Advertisement
Google Ads BL

హీరో అవ్వాలని రాలేదు: సిద్దార్థ హీరో సాగర్


మంచి పాత్రలొస్తే తప్పకుండా చేస్తా  - హీరో సాగర్

Advertisement
CJ Advs

టివి రంగంలో మొగలి రేకులు సీరియల్ రేపిన సంచలనం మాములుగా లేదు. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్న ఈ సీరియల్ లో ఆర్ కె నాయుడు గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు నటుడు సాగర్. ఆ తరువాత పలు టివి సీరియల్స్ లో నటించిన సాగర్ హీరోగా 'మాన్ అఫ్ ది మ్యాచ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తరువాత సాగర్ హీరోగా నటిస్తున్న తాజా  చిత్రం 'సిద్దార్థ'. కేవీ దయానంద్ రెడ్డి దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకం పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. రాగిణి నంద్విని హీరోయిన్,  ఆగష్టు 16 న సాగర్ పుట్టినరోజు సందర్బంగా  హీరో సాగర్ చెప్పిన విశేషాలు ...  

సిద్దార్థ కథ .. ... 

ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ. ఇందులో నేను రాయల సీమలో ఉండే కుర్రాడిగా కనిపిస్తాను, కథ రాయల సీమలో మొదలయిన కూడా అది మలేషియాకు టర్న్ అవుతుంది. మాస్, యాక్షన్ లవ్ అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో అసలు పాయింట్ ఏమిటన్నది తెరమీద చూస్తేనే బాగుంటుంది. 

ఎక్కువ సమయం పట్టలేదు .. 

ఈ సినిమా ప్రచారం మొదలు పెట్టి దాదాపు ఏడాది అవుతుంది. అంతే కానీ ఎప్పుడో మొదలు పెట్టిన సినిమా కాదు. చివరి షెడ్యూల్ ఈ మద్యే చిత్రీకరించాం. ఈ నెల చివర్లో పాటలను విడుదల చేసి, చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం. 

సినిమాకు, టివికి పెద్ద తేడా లేదు .. 

నేను టివి రంగంనుండి సినిమాల్లోకి వచ్చిన వాడిని, నటన విషయంలో టివికి , సినిమాకు పెద్దగా తేడా ఏమి ఉండదు. సీరియల్ లో అయితే లాంగ్ టర్మ్ నటించాలి, కానీ సినిమాలో అలా కాదు. 

మంచి టెక్నీకల్ టీమ్ తో .. 

ఈ సినిమాకు ఇంద్ర, నరసింహ నాయుడు వంటి భారీ సినిమాలను పనిచేసిన టీమ్ పనిచేయడం చాలా  అదృష్టం గా భావిస్తున్నాను. ఎందుకంటే .. మణిశర్మ సంగీతం, పరుచూరి బ్రదర్స్ మాటలు, ఇక ఎస్ గోపాల్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ, నిజంగా ఇలాంటి  హై టెక్నీకల్ టీమ్ ను ఈ సినిమాకు సెట్ చేసినందుకు మా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు థాంక్స్ చెప్పాలి. సినిమా మొత్తం చాలా గ్రాండియర్ గా ఉంటుంది. 

హీరో అవ్వాలని రాలేదు .. 

కరీంనగర్ దగ్గరలోని ఎన్టీపిసిలో నాన్న పనిచేసేవాడు, అక్కడే టెన్త్ వరకు చదువుకున్నాను, ఆ తరువాత ఇంటర్, డిగ్రీ .. గుంటూరులో చదివా, ఇక ఎంఎస్సి కంప్యూటర్స్ సైన్స్ హైద్రాబాద్ లోనే చేశా. నటనపై ఉన్న ఆసక్తి తో  మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరా. ఆ తరువాత మూడు, నాలుగు ఏళ్ళు అవకాశల కోసం స్ట్రగుల్స్ పడ్డా, ఇక లాభం లేదు .. సాఫ్ట్ వెర్ సైడ్ వెళదాం అనుకున్న సమయంలో చక్రవాకం సీరియల్ లో ఛాన్స్ వచ్చింది,  అలా కెరీర్ స్టార్ట్ అయింది.. కానీ నేను ఎప్పుడు హీరో అవ్వాలని అనుకోలేదు. 

సినిమాలపైనే దృష్టి .. 

ఇప్పుడు సినిమాలపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు సీరియల్స్ చేస్తా,. అలాగే టివి రంగం కోసం ఓ ప్రొడక్షన్ కంపెనీ కూడా పెట్టాలని ఉంది. దాంట్లో సీరియల్స్ నిర్మిస్తా .. ఇక హీరోగానే కాకుండా ఇతర సినిమాల్లో మంచి పాత్రలొస్తే .. తప్పకుండా చేస్తా. 

సిద్దార్థ్ అందరికి నచ్చుతాడు .. 

అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ఉన్న సినిమా ఇది. తప్పకుండా  నా కెరీర్ కు బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నాను. మా నిర్మాత కిరణ్ కుమార్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం...అని తెలిపారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs