Advertisement
Google Ads BL

స్పెషల్: ఏపీ పై మోడీ మనస్సులో ఏముంది?


అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇండియాలోనే నెంబర్ వన్ గా గుజరాత్ రాష్ట్రం ఉంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందినదిగా గుర్తించాలంటే దానికి ప్రధాన కొలమానం పారిశ్రామికీకరణ. మొదటి నుండి మోడి  గుజరాత్ ను పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి పరిచాడు. అందుకనే భారతదేశంలో గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కాగా భారత్ లో మరో ఏ రాష్ట్రం కూడా గుజరాత్ కు ధీటుగా అభివృద్ధి చెందలేదా? అలా చెందే అవకాశం లేదా?  అంటే ఎందుకు లేదు అనే చెప్పవచ్చు. భారత్ లో గుజరాత్ వలే సమాన వనరులు ఉన్న రాష్ట్రాలుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా తప్పకుండా వస్తే గుజరాత్ కు ధీటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందగలదు.

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్ విభజనకు గురికావడంతో కోలుకోలేని దెబ్బపడింది.  ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ వాళ్ళు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా హామీని ఇచ్చారు. కానీ ప్రకటించలేదు. విభజన కాకమీదున్న ప్రజలు ఆ విషయాన్ని అంతలా పట్టించుకోలేదు. వెంకయ్య నాయుడు మాత్రం అప్పట్లో తమదైన చలోక్తులతో (ఆయనకు జనాకర్షణ, నేతల వశమే ప్రధానం కదా) ఆ.. ఐదేళ్లు  కాదు, పదేళ్లు కావాలని కోరాడు. అలా  విభజన బిల్లును పార్లమెంట్ లో ఇరుపార్టీలు (కాంగ్రెస్, భాజపాలు) పాస్ చేయించుకున్నాయి. ఆ వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీల త్రయం ప్రజలను ఆకర్షించడం, ఎన్నికలప్పుడు కూడా వెంకయ్య నాయుడు 10 ఏళ్లు అన్న ప్రత్యేకహోదాను చంద్రబాబు 15 ఏళ్లు అనడం, అలా కేంద్రంలో మోడీ, ఆంధ్రాలో బాబు అధికారంలోకి రావడం జరిగిపోయింది. అలా ప్రత్యేకహోదా అంటే ఏమిటో కూడా తెలియని ప్రజలు దాని మీద ఆసక్తితో తెలుసుకోవడం ప్రారంభించారు.

అలా అనుకూల ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో ఏపీ అభివృద్ధికి డోకా లేదనుకున్నారు ప్రజలు. ఆ విధంగా ఇప్పటికి రెండున్నరేళ్ళు గడచాయి. ప్రత్యేక హోదా రాలేదు సరికదా అభివృద్ధే మందగించింది. హామీలు ఇచ్చిన భాజపా మాటలు మారిపోయాయి. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు పుష్కలంగా ఉండటం కారణంగా హోదా ఇవ్వడానికి కేంద్రం జంకుతుందన్నది ప్రధాన వాదన.  ప్రత్యేక హోదా ఇస్తే కంపెనీలు తప్పకుండా వచ్చితీరుతాయి అప్పుడు త్వరితగతిన ఆంధ్రా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. అదీ విషయం, అలా అవుతుంది కాబట్టే మోడీ ఆలోచనలో ఆసూయ రేగిందన్నది స్పష్టమౌతున్న అంశం. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ, భాజపా చేసిన ఫైట్ ఇవన్నీ గాలికి వదిలేసి, ఒక్కసారిగా కేంద్రప్రభుత్వం హోదాపై వెనుతిరగడం చాలా చోద్యంగా అగపడుతున్న అంశం. కాగా మోడీ మనస్సులో కూడా గుజరాత్ నంబర్ వన్ గా ఉన్నన్నాళ్ళు ఆయన ప్రధాని పీఠానికి డోకా ఉండదన్న అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ విధంగా మోడీ ఆంధ్రాను నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా గుజరాత్ కంటే ఆంధ్రా అభివృద్ధి చెందినట్లయితే మోడీ ఇమేజ్ తగ్గి బాబుకు ఇమేజ్ సొంతం అవుతుందనే అభిప్రాయంలో కూడా మోడీ ఉన్నట్లు తెలుస్తుంది.  అందులో భాగంగానే పవన్ పై పోరాడటానికి మోడీ ప్రత్యక్షంగా కాకుండా భాజపా నేతలతో పరోక్షంలో ఉండినడిపిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకనే భాజపా రాష్ట్ర స్థాయి నేత విష్ణువర్ధన్ నుండి ఢిల్లీ స్థాయి నేత సిద్ధర్థ్ నాథ్ సింగ్ వరకు పవన్ కు కౌంటర్ ఇవ్వడమే పనిగా పెట్టుకొని మాటల దాడి చేస్తున్నారు. ఇంకా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఆంధ్రాకు తాము ప్రత్యేకహోదా కాకుండా విఐపి హోదా ఇచ్చామని వివరించాడు. తాము ఇప్పటికే ఏపీకి రూ 25,00 కోట్ల వరకు ఇచ్చామని,  మరో వెయ్యి కోట్లు అంచలంచెలుగా  ఇస్తామని తెలిపాడు.  ఎక్కడా లేని విధంగా ఇప్పటికే ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు కేటాయించామన్నారు. అందులో 9 విద్యాసంస్థలను అప్పుడే ప్రారంభించామని కూడా తెలిపాడు.  ఇంకా త్వరలో నెల్లూరు జిల్లాకు సముద్ర తీరా ప్రాంత అధ్యయనానికి ఓ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. కాగా ఇవన్నీ కూడా హోదాతో సమానం కాదని, కంటి తుడుపు చర్యలుగా వచ్చినవేనని, ప్రధాని మనస్సు ఏపీపై భిన్నంగా వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs