

మా అమ్మాయితో సినిమా చేస్తున్నాను... 

- నా కుమార్తె ఐశ్వర్య ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాను. షూటింగ్‌ కూడా అయిపోవచ్చింది. తమిళం, కన్నడలో చేస్తున్నాను. నా కూతురిని సినిమాలోకి తీసుకొచ్చేటప్పుడు చాలా మంది ఎందుకు అని అన్నారు. 35 ఏళ్లుగా నేనున్న పరిశ్రమనే నేను నమ్మలేకపోతే ఎలా. ప్రతి దాంట్లో తప్పుంటుంది, ఒప్పుంటుంది. అది మన మీదే ఆధారపడి ఉంటుంది..అని ఇంటర్వ్యూ ముగించారు.  

Action King Arjun Lie Movie Interview:

Action King Arjun Talks About Lie Movie and His Personal experience 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs